దేశీయ మార్కెట్లో త్వరలో విడుదల కానున్న కొత్త కార్ల జాబితా.. ఇక్కడ చూడండి

ఈ రోజుతో 2022 ఫిబ్రవరి నెల కూడా ముగుస్తుంది. ఇక మార్చి నెల ప్రారంభం కానుంది. ఈ నెలలో దేశీయ మార్కేలో అధునాతన కార్లు విడుదలయ్యాయి. మార్చి నెలలో కూడా భారతీయ మార్కెట్లో విడుదల కావడానికి చాలా కంపెనీల యొక్క లేటెస్ట్ కార్లు వేచి చూస్తున్నాయి. ఇందులో స్కోడా స్లావియా, 2022 బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్4 ఫేస్‌లిఫ్ట్, టొయోటా గ్లాంజా ఫేస్‌లిఫ్ట్, టయోటా హైలక్స్ మరియు ఎమ్‌జి జెడ్‌ఎస్ ఈవీ వంటివి ఉన్నాయి. వీటి గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

దేశీయ మార్కెట్లో త్వరలో విడుదల కానున్న కొత్త కార్ల జాబితా.. ఇక్కడ చూడండి

స్కోడా స్లావియా (Skoda Slavia):

చెక్ రిపబ్లిక్ కార్ తయారీ సంస్థ స్కోడా (Skoda) భారతీయ మార్కెట్లో తన కొత్త సెడాన్ అయిన స్లావియా (Slavia) ను విడుదల చేయనుంది. ఇది రెండు ఇంజన్ ఆప్సన్స్ తో అందుబాటులోకి రానుంది. అయితే ఇందులోని 1.0 లీటర్ టిఎస్ఐ ఇంజిన్ ఈ రోజు (ఫిబ్రవరి 28) అధికారికంగా విడుదల కానుంది. కానీ ఇందులోని రెండవ మోడల్ అయిన 1.5 లీటర్ టిఎస్ఐ ఇంజిన్ మార్చి 03 న విడుదల కానుంది.

దేశీయ మార్కెట్లో త్వరలో విడుదల కానున్న కొత్త కార్ల జాబితా.. ఇక్కడ చూడండి

స్కోడా స్లావియా కంపెనీ యొక్క MQB AI IN ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించబడుతుంది. ఇప్పటికే కంపెనీ తన స్లావియా ఉత్పత్తిని ప్రారంభించింది. అంతే కాకుండా టెస్ట్ డ్రైవ్ కూడా ప్రారంభమయ్యాయి, కావున డెలివరీ త్వరలోనే ప్రారంభమవుతాయి. కొత్త స్లావియా ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి చాలా అద్భుతంగా ఉంటుంది.

దేశీయ మార్కెట్లో త్వరలో విడుదల కానున్న కొత్త కార్ల జాబితా.. ఇక్కడ చూడండి

స్కోడా స్లావియా యొక్క 1.0-లీటర్ TSI టర్బో పెట్రోల్ ఇంజన్ 115 బిహెచ్‌పి పవర్ మరియు 178 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్సన్ పొందుతుంది. ఇక 1.5 లీటర్ TSI టర్బో పెట్రోల్ ఇంజన్ 150 బిహెచ్‌పి పవర్ మరియు 250 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇవి రెండూ కూడా మంచి పనితీరుని అందిస్తాయి.

దేశీయ మార్కెట్లో త్వరలో విడుదల కానున్న కొత్త కార్ల జాబితా.. ఇక్కడ చూడండి

లెక్సస్ ఎన్‌హెచ్ 350 హెచ్ (Lexus NX 350h):

ప్రముఖ లగ్జరీ కార్ తయారీ సంస్థ 'లెక్సస్ ఇండియా' తన రెండవ తరం NX 350h SUV ని భారతదేశంలో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఇది 2022 మార్చి 09 న అధికారికంగా విడుదల కానుంది. లెక్సస్ ఇండియా ఈ సంవత్సరం ప్రారంభంలో భారతదేశంలో రెండవ తరం లెక్సస్ ఎన్‌హెచ్ 350 హెచ్ SUV కోసం ప్రీ-బుకింగ్‌లను ప్రారంభించింది.

దేశీయ మార్కెట్లో త్వరలో విడుదల కానున్న కొత్త కార్ల జాబితా.. ఇక్కడ చూడండి

Lexus NX 350h SUV యొక్క ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో బ్రాండ్ యొక్క ఎలక్ట్రిక్ డ్రైవ్‌తో 2.5-లీటర్, 4-సిలిండర్ ఇంజిన్‌ ఉంటుంది. ఇది గరిష్టంగా 236 బిహెచ్‌పి పవర్ అందిస్తుంది. ఈ ఇంజన్ ఎలక్ట్రానిక్ కంట్రోల్డ్ కంటిన్యూయస్లీ వేరియబుల్ ట్రాన్స్‌మిషన్ (ECVT) మరియు నాలుగు చక్రాలకు శక్తిని పంపే పాడిల్ షిఫ్టర్‌లతో జత చేయబడింది. కావున మంచి పనితీరుని అందిస్తుంది.

దేశీయ మార్కెట్లో త్వరలో విడుదల కానున్న కొత్త కార్ల జాబితా.. ఇక్కడ చూడండి

2022 బిఎండబ్ల్యు ఎక్స్4 ఫేస్‌లిఫ్ట్ (2022 BMW X4 Facelift):

ప్రముఖ జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ 'బిఎండబ్ల్యు ఇండియా' ఎక్స్ సిరీస్‌లో తన అప్డేటెడ్ మోడల్ అయిన బిఎండబ్ల్యు ఎక్స్4 ఫేస్‌లిఫ్ట్ (BMW X4 Facelift) ఇప్పటికే కంపెనీ తన ఎక్స్4 ఫేస్‌లిఫ్ట్ టీజర్ విడుదల చేసింది. ఈ అప్డేటెడ్ మోడల్ 2022 మార్చిలో విడుదలకానుంది.

దేశీయ మార్కెట్లో త్వరలో విడుదల కానున్న కొత్త కార్ల జాబితా.. ఇక్కడ చూడండి

కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, ఈ మోడల్‌ను స్థానికంగానే ఉత్పత్తిచేసే అవకాశం ఉంటుంది. ఈ కొత్త తరం BMW X4 SUV గత సంవత్సరం ప్రారంభంలో ప్రపంచ మార్కెట్లలో ప్రవేశపెట్టబడింది. ఇది ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. ఇది వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

దేశీయ మార్కెట్లో త్వరలో విడుదల కానున్న కొత్త కార్ల జాబితా.. ఇక్కడ చూడండి

టయోటా గ్లాంజా ఫేస్‌లిఫ్ట్ (Toyota Glanza Facelift):

టయోటా కంపెనీ యొక్క 'టయోటా గ్లాంజా' ఇప్పటికే భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్. అయితే కంపెనీ దీనిని ఇప్పుడు ఫేస్‌లిఫ్ట్ మోడల్ లో తీసుకురావడానికి సన్నాహాలు సిద్ధం చేస్తోంది. కావున టయోటా గ్లాంజా ఫేస్‌లిఫ్ట్ (Toyota Glanza Facelift) త్వరలో భారతీయ మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంటుంది.

దేశీయ మార్కెట్లో త్వరలో విడుదల కానున్న కొత్త కార్ల జాబితా.. ఇక్కడ చూడండి

త్వరలో రానున్న కొత్త టయోటా గ్లాంజా కొత్త బాలెనో కంటే కూడా చాలా వరకు భిన్నమైన స్టైలింగ్‌తో పాటు ఆధునిక ఇంటీరియర్‌లను పొందుతుంది. కంపెనీ ఈ కారు ధరను 2022 మార్చిలో ప్రకటించే అవకాశం ఉంటుంది. అంతే కాకూండా దీని ఉత్పత్తి కూడా త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది.

దేశీయ మార్కెట్లో త్వరలో విడుదల కానున్న కొత్త కార్ల జాబితా.. ఇక్కడ చూడండి

టయోటా హైలక్స్ (Toyota Hilux):

ఇటీవల దేశీయ మార్కెట్లో ఆవిష్కరించబడిన టయోటా హైలక్స్ (Toyota Hilux) విపరీతమైన ప్రజాదరణ పొందుతోంది. ఇది అద్భుతమైన డిజైన్ కలిగి ఉండటమే కాకుండా, ఆధునిక ఫీచర్స్ కూడా పొందుతుంది. ఇప్పటికే కంపెనీ ఈ వెహికల్ యొక్క బుకింగ్స్ ప్రారంభించింది, కావున బుక్ చేసుకోవాలనుకునే వారు ఈ లైఫ్ స్టైల్ ట్రక్కును రూ. 1 లక్ష చెల్లించి బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు త్వరలోనే జరిగే అవకాశం ఉంటుందని ఆశిస్తున్నాము.

దేశీయ మార్కెట్లో త్వరలో విడుదల కానున్న కొత్త కార్ల జాబితా.. ఇక్కడ చూడండి

టయోటా హైలక్స్ ని కంపెనీ IMV-2 ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించింది. ఈ కొత్త వెహికల్ 5-సీటర్ వెహికల్ గా ఉండబోతోంది. ఇది సిటీ మరియు ఆఫ్-రోడ్ రెండింటిలోనూ ఉపయోగపడుతుంది. డీజిల్ ఇంజన్ ఆప్సన్ లో మాత్రమే కంపెనీ దీనిని అందుబాటులోకి తీసుకురాబోతోంది. కొత్త టయోటా హైలక్స్ మొత్తం 5 కలర్ ఆప్సన్ లో తీసుకురానుంది. అవి ఎమోషనల్ రెడ్, గ్రే మెటాలిక్, వైట్ పెరల్ సిఎస్, సిల్వర్ మెటాలిక్ మరియు సూపర్ వైట్ కలర్స్.

దేశీయ మార్కెట్లో త్వరలో విడుదల కానున్న కొత్త కార్ల జాబితా.. ఇక్కడ చూడండి

ఎంజి జెడ్ఎస్ ఈవి (MG ZS EV):

భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన ఎంజి మోటార్ కంపెనీ త్వరలో కొత్త MG ZS EV ఫేస్‌లిఫ్ట్ తీసుకురానుంది. ఇది చాలా వరకు దాని మునుపటి స్టాండర్డ్ వేరియంట్ కంటే భిన్నంగా మరియు లేటెస్ట్ ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇప్పటికే దీని బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. కావున ఇది దేశీయ మార్కెట్లో విడుదలైన వెంటనే డెలివరీలు ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది.

దేశీయ మార్కెట్లో త్వరలో విడుదల కానున్న కొత్త కార్ల జాబితా.. ఇక్కడ చూడండి

ఎంజి మోటార్ కంపెనీ తన కొత్త ZS EV రెండు వేరియంట్లలో తీసుకురానుంది. అవి ఎక్సైట్ మరియు ఎక్స్‌క్లూజివ్ వేరియంట్స్. దీని అధికారిక ధర ఇంకా వెల్లడవ్వలేదు, కానీ దీని ప్రారంభ ధర రూ. 21.49 లక్షల నుండి వుండే అవకాశం ఉంటుంది. ఇది దాని స్టాండర్డ్ వెర్షన్ కంటే కూడా మంది పనితీరుని అందిస్తుంది.

More from DriveSpark

Article Published On: Monday, February 28, 2022, 10:04 [IST]
English summary
Upcoming car launch march 2022 slavia hilux mg zs ev glanza facelift details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+