భారత మార్కెట్లో హ్యుందాయ్ నుండి రాబోయే సరికొత్త కార్లు.. క్రెటా ఫేస్‌లిఫ్ట్, కోనా ఫేస్‌లిఫ్ట్ మరియు ఐయానిక్ 5

కొరియన్ కార్ కంపెనీ హ్యుందాయ్ ప్రస్తుతం భారతదేశంలో రెండవ అతిపెద్ద కార్ల తయారీ సంస్థగా ఉన్న సంగతి మనందరికీ తెలిసినదే. అయితే, టాటా మోటార్స్ నుండి పెరుగుతున్న పోటీతో కంపెనీ త్వరలోనే తన రెండవ స్థానాన్ని కోల్పోయే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, హ్యుందాయ్ భారత మార్కెట్లో తన ద్వితీయ స్థానాన్ని మరింత పదిలం చేసుకునేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తోంది. ఇందులో భాగంగా, మార్కెట్లోకి సరికొత్త ఉత్పత్తులను ప్రవేశపెడుతూ, తన ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోని విస్తరించుకుంటోంది.

భారత మార్కెట్లో హ్యుందాయ్ నుండి రాబోయే సరికొత్త కార్లు.. క్రెటా ఫేస్‌లిఫ్ట్, కోనా ఫేస్‌లిఫ్ట్ మరియు ఐయానిక్ 5.

కొత్త 2023 హ్యుందాయ్ క్రెటా

హ్యుందాయ్ మోటార్ ఇండియా రానున్న రోజుల్లో భారతదేశంలో పలు కొత్త మోడళ్లను విడుదల చేయనుంది. వీటిలో కొన్ని ఫేస్‌లిఫ్ట్ వెర్షన్లతో పాటుగా పూర్తిగా కొత్త మోడళ్లు కూడా ఉండనున్నాయి. హ్యుందాయ్ నుండి ముందుగా ఆశించే మొదటి కొత్త ఉత్పత్తి క్రెటా ఫేస్‌లిఫ్ట్. హ్యుందాయ్ మోటార్ ఇండియా ప్రతి రెండేళ్లకు ఒకసారి ఈ మిడ్-సైజ్ ఎస్‌యూవీని అప్‌గ్రేడ్ చేస్తూ వస్తోంది. ఇందులో కొత్త రిఫ్రెష్డ్ మోడల్ మార్కెట్లోకి వచ్చిన ప్రతిసారి అది విజయవంతంగానే నిలిచింది.

భారత మార్కెట్లో హ్యుందాయ్ నుండి రాబోయే సరికొత్త కార్లు.. క్రెటా ఫేస్‌లిఫ్ట్, కోనా ఫేస్‌లిఫ్ట్ మరియు ఐయానిక్ 5.

ఇదే బాటలో హ్యుందాయ్ ఈ ఏడాది చివరినాటికి లేదా వచ్చే ఏడాది ఆరంభంలో తమ కొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ క్రెటా ఎస్‌యూవీని మార్కెట్లో విడుదల చేసే అవకాశం ఉంది. కొత్తగా రాబోయే 2023 హ్యుందాయ్ క్రెటా (2023 Hyundai Creta) రిఫ్రెష్డ్ డిజైన్ మరియు అప్-మార్కెట్ ఇంటీరియర్ రానుంది. ఈ మోడల్ ఇప్పటికే పలు అంతర్జాతీయ మార్కెట్లలో ఆవిష్కరించబడింది, ఇది చూడటానికి మరింత అగ్రెసివ్ గా కనిపించే డిజైన్ వైఖరిని కలిగి ఉంటుంది. ఇందులో కాస్మెటిక్ అప్‌గ్రేడ్స్ మరియు ఫీచర్ అప్‌డేట్స్ మినహా యాంత్రికంగా ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు మరియు దాని ఓవరాల్ డిజైన్ సిల్హౌట్ కూడా మారదు.

భారత మార్కెట్లో హ్యుందాయ్ నుండి రాబోయే సరికొత్త కార్లు.. క్రెటా ఫేస్‌లిఫ్ట్, కోనా ఫేస్‌లిఫ్ట్ మరియు ఐయానిక్ 5.

హ్యుందాయ్ ఇటీవలే భారత మార్కెట్లో విడుదల చేసిన తమ ప్రీమియం ఎస్‌యూవీని టూసాన్ మాదిరిగానే, కొత్త 2023 హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ ను కూడా కంపెనీ యొక్క కొత్త సెన్సుయస్ స్పోర్టీనెస్ డిజైన్ ఫిలాసఫీని అనుసరించి రూపందించినట్లు తెలుస్తోంది. వాస్తవానికి, కొత్త 2023 క్రెటా ముందు భాగం డిజైన్ చాలా వరకూ కొత్త తరం టూసాన్ నుండి ప్రేరణ పొందినట్లుగా అనిపిస్తుంది. ఈ కొత్త మోడల్ లో ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లను అనుసంధానించే కొత్త పారామెట్రిక్ జ్యువెల్ ప్యాటర్న్ గ్రిల్ ఉంటుంది, ఇది మునుపటి కన్నా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

భారత మార్కెట్లో హ్యుందాయ్ నుండి రాబోయే సరికొత్త కార్లు.. క్రెటా ఫేస్‌లిఫ్ట్, కోనా ఫేస్‌లిఫ్ట్ మరియు ఐయానిక్ 5.

సమాచారం ప్రకారం, 2023 హ్యుందాయ్ క్రెటా మోడల్ లో అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS) ఫీచర్లను కూడా అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎమ్‌జి గ్లోస్టర్, ఎమ్‌జి ఆస్టర్ మరియు ఎక్స్‌యూవీ700 వంటి మోడళ్లలో కనిపించే అనేక రకాల అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ ఫీచర్లను కొత్త తరం హ్యుందాయ్ క్రెటాలో కూడా ఆశించవచ్చు. ఇంకా ఇందులో కొత్త డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, అప్‌డేట్ చేయబడిన బ్లూలింక్ కనెక్టింగ్ టెక్నాలజీ, 360 డిగ్రీ కెమెరా, వెహికల్ ట్రాకింగ్ మరియు ఇంజన్ ఇమ్మొబిలైజర్ వంటి ఫీచర్లను కూడా ఆఫర్ చేసే అవకాశం ఉంది.

భారత మార్కెట్లో హ్యుందాయ్ నుండి రాబోయే సరికొత్త కార్లు.. క్రెటా ఫేస్‌లిఫ్ట్, కోనా ఫేస్‌లిఫ్ట్ మరియు ఐయానిక్ 5.

హ్యుందాయ్ కోన ఫేస్‌లిఫ్ట్

హ్యుందాయ్ అందిస్తున్న ఆల్-ఎలక్ట్రిక్ కారు కోనా (Kona) లో కంపెనీ ఓ కొత్త అప్‌డేటెడ్ మోడల్‌ను మార్కెట్లో విడుద చేసేందుకు ప్లాన్ చేస్తోంది. భారత ఈవీ మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో పెరుగుతున్న పోటీని సమర్థవంతంగా ఎదుర్కునేందుకు కంపెనీ కొత్త మోడళ్లను విడుదల చేయడంతో పాటుగా తమ ప్రస్తుత మోడల్ అయిన కోనాను కూడా రిఫ్రెష్ చేయనుంది. ఈ కొత్త మోడల్ అప్‌డేటెడ్ డిజైన్ మరియు పెద్ద బ్యాటరీ ప్యాక్‌తో అందుబాటులోకి రావచ్చని సమాచారం. ప్రస్తుతం, మార్కెట్లో ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ధరలు రూ. 23.84 లక్షల నుండి రూ. 24.03 లక్షల (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) మధ్యలో ఉన్నాయి.

భారత మార్కెట్లో హ్యుందాయ్ నుండి రాబోయే సరికొత్త కార్లు.. క్రెటా ఫేస్‌లిఫ్ట్, కోనా ఫేస్‌లిఫ్ట్ మరియు ఐయానిక్ 5.

హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 39.2 kWh బ్యాటరీ ప్యాక్‌ తో పనిచేస్తుంది. ఇది పూర్తి చార్జ్ పై గరిష్టంగా 452 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అందిస్తుందని కంపెనీ చెబుతోంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 134 బిహెచ్‌పి శక్తిని మరియు 395 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ మోటార్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. కోనా ఈవి కేవలం 9.7 సెకండ్లలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోగలదు. చార్జింగ్ విషయానికి వస్తే, ఇందులోని బ్యాటరీ ప్యాక్‌ను స్టాండర్డ్ ఏసి ఛార్జర్ ఉపయోగించి 100 శాతం ఛార్జ్ చేయడానికి ఆరు గంటలు పడుతుంది. అదే ఫాస్ట్ ఛార్జర్‌తో అయితే, కేవలం 57 నిమిషాల్లో బ్యాటరీ 80 శాతం వరకూ చార్జ్ అవుతుంది.

భారత మార్కెట్లో హ్యుందాయ్ నుండి రాబోయే సరికొత్త కార్లు.. క్రెటా ఫేస్‌లిఫ్ట్, కోనా ఫేస్‌లిఫ్ట్ మరియు ఐయానిక్ 5.

హ్యుందాయ్ ఐయానిక్ 5 ఈవీ

హ్యుందాయ్ నుండి రాబోయే మరో సరికొత్త ఎలక్ట్రిక్ కారు హ్యుందాయ్ ఐయానిక్ 5. కియా ఈవీ6 ప్లాట్‌ఫామ్‌ను పంచుకునే ఈ మోడల్‌ను హ్యుందాయ్ భారతదేశంలోనే అసెంబుల్ చేసి, కియా ఈవీ6 కన్నా తక్కువ ధరకే విక్రయించాలని చూస్తోంది. హ్యుందాయ్ ఐయానిక్ 5 ఇప్పటికే భారత రోడ్లపై పలు సందర్భాల్లో టెస్టింగ్ దశలో ఉండగా గుర్తించబడింది. ఐయానిక్ 5 హ్యుందాయ్‌కి భారతదేశంలో రెండవ ఎలక్ట్రిక్ కారు అవుతుంది. ఇది కియా ఈవీ6 ను తయారు చేసిన అదే e-GMP ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి తయారు చేయబడింది.

భారత మార్కెట్లో హ్యుందాయ్ నుండి రాబోయే సరికొత్త కార్లు.. క్రెటా ఫేస్‌లిఫ్ట్, కోనా ఫేస్‌లిఫ్ట్ మరియు ఐయానిక్ 5.

హ్యుందాయ్ ఐయానిక్ 5 గ్లోబల్ మార్కెట్లలో రెండు పవర్‌ట్రైన్ ఆప్షన్లతో లభిస్తుంది. వీటిలో చిన్న 58kWh బ్యాటరీ ప్యాక్ మరియు పెద్ద 72.6kWh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు ఉన్నాయి. అలాగే, ఇది 2WD (టూ-వీల్ డ్రైవ్) మరియు AWD (ఆల్-వీల్ డ్రైవ్) వేరియంట్‌లలో కూడా లభిస్తుంది. కాగా, వీటిలో ఏయే స్పెసిఫికేషన్ వెర్షన్ ను భారతదేశంలో విడుదల చేస్తారనే విషయంపై ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం లేదు. ధరను పరిగణలోకి తీసుకుంటే, కంపెనీ చిన్న బ్యాటరీ ప్యాక్ మరియు టూవీల్ డ్రైవ్ లేఅవుట్‌తో కూడిన వేరియంట్‌ను భారతదేశంలో విడుదల చేయవచ్చని తెలుస్తోంది.

More from DriveSpark

Article Published On: Wednesday, October 19, 2022, 11:14 [IST]
English summary
Upcoming cars and evs from hyundai motor india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+