టొయోటా హైరైడర్ (Toyota Hyryder) హైబ్రిడ్ కారు గురించి తెలుసుకోవాల్సిన 7 ఇంట్రెస్టింగ్ డీటేల్స్..

భారత ప్యాసింజర్ కార్ మార్కెట్లో కాంపాక్ట్ ఎస్‌యూవీలకు ఎంత డిమాండ్ ఉందో మిడ్-సైజ్ ఎస్‌యూవీలకు కూడా అంతే డిమాండ్ ఉంది. ఈ విభాగంలో హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, ఎమ్‌జి హెక్టర్, టాటా హారియర్ వంటి మోడళ్లు డామినేటింగ్‌గా ఉండగా, ఈ రేసులోకి తాజాగా స్కోడా కుషాక్ మరియు ఫోక్స్‌వ్యాగన్ టైగన్ వంటి కార్లు వచ్చి చేరాయి. అయితే, ఈ మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో ఇటు మారుతి సుజుకి కంపెనీకి కానీ లేదా అటు టొయోటా కంపెనీకి కానీ ఎలాంటి మోడల్ లేదు.

టొయోటా హైరైడర్ (Toyota Hyryder) హైబ్రిడ్ కారు గురించి తెలుసుకోవాల్సిన 7 ఇంట్రెస్టింగ్ డీటేల్స్..

అయితే, ఇప్పుడు ఈ ఇరు కంపెనీలు కలిసి అభివృద్ధి చేసిన ఓ మిడ్-సైజ్ ఎస్‌యూవీ త్వరలోనే మార్కెట్లో విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉంది. జపనీస్ కంపెనీ టొయోటా ముందుగా ఈ మిడ్-సైజ్ ఎస్‌యూవీని దేశీయ విపణిలో విడుదల చేయనుంది. టొయోటా హైరైడర్ (Toyota Hyryder) పేరుతో ఇది రాబోతోంది. ఆ తర్వాత మారుతి సుజుకి ఇదే కారును కొద్దిగా డిజైన్ మార్చి టొయోటా కన్నా తక్కువ ధరతో విభిన్నమైన పేరుతో మార్కెట్లో విడుదల చేసే అవకాశం ఉంది.

టొయోటా హైరైడర్ (Toyota Hyryder) హైబ్రిడ్ కారు గురించి తెలుసుకోవాల్సిన 7 ఇంట్రెస్టింగ్ డీటేల్స్..

మరికొద్ది రోజుల్లోనే టొయోటా తమ హైరైడర్ మిడ్-సైజ్ ఎస్‌యూవీని మార్కెట్లో విడుదల చేయనున్న నేపథ్యంలో, కంపెనీ ఈ కారుకి సంబంధించిన వివరాలను టీజర్ల రూపంలో ఒక్కొక్కటిగా వెల్లడి చేస్తూ వస్తోంది. సమాచారం ప్రకారం, ఈ కొత్త ఎస్‌యూవీ జూలై 1న విడుదల కానుంది. టొయోటా ఇప్పటి వరకూ విడుదల చేసిన టీజర్లలో ఈ కొత్త ఎస్‌యూవీకి సంబంధించిన 7 ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

టొయోటా హైరైడర్ (Toyota Hyryder) హైబ్రిడ్ కారు గురించి తెలుసుకోవాల్సిన 7 ఇంట్రెస్టింగ్ డీటేల్స్..

1. పూర్తి ఎల్ఈడి లైట్లు

టొయోటా హైరైడర్ (Toyota Hyryder) కోసం కంపెనీ విడుదల చేసిన మొదటి టీజర్ చిత్రాలను గమనిస్తే, కంపెనీ ఈ హైబ్రిడ్ కారు యొక్క ఎల్ఈడి లైటింగ్ ఫీచర్లను మరియు ఫ్రంట్ డిజైన్ ఎలిమెంట్స్‌ను హైలైట్ చేసింది. ఇది ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లు, స్ప్లిట్ టైప్ ఎల్ఈడి హెడ్‌ల్యాంప్, ఎల్ఈడి టెయిల్ లైట్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. ఇంకా ఈ టీజర్ వీడియోలో కొత్త ఎస్‌యూవీ యొక్క ముందు భాగం కూడా పాక్షికంగా వెల్లడైంది. ఇవన్నీ కూడా టొయోటా హైరైడర్ ని చాలా ఆకర్షణీయంగా కనిపించేలా చేసే ఫీచర్లు.

టొయోటా హైరైడర్ (Toyota Hyryder) హైబ్రిడ్ కారు గురించి తెలుసుకోవాల్సిన 7 ఇంట్రెస్టింగ్ డీటేల్స్..

2. హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్

టొయోటా హైరైడర్ హైబ్రిడ్ కారు అనేది దాని టీజర్ల నుండి స్పష్టంగా తెలుస్తోంది. అయితే, ఈ కారు విషయంలో ఇదివరకు లీకైన ఓ పత్రం ప్రకారం, రాబోయే కొత్త టొయోటా హైరైడర్ ఎస్‌యూవీ రెండు రకాల హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌ల ఆప్షన్ లను కలిగి ఉందని వెల్లడించింది. అంటే, ఈ కొత్త ఎస్‌యూవీని కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు ఈ రెండు పవర్‌ట్రెయిన్ యూనిట్‌ లలో దేనినైనా ఒకదానిని ఎంపిక చేసుకోవచ్చని లీక్ అయిన పత్రాలు వెల్లడిస్తున్నాయి. ఈ రెండు పవర్‌ట్రైన్‌ లు కూడా ఒకే రకమైన 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ తో రానున్నాయి.

టొయోటా హైరైడర్ (Toyota Hyryder) హైబ్రిడ్ కారు గురించి తెలుసుకోవాల్సిన 7 ఇంట్రెస్టింగ్ డీటేల్స్..

అయితే, ఈ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌ లలో ఒకటి తేలికపాటి (మైల్డ్) హైబ్రిడ్ యూనిట్ కాగా మరొక పవర్‌ట్రెయిన్ బలమైన (స్ట్రాంగ్) హైబ్రిడ్ యూనిట్ గా ఉంటుంది. ఇందులోని 1.5 లీటర్ మైల్డ్-హైబ్రిడ్ ఇంజన్ గరిష్టంగా 101.6 బిహెచ్‌పిల శక్తిని విడుదల చేస్తుంది. కాగా, 1.5-లీటర్ స్ట్రాంగ్-హైబ్రిడ్ యూనిట్ కాస్తంత ఎక్కువగా 114.5 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది మరియు ఇది ప్రత్యేకమైన eCVT గేర్‌బాక్స్‌ తో జతచేయబడి ఉంటుంది. ఈ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజన్ తక్కువ దూరాలను EV మోడ్‌లో కవర్ చేయడానికి అధునాతన సెల్ఫ్-ఛార్జింగ్ సామర్ధ్యంతో వస్తుందని సమాచారం.

టొయోటా హైరైడర్ (Toyota Hyryder) హైబ్రిడ్ కారు గురించి తెలుసుకోవాల్సిన 7 ఇంట్రెస్టింగ్ డీటేల్స్..

3. ప్రీమియం డ్యూయెల్ టోన్ అల్లాయ్ వీల్స్

సరికొత్త టొయోటా హైరైడర్ ఎస్‌యూవీలో డ్యూయెల్ టోన్ అల్లాయ్ వీల్స్ లభ్యం కానున్నాయి. కంపెనీ వీటిని కూడా తమ టీజర్లలో వెల్లడి చేసింది. ఈ సరికొత్త అల్లాయ్ వీల్స్ తో రాబోతున్న ఈ కారు చాలా స్పోర్టీగా ఉంటుందని వాటి డిజైన్ చూస్తే అర్థమవుతుంది. ఈ అల్లాయ్ వీల్స్ కారుకి ప్రీమియం లుక్ ని తెచ్చిపెట్టడంతో పాటుగా మంచి స్టైల్ ను కూడా జోడించనుంది.

టొయోటా హైరైడర్ (Toyota Hyryder) హైబ్రిడ్ కారు గురించి తెలుసుకోవాల్సిన 7 ఇంట్రెస్టింగ్ డీటేల్స్..

4. పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్

టొయోటా తమ హైరైడర్ కారులో ఉపయోగించబోయే కొత్త టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కూడా టీజర్లలో వెల్లడించింది. ఇది 9 ఇంచ్ పరిమాణంలో ఉండి, ఫెథర్ టచ్ కంట్రోల్ బటన్స్ ని కలిగి ఉంటుంది. గతంలో టొయోటా గ్లాంజా కారులో కూడా ఇదే రకమైన ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ను ఉపయోగించారు. అయితే, ఇది దాని కన్నా పెద్దదిగా కనిపిస్తోంది మరియు స్మార్ట్ ప్లేకాస్ట్ ప్రో సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ ప్లే వంటి ఫీచర్లను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

టొయోటా హైరైడర్ (Toyota Hyryder) హైబ్రిడ్ కారు గురించి తెలుసుకోవాల్సిన 7 ఇంట్రెస్టింగ్ డీటేల్స్..

5. లేటెస్ట్ కార్ కనెక్షన్ టెక్నాలజీ

కార్లలో ఇప్పుడు కనెక్టింగ్ టెక్నాలజీ అనేది ఓ సర్వసాధారణమైన ఫీచర్ గా మారిపోయింది. ఈ నేపథ్యంలో, టొయోటా కూడా తమ హైరైడర్ హైబ్రిడ్ కారులో లేటెస్ట్ 'కార్ కనెక్షన్' టెక్నాలజీని కూడా అందించనుంది. ఈ ఫీచర్‌ను టొయోటా ఐ-కనెక్ట్ పేరుతో అందించనున్నట్లు సమాచారం. ఈ ఫీచర్‌ని కూడా మనం టొయోటా గ్లాంజా కారులో చూశాం. అయితే, ఇది గ్లాంజా హ్యాచ్‌బ్యాక్ లో కంటే హైరైడర్‌లో మరిన్ని అదనపు కనెక్టింగ్ ఫీచర్లను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఇందులో వాయిస్ కమాండ్స్ కూడా ఉండొచ్చని ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ ని చూస్తే అర్థమవుతోంది.

టొయోటా హైరైడర్ (Toyota Hyryder) హైబ్రిడ్ కారు గురించి తెలుసుకోవాల్సిన 7 ఇంట్రెస్టింగ్ డీటేల్స్..

6. ఆటోమేటిక్ ఎయిర్ కండిషనింగ్ కంట్రోల్స్

కొత్త టొయోటా హైరైడర్ హైబ్రిడ్ కారులో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ ఉంటుందని కంపెనీ విడుదల చేసిన రెండవ టీజర్ వీడియో ధృవీకరిస్తోంది. అధునాతన టొయోటా గ్లాంజా కారులోనూ ఇదే ఫీచర్‌ ని మనం చూడవచ్చు. టొయోటా కార్ కనెక్టివిటీ టెక్నాలజీ ద్వారా దీన్ని కంట్రోల్ చేయవచ్చు. ఇది కారు యజమానులు వారి కారులోని వాతావరణ నియంత్రణ వ్యవస్థను (టెంపరేచర్ కంట్రోల్ సిస్టమ్) ను రిమోట్‌గా వారి ఫోన్ సాయంతో నియంత్రించడానికి అనుమతిస్తుంది.

టొయోటా హైరైడర్ (Toyota Hyryder) హైబ్రిడ్ కారు గురించి తెలుసుకోవాల్సిన 7 ఇంట్రెస్టింగ్ డీటేల్స్..

7. లెథర్ తో కవర్ చేయబడిన ప్రీమియం డ్యాష్‌బోర్డ్

టొయోటా తమ హైరైడర్ హైబ్రిడ్ కారు క్యాబిన్ లోపల ప్రీమియం అనుభూతిని అందించేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా కంపెనీ ఈ కారులో అనేక చోట్ల హార్డ్ ప్లాస్టిక్ మెటీరియల్స్ కి బదులుగా సాఫ్ట్ టచ్ మెటీరియల్స్ ని ఉపయోగించింది. ఈ కారులో ప్రధానంగా డ్యాష్‌బోర్డులో ఏసి వెంట్స్ కి దిగువ లెథర్ తో కప్పబడినట్లుగా టీజర్ చిత్రాలలో కనిపిస్తుంది.

టొయోటా హైరైడర్ (Toyota Hyryder) హైబ్రిడ్ కారు గురించి తెలుసుకోవాల్సిన 7 ఇంట్రెస్టింగ్ డీటేల్స్..

మరిన్ని ఇతర ఫీచర్లు..

సరికొత్త టొయోటా హైరైడర్ హైబ్రిడ్ ఎస్‌యూవీలో ఆశించదగిన ఇతర ఫీచర్లలో వైర్‌లెస్ ఛార్జింగ్, ఎయిర్ ప్యూరిఫైయర్, 360-డిగ్రీ సరౌండ్-వ్యూ కెమెరా, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఈబిడితో కూడిన ఏబిఎస్, ట్రాక్షన్ కంట్రోల్ (TC), టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), రియర్ పార్కింగ్ సెన్సార్‌లు, రియర్ వ్యూ కెమెరా మొదలైనవి ఉండొచ్చని అంచనా. ఈ కారుకి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Wednesday, June 29, 2022, 9:27 [IST]
English summary
Toyota urban cruiser hyryder s top 7 features list
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+