పండుగ సీజన్‌లో సందడి చేయనున్న కొత్త కార్లు.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు..!

భారతదేశంలో మరికొద్ది రోజుల్లోనే పండుగ సీజన్ ప్రారంభం కాబోతోంది. ఈ పండుగ సీజన్ మార్కెట్ సెంటిమెంట్‌ను క్యాష్ చేసుకునేందుకు కార్ కంపెనీలు కూడా సిద్ధమవుతున్నాయి. మారుతి సుజుకి, హ్యుందాయ్, మహీంద్రా, కియా, టొయోటా వంటి కంపెనీ ఈ పండుగ సీజన్‌లో తమ కొత్త ఉత్పత్తులను కస్టమర్లకు అందుబాటులోకి తీసుకురానున్నాయి.

Recommended Video

Maruti Alto K10 Launched At Rs 3.99 Lakh In Telugu | What’s New On The Hatchback? Dual-Jet VVT & AMT

ఒకవేళ మీరు కూడా కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నట్లయితే, ఈ దీపావళి సీజన్ వరకూ వేచి ఉండండి. కార్ కంపెనీలు తమ ప్రస్తుత మోడళ్లపై ఫెస్టివల్ ఆఫర్లను ప్రకటించడంతో పాటుగా కొత్త కార్లను కూడా మార్కెట్లోకి తీసుకురానున్నాయి. మరి ఈ పండుగ సీజన్ లో సందడి చేయనున్న ఆ కొత్త మోడళ్లు ఏవో ఈ కథనంలో చూద్దాం రండి..!

పండుగ సీజన్‌లో సందడి చేయనున్న కొత్త కార్లు.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు..!

1. హ్యుందాయ్ వెన్యూ ఎన్-లైన్ (Hyundai Venue N-Line)

హ్యుందాయ్ మోటార్ ఇండియా సెప్టెంబర్ 6వ తేదీన తమ సరికొత్త వెన్యూ ఎన్-లైన్ (Hyundai Venue N-Line) ఎస్‌యూవీని భారత మార్కెట్లో విడుదల చేయనుంది. కొత్త వెన్యూ ఎన్-లైన్‌ స్పోర్టీ క్యారెక్టర్‌తో రాబోతోంది. స్టాండర్డ్ మోడల్‌తో పోల్చుకుంటే, ఎన్-లైన్ మోడల్ కారు వెలుపల మరియు లోపల రెడ్ హైలైట్లతో చాలా స్పోర్టీగా కనిపిస్తుంది. ఇది ఎన్6 మరియు లైన్ ఎన్8 అనే రెండు వేరియంట్‌లలో రెండు సింగిల్-టోన్ మరియు మూడు డ్యూయెల్-టోన్ కలర్ ఆప్షన్లలో లభ్యం కానుంది. ఈ మోడల్ కోసం దేశవ్యాప్తంగా బుకింగ్‌లు కూడా ప్రారంభమయ్యాయి.

పండుగ సీజన్‌లో సందడి చేయనున్న కొత్త కార్లు.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు..!

2. మహీంద్రా ఎక్స్‌యూవీ400 ఈవీ (Mahindra XUV400 EV)

ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా నుండి ఎంతో ఆసక్తిగా చూస్తున్న ఎదురుచూస్తున్న నెక్స్ట్ జనరేషన్ ఎలక్ట్రిక్ కారు ఎక్స్‌యూవీ400 ఈవీ కూడా ఈ ఏడాది పండుగ సీజన్ లో మార్కెట్లో విడుదల కానుంది. మహీంద్రా ఎక్స్‌యూవీ300 కాంపాక్ట్ ఎస్‌యూవీ ఆధారంగా రూపొందించిన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ మహీంద్రా ఎక్స్‌యూవీ400 ఈవీ సెప్టెంబర్ 8వ తేదీన విడుదల కానుంది. మహీంద్రా ఎక్స్‌యూవీ400 ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ ను తొలిసారిగా ఆటో ఎక్స్‌పో 2020లో ప్రదర్శించింది మరియు ఇప్పుడు ఇది ప్రొడక్షన్ దశకు చేరుకుంది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ముందుగా 350V పవర్‌ట్రెయిన్‌తో రానుంది మరియు ఆ తర్వాతి కాలంలో మరింత శక్తివంతమైన 380V పవర్‌ట్రైన్‌తో వచ్చే అవకాశం ఉంది.

పండుగ సీజన్‌లో సందడి చేయనున్న కొత్త కార్లు.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు..!

3. టొయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ (Toyota Urban Cruiser Hyryder)

మారుతి సుజుకి మరియు టొయోటా కంపెనీలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన మొట్టమొదటి హైబ్రిడ్ ఎస్‌యూవీ టొయోటా హైరైడర్ ను కంపెనీ ఇప్పటికే వెల్లడి చేసింది. అంతేకాకుండా, టొయోటా ఈ ఎస్‌యూవీ కోసం రూ.25,000 టోకెన్ అడ్వాన్సుతో బుకింగ్‌ లను కూడా స్వీకరిస్తోంది. మైల్డ్ హైబ్రిడ్ మరియు స్ట్రాంగ్ హైబ్రిడ్ పవర్‌ట్రైన్ ఆప్షన్లతో రానున్న టొయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో విడుదల చేయబడుతుంది మరియు ఈ మోడల్ డెలివరీలు కూడా ప్రస్తుత పండుగ సీజన్‌లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

పండుగ సీజన్‌లో సందడి చేయనున్న కొత్త కార్లు.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు..!

4. మారుతి గ్రాండ్ విటారా (Maruti Suzuki Grand Vitara)

టొయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్‌ మోడల్‌నే మారుతి సుజుకి గ్రాండ్ విటారా అనే పేరుతో రీబ్యాడ్జ్ చేసి విక్రయించనుంది. ఈ రెండు మోడళ్లు డిజైన్ పరంగా చూడటానికి వేర్వేరుగా ఉన్నప్పటికీ, వాటిలో ఉపయోగించిన పరికరాలు, ప్లాట్‌ఫామ్ మరియు పవర్‌ట్రైన్స్ అన్నీ కూడా దాదాపుగా ఒకేలా ఉంటాయి. ఈ రెండు మోడళ్లను కూడా టొయోటా తమ ప్లాంట్‌లోనే తయారు చేస్తోంది. మారుతి సుజుకి గ్రాండ్ విటారా ఇప్పటికే ఆవిష్కరించబడింది మరియు కంపెనీ ఈ మోడల్ కోసం బుకింగ్ లను కూడా స్వీకరిస్తోంది. అయితే, ఈ ఎస్‌యూవీ ధరలను మాత్రం సెప్టెంబర్ నెలాఖరు లేదా అక్టోబర్‌లో వెల్లడించే అవకాశం ఉంది.

పండుగ సీజన్‌లో సందడి చేయనున్న కొత్త కార్లు.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు..!

5. కియా సొనెట్ X-లైన్ (Kia Sonet X-Line)

హ్యుందాయ్ తమ వెన్యూ ఎస్‌యూవీలో ఎన్-లైన్ స్పోర్టీ వెర్షన్‌ను ప్రవేశపెట్టినట్లుగానే, దాని అనుబంధ సంస్థ అయిన కియా కూడా తమ కాంపాక్ట్ ఎస్‌యూవీ సోనెట్ లో ఎక్స్-లైన్ పేరిట ఓ స్పోర్టీ వెర్షన్ ను విడుదల చేయనుంది. కియా ఇప్పటికే తమ సోనెట్ ఎక్స్-లైన్ టీజర్ ను కూడా విడుదల చేసింది. ఇది సెప్టెంబర్ చివరి నాటికి మార్కెట్లో అధికారికంగా అమ్మకానికి వచ్చే అవకాశం ఉంది. కియా ఇండియా విడుదల చేసిన టీజర్ ప్రకారం, సోనెట్ ఎక్స్-లైన్ నలుపు రంగులో ప్రత్యేకంగా పెయింట్ చేయబడి ఉంది మరియు బయటవైపు చాలా ప్రదేశాలలో మ్యాట్ ఫినిషింగ్ కనిపిస్తోంది. స్టాండర్డ్ మోడల్‌తో పోలిస్తే, ఈ ఎక్స్-లైన్ ను మరింత వేరుగా ఉంచేందుకు కంపెనీ దీని ఎక్ట్సీరియర్‌ మరియు ఇంటీరియర్లలో అనేక మార్పులు చేయనుంది.

పండుగ సీజన్‌లో సందడి చేయనున్న కొత్త కార్లు.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు..!

6. ఎమ్‌జి హెక్టర్ ఫేస్‌లిఫ్ట్ (MG Hector Facelift)

చైనీస్ యాజమాన్యంలో ఉన్న బ్రిటీష్ కార్ బ్రాండ్ ఎమ్‌జి మోటార్ ఇండియా, భారత మార్కెట్లో తమ హెక్టర్ ఎస్‌యూవీని అప్‌గ్రేడ్ చేసేందుకు సిద్ధమైంది. ప్రస్తుత మార్కెట్ ట్రెండ్‌కు అనుగుణంగా అప్‌గ్రేడ్ చేయబడిన కొత్త 2022 ఎమ్‌జి హెక్టర్ ఫేస్‌లిఫ్ట్‌ ఎస్‌యూవీని కంపెనీ ఈ ఏడాది పండుగ సీజన్‌ లో విడుదల చేసే అవకాశం ఉంది. ఇటీవలే కంపెనీ కొత్త హెక్టర్ ఫేస్‌లిఫ్ట్ యొక్క టీజర్‌ను కూడా విడుదల చేసింది. ఈ టీజర్ లో క్యాబిన్‌ లో ఇవ్వబడిన కొత్త టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ను హైలైట్ చేశారు. అంతేకాకుండా, ఇది ఎమ్‌జి ఆస్టర్ మాదిరిగా అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ ఫీచర్లతో రావచ్చని భావిస్తున్నారు. వచ్చే నెలలో ఇది మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది.

పండుగ సీజన్‌లో సందడి చేయనున్న కొత్త కార్లు.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు..!

7. మహీంద్రా ఎక్స్‌యూవీ300 ఫేస్‌లిఫ్ట్ (Mahindra XUV300 Facelift)

ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా అందిస్తున్న సేఫెస్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఎక్స్‌యూవీ300 (Mahindra XUV300) లో ఓ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా, కంపెనీ తమ కొత్త 2022 మహీంద్రా ఎక్స్‌యూవీ300 యొక్క టీజర్‌ను కూడా ఇటీవలే విడుదల చేసింది. ఈ కొత్త మోడల్‌లో కాస్మెటిక్ అప్‌గ్రేడ్స్ కంటే కూడా మెకానికల్ అప్‌గ్రేడ్స్‌ని కలిగి ఉంటుందని సమాచారం. ఈ టీజర్‌లో ముందు వైపు మహీంద్రా బ్రాండ్ యొక్క కొత్త ట్విన్ పీక్స్ లోగో మాత్రమే గుర్తించదగిన మార్పుగా కనిపిస్తుంది, మిగతా డిజైన్ అంతా దాదాపుగా ప్రస్తుత మోడల్ మాదిరిగానే ఉంది. అయితే, ఇది ప్రస్తుతం లభిస్తున్న ఇంజన్ల కన్నా మరింత శక్తివంతమైన ఇంజన్లతో రావచ్చని సమాచారం.

More from DriveSpark

Article Published On: Saturday, August 27, 2022, 8:00 [IST]
English summary
Upcoming car launches in india during this festive season
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+