జూన్ 2022లో విడుదల కాబోయే సరికొత్త కార్లు..: స్కార్పియో-ఎన్, వెన్యూ ఫేస్‌లిఫ్ట్ మరెన్నో..

భారత ఆటోమొబైల్ మార్కెట్లో జూన్ 2022 నెలలో సందడి వాతావరణం కనిపించనుంది. వచ్చే నెలలో వివిధ కార్ల తయారీదారులు తమ కొత్త ఉత్పత్తులను భారతదేశంలో లాంచ్ చేయడానికి సిద్ధమవుతున్నాయి. ఫ్రెంచ్ కార్ బ్రాండ్ సిట్రోయెన్ తమ చిన్న ఎస్‌యూవీ సి3 తో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. అదే సమయంలో మహీంద్రా తమ సరికొత్త తరం స్కార్పియో-ఎన్ మోడల్‌తో తమ విజయ పతాకాన్ని మరింత ఎత్తుకు ఎగురవేయనుంది. హ్యుందాయ్, కియా, మారుతి సుజుకి కంపెనీలు కూడా కొత్త మోడళ్ల విడుదలతో మార్కెట్లో పోటీని మరింత పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. మరి వచ్చే నెలలో విడుదల కాబోయే ఆ టాప్ 5 కార్లు ఏంటో ఈ కథనంలో చూద్దాం రండి.

జూన్ 2022లో విడుదల కాబోయే సరికొత్త కార్లు..: స్కార్పియో-ఎన్, వెన్యూ ఫేస్‌లిఫ్ట్ మరెన్నో..

మహీంద్రా స్కార్పియో-ఎన్ (Mahindra Scorpio-N)

యుటిలిటీ వాహనాల తయారీలో భారతదేశపు నెంబర్ వన్ బ్రాండ్ అయిన మహీంద్రా అండ్ మహీంద్రా నుండి చాలా కాలంగా ఎదురుచూస్తున్న మోడళ్లలో కొత్త తరం మహీంద్రా స్కార్పియో కూడా ఒకటి. సమాచారం ప్రకారం, ఈ కారును స్కార్పియో-ఎన్ అనే పేరుతో విక్రయించే అవకాశం ఉంది. ఇందులో బహుశా ఎన్ అంటే న్యూ (కొత్తది) అని అర్థం కాబోలు. ప్రస్తుతం, విక్రయిస్తున్న స్కార్పియో ఎస్‌యూవీతో పాటుగా కంపెనీ దానికి ఎగువ ఈ కొత్త తరం స్కార్పియో-ఎన్ ను విడుదల చేయవచ్చని సమాచారం.

జూన్ 2022లో విడుదల కాబోయే సరికొత్త కార్లు..: స్కార్పియో-ఎన్, వెన్యూ ఫేస్‌లిఫ్ట్ మరెన్నో..

ఈ కొత్త తరం మహీంద్రా స్కార్పియో మునుపటి మోడల్ కంటే మరింత బలమైనదిగా కనిపిస్తుంది. ఈ కొత్త ఎస్‌యూవీ ఫ్రేమ్, డిజైన్, ఇంజన్ మరియు ఫీచర్లలో మార్పులు ఉన్నాయి. కొత్త మహీంద్రా స్కార్పియో-ఎన్ బాడీ-ఆన్-ఫ్రేమ్ ఛాసిస్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది మరియు ఇది రెండు ఇంజన్ ఎంపికల ఎంపికతో వస్తుందని భావిస్తున్నారు. ఇందులో మొదటిది 2.2-లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజిన్ మరియు రెండవది కొత్త 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ కావచ్చు. ప్రస్తుతం ఇవే ఇంజన్లను కొత్త ఎక్స్‌యూవీ700లో కూడా ఉపయోగిస్తున్నారు.

జూన్ 2022లో విడుదల కాబోయే సరికొత్త కార్లు..: స్కార్పియో-ఎన్, వెన్యూ ఫేస్‌లిఫ్ట్ మరెన్నో..

హ్యుందాయ్ వెన్యూ ఫేస్‌లిఫ్ట్ (Hyundai Venue Facelift)

కొరియన్ కార్ కంపెనీ హ్యుందాయ్ విక్రయిస్తున్న పాపులర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ వెన్యూ. ఈ మోడల్ మార్కెట్లోకి ప్రవేశించి దాదాపు మూడేళ్లు కావస్తున్న నేపథ్యంలో, కంపెనీ ఇందులో ఓ ఫేస్‌లిఫ్ట్ మోడల్ ను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది. హ్యుందాయ్ క్రెటాకి దిగువన విక్రయించబడుతున్న హ్యుందాయ్ వెన్యూ ఇప్పటికే మార్కెట్లో మంచి విజయాన్ని దక్కించుకుంది. ఈ విజయానికి కొనసాగింపుగా కంపెనీ తమ అప్‌గ్రేడెడ్ వెన్యూ మోడల్ లో డిజైన్, ఫీచర్స్ పరంగా భారీ మార్పులు చేసే అవకాశం ఉంది.

జూన్ 2022లో విడుదల కాబోయే సరికొత్త కార్లు..: స్కార్పియో-ఎన్, వెన్యూ ఫేస్‌లిఫ్ట్ మరెన్నో..

అయితే, ఇందులో ఇంజన్ పరంగా మాత్రం ఎలాంటి మార్పులు ఉండబోవని తెలుస్తోంది. ప్రస్తుతం, ఈ మోడల్ రెండు పెట్రోల్ మరియు ఒక డీజిల్ ఇంజన్ ఆప్షన్ తో లభిస్తోంది. ఇందులోని బేస్ 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ 81.86 బిహెచ్‌పి శక్తిని మరియు 116 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కాగా, 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ గరిష్టంగా 98.63 బిహెచ్‌పి శక్తిని మరియు 245 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇకపోతే, 1.0 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 118.35 బిహెచ్‌పి శక్తిని మరియు 175 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

జూన్ 2022లో విడుదల కాబోయే సరికొత్త కార్లు..: స్కార్పియో-ఎన్, వెన్యూ ఫేస్‌లిఫ్ట్ మరెన్నో..

సిట్రోయెన్ సి3 (Citroen C3)

ఫ్రెంచ్ కార్ కంపెనీ సిట్రోయెన్, భారతదేశంలో తమ రెండవ మోడల్ సిట్రోయెన్ సి3 (Citroen C3) కాంపాక్ట్ ఎస్‌యూవీని విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. తాజాగా, ఈ మోడల్ భారత రోడ్లపై ఎలాంటి క్యామోఫ్లేజ్ లేకుండా టెస్టింగ్ చేస్తున్నప్పుడు కెమెరాకు చిక్కింది. ఇది భారతదేశంలో మొట్టమొదటి ఫ్లెక్స్ ఫ్యూయెల్ ఇంజన్ కూడా అయి ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి. సిట్రోయెన్ సి3 ఈ విభాగంలో హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, నిస్సాన్ మాగ్నైట్, రెనో కైగర్, మారుతి సుజుకి విటారా బ్రెజ్జా, టాటా నెక్సాన్ మరియు మహీంద్రా ఎక్స్‌యూవీ300 వంటి మోడళ్లకు పోటీగా లేదా ప్రత్యామ్నాయంగా ఉంటుంది.

జూన్ 2022లో విడుదల కాబోయే సరికొత్త కార్లు..: స్కార్పియో-ఎన్, వెన్యూ ఫేస్‌లిఫ్ట్ మరెన్నో..

సిట్రోయెన్ సి3 ఇంజన్ స్పెసిఫికేషన్‌లను కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించనప్పటికీ, ఇది 1.2 లీటర్ టర్బో పెట్రోల్ మరియు 1.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్లతో లభిస్తుందని సమాచారం. ఇది సిక్స్-స్పీడ్ టార్క్ కన్వర్టర్‌ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ తో స్టాండర్డ్ గా జతచేయబడి ఉంటుందని తెలుస్తోంది. సిట్రోయెన్ భరత మార్కెట్లో ఇప్పటికే సి5 ఎయిర్‌క్రాస్ (C5 Aircross) అనే ప్రీమియం ఫీచర్ రిచ్ ఎస్‌యూవీని విక్రయిస్తోంది. ఈ నేపథ్యంలో రాబోయే సి3 మోడల్ కూడా ఫుల్లీ లోడెడ్ ఫీచర్లను కలిగి ఉంటుందని ఆశించవచ్చు.

జూన్ 2022లో విడుదల కాబోయే సరికొత్త కార్లు..: స్కార్పియో-ఎన్, వెన్యూ ఫేస్‌లిఫ్ట్ మరెన్నో..

కియా ఈవీ6 (Kia EV6)

కొరియన్ కార్ బ్రాండ్ కియా, భారతదేశంలో తమ ఐదవ మోడల్ ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. అయితే, ఈసారి పెట్రోల్/డీజిల్ కార్లను కాకుండా కంపెనీ ఓ ఎలక్ట్రిక్ కారును ఇక్కడి మార్కెట్లో ప్రవేశపెట్టనుంది. కియా ఇప్పటికే పలు అంతర్జాతీయ మార్కెట్లలో విజయవంతంగా విక్రయిస్తోన్న ఎలక్ట్రిక్ కారు కియా ఈవీ6 ను భారతదేశంలో విడుదల చేయనుంది. భారత్‌లో ఈ ఎలక్ట్రిక్ కారు కోసం మే 26, 2022వ తేదీ నుండి బుకింగ్‌లు కూడా ప్రారంభం కానున్నాయి. కియా ఈ కారును CBU (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్‌లో పూర్తిగా విదేశాలలో తయారు చేసి, భారతదేశానికి దిగుమతి చేసుకోనుంది.

జూన్ 2022లో విడుదల కాబోయే సరికొత్త కార్లు..: స్కార్పియో-ఎన్, వెన్యూ ఫేస్‌లిఫ్ట్ మరెన్నో..

కియా ఈవీ6 భారతదేశంలో ఒకే ఒక ట్రిమ్ స్థాయిలో విడుదల కానున్నట్లు సమాచారం. ఇది టాప్-ఎండ్ జిటి లైన్ రూపంలో ఉంటుందని తెలుస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయించబడే ఈ లాంగ్ రేంజ్ ట్రిమ్ అధిక రేంజ్ ను అందించే 77.4 kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఇదొక ఆల్-వీల్ డ్రైవ్ ట్రిమ్ మరియు ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 321 బిహెచ్‌పి శక్తిని మరియు 605 ఎన్ఎమ్ టార్క్‌‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది పూర్తి చార్జ్ పై ఇది 441 కిలోమీటర్ల రేంజ్ ను అందిస్తుందని సర్టిఫై చేయబడింది.

జూన్ 2022లో విడుదల కాబోయే సరికొత్త కార్లు..: స్కార్పియో-ఎన్, వెన్యూ ఫేస్‌లిఫ్ట్ మరెన్నో..

మారుతి సుజుకి విటారా బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ (Maruti Suzuki Vitara Brezza Facelift)

భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా కూడా కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో పెరుగుతున్న పోటీని సమర్థవంతంగా ఎదుర్కునేందుకు తమ విటారా బ్రెజ్జా లో అప్‌గ్రేడెడ్ మోడల్ ని తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ కొత్త 2022 మారుతి సుజుకి విటారా బ్రెజ్జా ఎక్స్‌టీరియర్ మరియు ఇంటీరియర్లలో మార్పులను కలిగి ఉంటుండనుంది. అయితే, ఇంజన్ పరంగా మాత్రం ఇందులో ఎలాంటి మార్పు ఉండబోదని తెలుస్తోంది.

జూన్ 2022లో విడుదల కాబోయే సరికొత్త కార్లు..: స్కార్పియో-ఎన్, వెన్యూ ఫేస్‌లిఫ్ట్ మరెన్నో..

కొత్త మారుతి సుజుకి విటారా బ్రెజ్జాలో కంపెనీ ఇటీవలే విడుదల చేసిన మారుతి సుజుకి ఎర్టిగా ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో ఉపయోగించిన అదే K15C న్యూచరల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌ ని ఉపయోగించనుంది. కొత్త ఎర్టిగాలోని ఈ ఇంజన్ 6,000ఆర్‌పిఎమ్ వద్ద 101.6 బిహెచ్‌పి శక్తిని మరియు 4,400 ఆర్‌పిఎమ్ వద్ద 136.8 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అంతే కాకుండా, రాబోయే కొత్త మారుతి సుజుకి విటారా బ్రెజ్జాలో కొత్త 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ని అందించవచ్చని తెలుస్తోంది.

Most Read Articles

English summary
Upcoming cars in june 2022 mahindra scorpio n venue facelift citroen c3 kia ev6 and more
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X