వచ్చే నెలలో విడుదలకానున్న కొత్త కార్లు.. ఆడి నుంచి టయోటా హైరైడర్ వరకు
భారతీయ మార్కెట్లో కొత్త వాహనాలకు డిమాండ్ భారీగా పెరిగిపోతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని వాహన తయారీ సంస్థలు కూడా ఎప్పటికప్పుడు కొత్త వాహనాలను మరియు అప్డేటెడ్ వాహనాలను విడుదల చేస్తూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే ఈ నెలలో ఇప్పటికే మారుతి సుజుకి 2022 ఆల్టో కె10, మహీంద్రా కంపెనీ కొత్త స్కార్పియో క్లాసిక్ వంటి వాటిని లాంచ్ చేశాయి. ఇక ఈ నెల ముగియటానికి ఇక ఎన్నో రోజులు లేదు. అయితే కొన్ని కంపెనీలు రానున్న సెప్టెంబర్ నెలలో విడుదల చేయడానికి కొన్ని వాహనాలను సిద్ధం చేశాయి.
Recommended Video
ఇందులో టొయోట కంపెనీ అర్బన్ క్రూయిజర్ హైరైడర్, మారుతి గ్రాండ్ విటారా, హ్యుందాయ్ వెన్యూ ఎన్-లైన్ మరియు ఆడి కంపెనీ తన Q3 SUV ని తీసుకురానున్నాయి. వీటి గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూద్దాం.. రండి.

టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ (Toyota Urban Cruiser Hyryder):
దేశీయ మార్కెట్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పాటు చేసుకున్న 'టొయోట' (Toyota) 2022 సెప్టెంబర్ నెలలో కొత్త 'అర్బన్ క్రూయిజర్ హైరైడర్' (Urban Cruiser Hyryder) విడుదల చేయనుంది. కంపెనీ ఈ కొత్త SUV ని ఇప్పటికే మార్కెట్లో ఆవిష్కరించింది. కానీ ధరలు ఇంకా వెల్లడించలేదు. అయితే డెలివరీలు కూడా వచ్చే నెలలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

టొయోట కంపెనీ ఈ ఎస్‌యువి కోసం బుకింగ్స్ స్వీకరించడం ఇప్పటికే ప్రారంభించబడ్డాయి, కావున కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు టయోటా డీలర్‌షిప్‌లలో లేదా అధికారిక వెబ్ సైట్ లో రూ. 25,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు.
టయోటా యొక్క అర్బన్ క్రూయిజర్ హైరైడర్ మొత్తం నాలుగు ట్రిమ్స్ (E, S, G మరియు V ట్రిమ్స్) మరియు రెండు ఇంజిన్ ఆప్సన్స్ లో అందించబడుతుంది. అయితే ఇందులోని S, G మరియు V ట్రిమ్స్ లో స్ట్రాంగ్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్, E ట్రిమ్ లో మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్ అందుబాటులో ఉంటాయి.

స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్‌లు 1.5 లీ TNGA అట్కిన్సన్ పెట్రోల్ ఇంజన్ మరియు 177.6 V లిథియం-అయాన్ బ్యాటరీతో వస్తాయి. ఇది 92 హెచ్‌పి పవర్ మరియు 122 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇవన్నీ టయోటా యొక్క ఇ-డ్రైవ్ ట్రాన్స్‌మిషన్‌ను పొందుతాయి. కావున మంచి ఇంధన సామర్థ్యాన్ని అందిస్తాయి. ఇక మైల్డ్ హైబ్రిడ్ ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో నియో డ్రైవ్ ఇంజిన్ ఆప్సన్ కూడా అందుబాటులో ఉంటుంది. కావున ఇది 1.5-లీటర్ K15C మైల్డ్-హైబ్రిడ్ ఇంజిన్ పొందుతుంది. ఇది 103 హెచ్‌పి పవర్ మరియు 137 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆప్సనల్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది.

మారుతి గ్రాండ్ విటారా (Maruti Grand Vitara):
మారుతి సుజుకి విడుదల చేయనున్న కొత్త గ్రాండ్ వితారా కూడా వచ్చే నెలలో (సెప్టెంబర్ 2022) అధికారికంగా విడుదల కానుంది. అప్పుడే ధరలు కూడా వెల్లడవుతాయి. అయితే ఇప్పటికే కంపెనీ ఈ SUV కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. కావున ఆన్‌లైన్‌లో లేదా అధీకృత Nexa డీలర్‌షిప్‌ల వద్ద రూ. 11,000 టోకెన్ మొత్తంతో బుక్ చేసుకోవచ్చు.

ఇప్పటికే కంపెనీ ఈ కొత్త SUV కోసం 20,000 కంటే ఎక్కువ బుకింగ్స్ స్వీకరించింది. మారుతి సుజుకి గ్రాండ్ విటారా ఎస్‌యూవీ లీటరు పెట్రోల్ తో గరిష్టంగా 27.9 కిలోమీటర్ల మైలేజీనిస్తుంది. ఈ గణాంకాలతో ఇది ప్రస్తుతం భారతదేశంలోనే అత్యధిక మైలేజీనిచ్చే కారుగా నిలిచింది. ఈ పవర్‌ట్రెయిన్ లోని 1.5-లీటర్, 3-సిలిండర్, న్యాచురల్లీ-ఆస్పిరేటెడ్, అట్కిన్సన్ సైకిల్ ఇంజన్ మరియు ఎలక్ట్రిక్ మోటారు ఉంటాయి. ఇవి రెండూ కలిసి గరిష్టంగా 114.5 బిహెచ్‌పి శక్తిని మరియు 122 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి.

మహీంద్రా ఎక్స్‌యూవీ400 (Mahindra XUV400):
మహీంద్రా కంపెనీ ఆగష్టు 15 న 5 ఎలక్ట్రిక్ కార్లను భారతీయ మార్కెట్లో ఆవిష్కరించింది. అయితే కంపెనీ వీటిని 2024 మరియు 2026 న విడుదల చేయడానికి తగిన ప్రయత్నాలు చేస్తోంది. అయితే అంతకంటే ముందు XUV400 ఎలక్ట్రిక్ కారుని విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది.

కంపెనీ ఇప్పటికి అందించిన సమాచారం ప్రకారం, తన XUV400 ఎలక్ట్రిక్ SUV 2022 సెప్టెంబర్‌లో ప్రారభించబడే అవకాశం ఉంది. ఇది భారతీయ మార్కెట్లో కంపెనీ యొక్క మొట్ట మొదటి ఎలక్ట్రిక్ SUV కానుంది. నిజానికి ఇది 2020 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించబడింది. అయితే ఇకపై ప్రొడక్షన్ కి సిద్ధమవుతోంది. కావున ఇది భారతీయ రోడ్లమీద తిరగటానికి ఇక ఎన్నో రోజులు లేదని స్ఫష్టంగా తెలుస్తోంది.

మహీంద్రా XUV400 అనేది కంపెనీ యొక్క 'ఎలక్ట్రిక్ స్కేలబుల్ అండ్ మాడ్యులర్ ఆర్కిటెక్చర్' ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించబడుతుంది. కావున ఇది అత్యంత పవర్ పుల్ ఎలక్ట్రిక్ SUV కానుంది. ఇది దేశీయ మార్కెట్లో ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహన విభాగంలో దూసుకెళ్తున్న టాటా నెక్సాన్ వంటి వాటికీ సరైన పోటీ ఇచ్చే అవకాశం ఉంది.

హ్యుందాయ్ వెన్యూ ఎన్-లైన్ (Hyundai Venue N-Line):
2022 సెప్టెంబర్ నెలలో హ్యుందాయ్ కంపెనీ కూడా కొత్త వెన్యూ ఎన్-లైన్ విడుదల చేయడానికి అడుగులు వేస్తోంది. ఇది సెప్టెంబర్ 06 న విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ కొత్త మోడల్ స్పోర్టియర్ డిజైన్ మరియు ఆల్-బ్లాక్ ఇంటీరియర్ తో పాటు ట్వీక్డ్ సస్పెన్షన్ సెటప్ మరియు ఎగ్జాస్ట్ సిస్టమ్ తో వస్తుంది. కావున ఇది చాలా అద్భుతంగా ఉంటుంది.

హ్యుందాయ్ వెన్యూ ఎన్-లైన్ (Hyundai Venue N-Line) 1.0-లీటర్ 3-సిలిండర్ టర్బోఛార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ కలిగి ఉంటుంది. కావున ఇది 118 బిహెచ్‌పి పవర్ మరియు 178 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.కావున మంచి పనితీరుని అందిస్తుంది.

2023 ఆడి క్యూ3 (2023 Audi Q3):
జర్మన్ కార్ తయారీ సంస్థ ఆడి దేశీయ మార్కెట్లో తన కొత్త 'క్యూ3' SUV విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. అంతే కాకుండా కంపెనీ ఈ SUV కోసం బుకింగ్స్ కూడా ప్రారంభించింది. కావున కొనుగోలుదారులు కంపెనీ యొక్క అధికారిక వెబ్‌సైట్ లేదా అధీకృత డీలర్‌షిప్ ని సందర్శించి ముందస్తుగా రూ. 2,00,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు ఈ సంవత్సరం చివరినాటికి ప్రారభమవుతాయి.

కొత్త ఆడి క్యూ3 ఎస్‌యూవీ 2022 సెప్టెంబర్ నెలలో దేశీయ విఫణిలో విడుదల కానుంది. 2023 ఆడి క్యూ3 రెండు ట్రిమ్‌లలో వస్తుంది - ప్రీమియం ప్లస్ మరియు టెక్నాలజీ ట్రిమ్‌లు. ఇది ఫోక్స్‌వ్యాగన్ యొక్క MQB ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించబడింది. అదే సమయంలో ఇది క్యూ8 SUV నుండి ప్రేరణ పొందింది.

కొత్త ఆడి క్యూ3 అంతర్జాతీయ మార్కెట్లలో 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ మరియు 2.0 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ ఆప్సన్స్ పొందుతుంది. ఇందులోని 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ 150 బిహెచ్‌పి పవర్ అందించగా, .0 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ రెండు ట్యూన్స్ లో 190 బిహెచ్‌పి పవర్ మరియు 230 బిహెచ్‌పి పవర్ అందిస్తాయి.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:
రానున్న సెప్టెంబర్ నెలలో పండుగ సీజన్ ప్రారంభమవుతుంది. ఈ సమయంలో కంపెనీ తమ కొత్త వాహనాలను విడుదల చేయడానికి సిద్దమవుతున్నాయి. వచ్చే నెలలో భారతీయ మార్కెట్లో పైన చెప్పిన 5 కార్లు విడుదల కానున్నాయి. కావున కొనుగోలుదారులు పండుగ సీజన్ లో కొత్త కార్ల కొనుగోలుతో పండుగ చేసుకోవచ్చు.


Click it and Unblock the Notifications








