2023 లో విడుదలయ్యే MPV లు: ఇన్నోవా క్రిస్టా ఫేస్‌లిఫ్ట్ నుంచి హ్యుందాయ్ స్టార్‌గేజర్ వరకు

ఆధునిక కాలంలో భారతీయ మార్కెట్లో MPV లకు మంచి డిమాండ్ ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీలు దేశీయ మార్కెట్లో MPV లను విడుదల చేయడానికి ముందుకు వస్తున్నాయి. అయితే 2023 లో విడుదలయ్యే MPV లు ఏవి, వాటి వివరాలు ఏమిటనేది ఈ కథనంలో చూద్దాం.

టయోటా ఇన్నోవా క్రిస్టా ఫేస్‌లిఫ్ట్:

టయోటా కంపెనీ 2023 వ సంవత్సరంలో తన కొత్త ఇన్నోవా క్రిస్టా ఫేస్‌లిఫ్ట్ విడుదల చేయనుంది. ఈ MPV 2023 చివరి నాటికల్లా భారతీయ రోదమీద తిరిగే అవకాశం ఉంది. ఇది ఇన్నోవా హైక్రాస్ తో పాటు విక్రయించే బడే అవకాశం ఉంది. అయితే ఈ MPV కోసం కంపెనీ 2023 జనవరి నుంచి బుకింగ్స్ స్వీకరించనుంది. ఈ కొత్త కారు ఆధునిక డిజైన్ కలిగి అప్డేటెడ్ ఫీచర్స్ పొందనుంది. ఇందులోని డీజిల్ ఇంజిన్ బిఎస్-6 ప్రమాణాలకు అనుకూలంగా అప్డేట్ చేయబడుతుంది.

2023 లో విడుదలయ్యే MPVలు

ఇన్నోవా క్రిస్టా ఫేస్‌లిఫ్ట్ 2.4 లీటర్ డి-4డి టర్బోఛార్జ్డ్ డీజల్ ఇంజన్ పొందుతుంది. ఈ ఇంజిన్ 148 బిహెచ్‌పి పవర్ మరియు 343 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే జతచేయబడి ఉంటుంది. అయితే తప్పకుండా ఇది మంచి పనితీరుని అందించేలా రూపొందించబడుతుంది. కావున వాహన వినియోగదారులను ఆకర్శించే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడవుతాయి.

కియా కార్నివాల్ ఫేస్‌లిఫ్ట్:

నిజానికి కియా కంపెనీ తన కార్నివాల్ ఫేస్‌లిఫ్ట్ MPV ని 2021 లో ప్రపంచ వ్యాప్తంగా ఆవిష్కరించింది. అయితే ఆ సమయంలో భారతీయ మార్కెట్లో విడుదల గురించి ప్రస్తావించలేదు. అయితే ఇప్పుడు ఈ కారు 2023 లో విడుదల కానున్నట్లు సమాచారం. ప్రపంచ మార్కెట్లో ఆవిష్కరించబడిన ఈ కారు 3.5 లీటర్ వి 6 ఎంపిఐ పెట్రోల్, కొత్త 2.2 లీటర్ స్మార్ట్ స్ట్రీమ్ మరియు 3.5 లీటర్ జిడిఐ వి 6 స్మార్ట్స్ట్రెమ్ ఇంజన్ ఎంపికలతో అందించబడుతుంది.

అయితే భారతీయ మార్కెట్లో విడుదల కానున్న కియా కార్నివాల్ ఫేస్‌లిఫ్ట్ 200 బిహెచ్‌పి పవర్ మరియు 440 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేసే 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ కలిగి ఉంటుంది. ఇందులో 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ ఉంటుంది. కావున తప్పకుండా మంచి పర్ఫామెన్స్ అందిస్తుంది. కొలతల విషయానికి వస్తే ఈ MPV పొడవు 5155 మిమీ, వెడల్పు 1995 మిమీ మరియు ఎత్తు 1775 మిమీ వరకు ఉంటుంది.

హ్యుందాయ్ స్టార్‌గేజర్:

2023 లో హ్యుందాయ్ కంపెనీ తన స్టార్‌గేజర్ విడుదల చేయనుంది. ఈ MPV ని కంపెనీ ఇప్పటికే ఇండోనేషియా మార్కెట్లో ఆవిష్కరించింది. ఈ MPV ఇండోనేషియాలో స్థానికంగా ఉత్పత్తి చేయబడుతుంది. ఈ కారు కంపెనీ యొక్క ఇతర మోడల్స్ కంటే కూడా భిన్నంగా ఉంటుంది. కొత్త పారామెట్రిక్ గ్రిల్‌తో వస్తుంది, ఇది స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ సెటప్ మరియు 15-అంగుళాల డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్‌ వంటివి ఇందులో ఉంటాయి.

భారతీయ మార్కెట్లో విడుదలకానున్న హ్యుందాయ్ స్టార్‌గేజర్ MPV 1.5-లీటర్ 4 సిలిండర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 115 బిహెచ్‌పి పవర్ మరియు 144 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్ మరియు ఐవిటి ఆప్సన్స్ పొందుతుంది. ఇది ఆధునిక ఫీచర్స్ కలిగి వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుందని ఆశిస్తున్నాము. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.

సిట్రోయెన్ సి3:

దేశీయ మార్కెట్లో అతి తక్కువ కాలంలోనే మంచి ఆదరణ పొందిన సిట్రోయెన్ కంపెనీ 2023 లో తన సి3 యొక్క 7 సీటర్ విడుదల చేసే అవకాశం ఉంది. ఇప్పటికీ ఈ MPV చాలా సార్లు టెస్టింగ్ సమయంలో కనిపించింది. దీన్ని బట్టి చూస్తే భారతీయ మార్కెట్లో ఈ MPV విడుదల కావడానికి ఇంక ఎన్నో రోజులు వేచి ఉండాల్సిన అవసరం లేదు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి.

More from DriveSpark

Article Published On: Thursday, December 29, 2022, 10:23 [IST]
English summary
Upcoming mpvs in india innova crysta facelift to hyundai stargazer
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+