విడుదలకు సిద్దమవుతున్న 5 డోర్స్ ఆఫ్-రోడర్స్: ధర రూ. 20 లక్షలకంటే తక్కువే

ఇప్పటికే భారతదేశంలో 3 డోర్స్ ఆఫ్ రోడింగ్ వాహనాలను మంచి డిమాండ్ ఉంది, కావున మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్నాయి. అయితే ఈ ఆఫ్ రోడింగ్ వాహనాల్లో 5 డోర్స్ కావాలనుకునే కస్టమర్లు ఎక్కువమందే ఉన్నారు. వీరిని దృష్టిలో ఉంచుకుని కంపెనీలు ఇప్పుడు 5 డోర్స్ కార్లను విడుదల చేయడానికి సన్నాహాలు సిద్ధం చేసుకుంటున్నాయి.

Recommended Video

Maruti Alto K10 Launched At Rs 3.99 Lakh In Telugu | What’s New On The Hatchback? Dual-Jet VVT & AMT

ఇందులో మహీంద్రా కంపెనీ యొక్క థార్ 5 డోర్స్, మారుతి సుజుకి జిమ్నీ 5-డోర్ మరియు ఫోర్స్ గూర్ఖా 5 డోర్స్ వంటివి ఉన్నాయి. ఇవన్నీ రూ. 20 లక్షల కంటే తక్కువ ధర వద్ద అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. అంతే కాకూండా ఇవి ఇప్పటికే టెస్టింగ్ దశలో ఉండటం కూడా ఒక పెద్ద గుడ్ న్యూస్..

విడుదలకు సిద్దమవుతున్న 5 డోర్స్ ఆఫ్-రోడర్స్: ధర రూ. 20 లక్షలకంటే తక్కువే

మహీంద్రా థార్ (Mahindra Thar) 5-డోర్స్:

భారతీయ వాహన తయారు దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా యొక్క 3 డోర్స్ థార్ ఇప్పటికే అందుబాటులో ఉంది. ఇది మార్కెట్లో అడుగుపెట్టిన రోజు నుంచి ఇప్పటికి కూడా దీనికున్న డిమాండ్ ఏ మాత్రం తగ్గడం లేదు. అయితే కస్టమర్ల అభిలాష మేరకు కంపెనీ 5-డోర్ వెర్షన్‌ తీసుకురానున్నట్లు ఇప్పటికే తెలిపింది.

విడుదలకు సిద్దమవుతున్న 5 డోర్స్ ఆఫ్-రోడర్స్: ధర రూ. 20 లక్షలకంటే తక్కువే

ఇప్పటికే మహీంద్రా థార్ యొక్క 5 డోర్స్ వెర్షన్ స్పాట్ టెస్ట్ లో కూడా కనిపించింది. ఇది దేశీయ మార్కెట్లో 2023 నాటికి విడుదలయ్యే అవకాశం కూడా ఉన్నట్లు కంపెనీ తెలిపింది. ఇది ప్రస్తుతం అందుబాటులో ఉన్న థార్ కంటే కూడా కొంత పెద్దదిగా ఉంటుంది.

విడుదలకు సిద్దమవుతున్న 5 డోర్స్ ఆఫ్-రోడర్స్: ధర రూ. 20 లక్షలకంటే తక్కువే

ఈ కొత్త 5 డోర్స్ మహీంద్రా థార్ అదే 2.2-లీటర్ డీజిల్ ఇంజన్‌తో 4-వీల్ డ్రైవ్ మరియు మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలతో రానున్నట్లు సమాచారం. ఇది పెట్రోల్-4WD పవర్‌ట్రెయిన్‌ను పొందినప్పటికీ, అది మార్కెట్ డిమాండ్‌పై ఆధారపడి ఉంటుంది. 4WD ఎంపికతో కూడిన 5-డోర్ల మోడల్ ధర రూ. 15 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి రూ. 19 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండవచ్చని భావిస్తున్నాము.

విడుదలకు సిద్దమవుతున్న 5 డోర్స్ ఆఫ్-రోడర్స్: ధర రూ. 20 లక్షలకంటే తక్కువే

మారుతి సుజుకి జిమ్నీ (Maruti Suzuki Jimny) 5-డోర్స్:

ఎక్కువమంది ఇష్టపడే ఆఫ్ రోడింగ్ వాహనాల్లో మారుతి సుజుకి యొక్క జిమ్ని ఒకటి. ఇది 2018 లో గ్లోబల్‌గా అరంగేట్రం చేసినప్పటి నుండి భారతదేశానికి వచ్చే వరకు భారతీయ కొనుగోలుదారులు ఎంతో ఆతృతగా వేచి చూస్తూనే ఉన్నారు. అయితే మొత్తానికి 2020 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో ఇది దర్శనమిచ్చింది. అయితే ఇది కేవలం ఎగుమతి చేయడానికి మాత్రమే భారతీయ మార్కెట్లో తయారుచేయబడింది. అయితే త్వరలో రానున్న 5 డోర్స్ వెర్షన్ మోడల్ భారతీయ మార్కెట్ కోసం రానుంది.

విడుదలకు సిద్దమవుతున్న 5 డోర్స్ ఆఫ్-రోడర్స్: ధర రూ. 20 లక్షలకంటే తక్కువే

రానున్న ఈ 5 డోర్స్ మారుతి జిమ్నీ ఇప్పటికే స్పాట్ టెస్ట్ లో కనిపించింది. కావున ఇది మార్కెట్లో విడుదల కావడానికి ఇంక ఎంతో సమయం లేదు అని స్పష్టంగా తెలుస్తుంది. ఇది సాధారణ జిమ్ని లాగానే 103 పిఎస్ పవర్ అందించే 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో రావచ్చని భావిస్తున్నారు.

విడుదలకు సిద్దమవుతున్న 5 డోర్స్ ఆఫ్-రోడర్స్: ధర రూ. 20 లక్షలకంటే తక్కువే

కొత్త 5 డోర్స్ మారుతి సుజుకి జిమ్నీ 2WD మరియు 4WD వెర్షన్‌లలో అందించబడినట్లయితే, దీని ధర రూ. 12 లక్షల నుండి రూ. 18 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉండే అవకాశం ఉంటుందని ఆశిస్తున్నాము. అయితే ఖచ్చితమైన ధరలు త్వరలో వెల్లడవుతాయి.

విడుదలకు సిద్దమవుతున్న 5 డోర్స్ ఆఫ్-రోడర్స్: ధర రూ. 20 లక్షలకంటే తక్కువే

ఫోర్స్ గూర్ఖా (Force Gurkha) 5-డోర్స్:

ఫోర్స్ మోటార్స్ యొక్క గూర్ఖా కూడా అత్యంత ప్రజాదరణ పొందిన ఆఫ్ రోడర్. ఇది ప్రత్యేకంగా మహీంద్రా థార్ మరియు జిమ్నీ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. 2021 కొత్త ఫోర్స్ గుర్ఖా అందుబాటులోకి వచ్చింది. అయితే ఇది దేశీయ మార్కెట్లో విడుదలైన అతి తక్కువ కాలంలోనే 5 డోర్స్ వెర్షన్ రాబోతోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఈ లేటెస్ట్ గుర్ఖా కూడా మంచి అమ్మకాలను పొందుతోంది.

విడుదలకు సిద్దమవుతున్న 5 డోర్స్ ఆఫ్-రోడర్స్: ధర రూ. 20 లక్షలకంటే తక్కువే

5-డోర్స్ గూర్ఖా ఇప్పటికే ఉత్పత్తికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికీ చాలా సార్లు టెస్టింగ్ దశలో కనిపించింది. కావున ఇది స్కార్పియో లాగా మూడవ వరుస కెప్టెన్ సీట్లు పొందుతుందని భావిస్తున్నారు. ఇది దాని స్టాండర్డ్ మోడల్ లోని అదే 2.6 లీటర్ డీజిల్ ఇంజిన్‌ పొందే అవకాశం ఉంది. కావున తప్పకుండా మంచి పనితీరుని అందిస్తుంది. ధరల విషయానికి వస్తే ఇది దాదాపు రూ. 18 లక్షల వారు ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న మోడల్ ధర రూ. 14.5 లక్షల వరకు ఉంది.

విడుదలకు సిద్దమవుతున్న 5 డోర్స్ ఆఫ్-రోడర్స్: ధర రూ. 20 లక్షలకంటే తక్కువే

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

ఇప్పటికే ఆఫ్ రోడింగ్ ప్రేమికులు సాధారణ మహీంద్రా థార్, జిమ్ని మరియు గుర్ఖా కోసం ఎదురుచూస్తున్నారు, అంతలోనే ఇందులో 5 డోర్స్ మోడల్స్ రావడం అనేది వారికి మంచి శుభవార్త అనే చెప్పాలి. ఇవి ఎప్పుడు మార్కెట్లో విడుదలవుతాయి అనేది ఖచ్చితంగా తెలియదు. అయితే ఎక్కువరోజులు పట్టే అవకాశం లేదని మాత్రం తెలుస్తోంది. వీటి గురించి మరిన్ని వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' ఛానల్ చూస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Monday, August 22, 2022, 14:59 [IST]
English summary
Upcoming 5 door off road suvs launches in india under 20 lakhs
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+