భారత్‌లో విడుదలకావడానికి సిద్దమవుతున్న 7 సీటర్ కార్లు - వివరాలు

భారతీయ మార్కెట్లో ఎస్‌యువిలకు మరియు ఎమ్‌పివిలకు మంచి ఆదరణ ఉందన్న విషయం అందరికీ తెలుసు. అయితే ఇందులో 5 సీటర్ ఎస్‌యువిలకు ఎంత డిమాండ్ ఉందొ 7 సీటర్ ఎస్‌యువిలకు కూడా అంతే డిమాండ్ ఉంది. ఈ కారణంగానే చాలా కంపెనీలు దేశీయ మార్కెట్లోకి 7 సీటర్ కార్లను కూడా విరివిగానే విడుదల చేస్తున్నాయి. అయితే రానున్న రోజుల్లో భారతీయ విఫణిలో విడుదలకావడానికి సిద్దమవుతున్న 7 సీటర్లు కూడా ఉన్నాయి. అలాంటి ఐదు 7 సీటర్ కార్లను గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

భారత్‌లో విడుదలకావడానికి సిద్దమవుతున్న 7 సీటర్ కార్లు - వివరాలు

టయోటా ఇన్నోవా హైక్రాస్ [Toyota Innova Hycross]:

దేశీయ మార్కెట్లో ఇప్పటికే అత్యంత ప్రజాదరణ పొందిన టయోటా కంపెనీ దేశీయ మార్కెట్లో మరో 7 సీటర్ 'ఇన్నోవా హైక్రాస్' విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. అయితే ఇది దేశీయ మార్కెట్లో విడుదలకానున్న ఎమ్‌పివి. టయోటా ఇన్నోవాకు ప్రత్యామ్నాయంగా కంపెనీ ఇన్నోవా హైక్రాస్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తోంది.

భారత్‌లో విడుదలకావడానికి సిద్దమవుతున్న 7 సీటర్ కార్లు - వివరాలు

త్వరలో దేశీయ మార్కెట్లో విడుదలకానున్న కొత్త 'ఇన్నోవా హైక్రాస్' ఇన్నోవా క్రిస్టా యొక్క హై-ఎండ్ వేరియంట్. ఇది లాడర్ ఫ్రేమ్ ఛాసిస్‌కు బదులుగా మోనోకోక్ ఛాసిస్‌పై నిర్మించబడి ఉంటుంది. కావున ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. అదే సమయంలో ఇది పెట్రోల్ ఇంజిన్‌తో ఫ్రంట్ వీల్ డ్రైవ్ పవర్‌ట్రెయిన్ ఆప్సన్ పొందే అవకాశం ఉంటుంది.

భారత్‌లో విడుదలకావడానికి సిద్దమవుతున్న 7 సీటర్ కార్లు - వివరాలు

ఇన్నోవా హైక్రాస్ బేస్డ్ మారుతి సుజుకి ఎమ్‌పివి:

మారుతి సుజుకి కంపెనీ టయోటా భాగస్వామ్యంతో భారత మార్కెట్లో అనేక మోడళ్లను విడుదల చేసింది. టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ ఆధారంగా హైబ్రిడ్ ఎస్‌యూవీని విడుదల చేసిన మారుతి సుజుకి ఇప్పుడు టయోటా ఇన్నోవా హైక్రాస్ ఆధారంగా ఒక ఎస్‌యూవీని విడుదల చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తోంది.

భారత్‌లో విడుదలకావడానికి సిద్దమవుతున్న 7 సీటర్ కార్లు - వివరాలు

మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి సుజుకి ఎమ్‌పివి యొక్క టెక్నాలజీ, ఫీచర్లు మరియు ఇంజిన్ మొదలైనవన్నీ కూడా ఇన్నోవా హైక్రాస్ నుండి ప్రేరణ పొందింది. అయితే డిజైన్ మాత్రం కొంత భిన్నంగా ఉండే అవకాశం ఉంటుంది. అయితే దీని గురించి మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి.

భారత్‌లో విడుదలకావడానికి సిద్దమవుతున్న 7 సీటర్ కార్లు - వివరాలు

ఫోర్స్ గూర్ఖా 5 డోర్స్:

ఫోర్స్ మోటార్స్ యొక్క ఫోర్స్ గూర్ఖా ఇప్పటికే మంచి ప్రజాదరణ పొందిన ఆఫ్ రోడర్ గా నిలిచింది. ఇది మార్కెట్లో మహీంద్రా థార్ కి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. అయితే ఫోర్స్ గూర్ఖా ఇప్పుడు 5 డోర్స్ వేరియంట్ లో రానుంది. ఇప్పటికే చాలా సార్లు ఈ మోడల్ టెస్టింగ్ సమయంలో కనిపించింది. కావున ఇది దేశీయ మార్కెట్లో త్వరలోనే విడుదలయ్యే అవకాశం ఉంది.

భారత్‌లో విడుదలకావడానికి సిద్దమవుతున్న 7 సీటర్ కార్లు - వివరాలు

ఫోర్స్ గూర్ఖా త్వరలో 5 డోర్స్ కలిగి 7 సీట్లు కలిగి ఉండే అవకాశం ఉంటుంది. కావున ఇందులో ఎక్కువమంది ప్రయాణించడానికి అనుకూలంగా ఉంటుంది. కావున తప్పకుండా దేశీయ మార్కెట్లో మరింత ఆదరణ పొందుతుందని ఆశిస్తున్నాము.

భారత్‌లో విడుదలకావడానికి సిద్దమవుతున్న 7 సీటర్ కార్లు - వివరాలు

సిట్రోయెన్ సి3 బేస్డ్ ఎమ్‌పివి:

ఫ్రెంచ్ వాహన తయారీ సంస్థ అయిన సిట్రోయెన్ కంపెనీ ఇప్పటికే సి5 ఎయిర్ క్రాస్ మరియు సి3 అనే SUV ని దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. అయితే ఇప్పుడు సి3 SUV ఆధారంగా 7 సీటర్ వేరియంట్ తీసుకురావడానికి తగిన సన్నాహాలు సిద్ధం చేస్తోంది. ఇది త్వరలోనే మార్కెట్లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే దీని ధర సి3 కంటే కూడా చాలా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇది టర్బోచార్జ్డ్ ఇంజిన్‌తో ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ ఆప్సన్ లో విడుదలయ్యే అవకాశం ఉంటుంది.

భారత్‌లో విడుదలకావడానికి సిద్దమవుతున్న 7 సీటర్ కార్లు - వివరాలు

నిస్సాన్ ఎక్స్-ట్రైల్:

నిస్సాన్ కంపెనీ ఇటీవల ఒకే సారి మూడు SUV లను ఆవిష్కరించింది. ఇందులో ఒకటి 'నిస్సాన్ ఎక్స్-ట్రైల్'. ఇది ఒక ప్రీమియం ఎస్‌యువి, కావున 5 సీటర్ లేదా 7 సీటర్ వేరియంట్స్ గా విడుదలయ్యే అవకాశం ఉంటుంది. ఇది CMF-C ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించబడి ఉంటుంది.

భారత్‌లో విడుదలకావడానికి సిద్దమవుతున్న 7 సీటర్ కార్లు - వివరాలు

నిస్సాన్ ఎక్స్-ట్రైల్ (Nissan X-Trail) 2.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ లేదా 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ మైల్డ్-హైబ్రిడ్ ఇంజిన్ ఆప్సన్లను పొందే అవకాశం ఉంది. ఈ SUV యొక్క హైబ్రిడ్ వెర్షన్ 4WD (ఫోర్-వీల్ డ్రైవ్) తో రానుంది, అయితే నాన్ హైబ్రిడ్ మోడల్ FWD (ఫ్రంట్-వీల్ డ్రైవ్) సిస్టమ్‌ను పొందుతుంది. ఎక్స్-ట్రైల్ CVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో అందుబాటులోకి రానుంది. అంతే కాకూండా ఇందులో మడ్, స్నో మరియు గ్రావెల్ అనే మూడు డ్రైవింగ్ మోడ్స్ కూడా ఉండనున్నాయి.

భారత్‌లో విడుదలకావడానికి సిద్దమవుతున్న 7 సీటర్ కార్లు - వివరాలు

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

సాధారణంగా కుటుంబసమేతంగా ప్రయాణించాలనుకునేవారికి ఈ 7 సీటర్ కార్లు చాలా ఉపయోగపడతాయి. ఈ కారణంగానే ఎక్కువమంది కొనుగోలుదారులు 7 సీటర్ కార్లను కొనుగోలుచేయడానికి ఆసక్తి చూపుతారు. అయితే త్వరలో విడుదలకానున్న ఈ కొత్త 7 సీటర్ కార్లు కూడా తప్పకుండా మంచి ఆదరణ పొందే అవకాశం ఉందని భావిస్తున్నాము.

More from DriveSpark

Article Published On: Saturday, October 29, 2022, 13:03 [IST]
English summary
Upcoming 7 seater suv in india toyota innova hycross citroen c3 mpv nissan x trail and more
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+