బాలీవుడ్ బ్యూటీ 'ఊర్వశి రౌతేలా' ఖరీదైన కార్లు - వివరాలు
బాలీవుడ్ నటి మతి మోడల్ 'ఊర్వశి రౌతేలా' (Urvashi Rautela) గురించి తెలుగు వారికి పెద్దగా తెలియకపోవచ్చు, కానీ హిందీ మరియు కన్నడ ప్రజలకు ఈ పేరు సుపరిచయమే అని చెప్పాలి. ఎందుకంటే హిందీలో 'సింగ్ సాబ్ ది గ్రేట్' అనే సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన ఈమె 'మిస్టర్ ఐరావతా' అనే కన్నడ సినిమాలో కూడా నటించింది. అంతే కాకుండా 2015 లో మిస్ యూనివర్స్ పోటీల్లోనూ, 2021 ఇజ్రాయెల్ జరిగిన మిస్ యూనివర్స్ పోటీల్లోనూ పాల్గొంది.

మిస్ యూనివర్స్ స్థాయికి ఎదిగిన ఈమెకి కేవలం సినిమాలంటే మాత్రమే కాకుండా బైకులు మరియు కార్లంటే కూడా చాలా ఇష్టం. ఈ కారంగానే ఊర్వశి రౌతేలా ఖరీదైన బైకులు మరియు కార్లను కలిగి ఉంటుంది. వీటి గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

మెర్సిడెస్ ఎస్-క్లాస్ (Mercedes S-Class):
ఊర్వశి రౌతేలా వద్ద ఉన్న లగ్జరీ కార్లలో ఒకటి జర్మన్ బ్రాండ్ ఆయిన 'మెర్సిడెస్ ఎస్-సిరీస్ ఎస్ 500'. ఇది అద్భుతమైన డిజైన్ కలిగి అధునాతన ఫీచర్స్ పొందుతుంది. ఇందులో 4.6 లీటర్ డీజిల్ ఇంజిన్ అందుబాటులో ఉంటుంది. ఇది 5250 - 5500 ఆర్‌పిఎమ్ వద్ద 453.26 బిహెచ్‌పి పవర్ మరియు 1800 - 3500 ఆర్‌పిఎమ్ వద్ద 700 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 7 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కి జత చేయబడుతుంది.

మెర్సిడెస్ ఎస్-సిరీస్ ఎస్ 500 కేవలం 4.8 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఇది గంటకు 250 కిలోమీటర్ల వరకు వేగవంతం అవుతుంది. కాగా దీని ధర సుమారు రూ. 2.2 కోట్ల వరకు ఉంటుంది.

రేంజ్ రోవర్ ఎవోక్ (Range Rover Evoque):
ఊర్వశి రౌతేలా వద్ద మావో ఖరీదైన సెడాన్ ఈ రేంజ్ రోవర్ ఎవోక్ (Range Rover Evoque). ఇది 3.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కలిగి ఉంటుంది. ఇది 12.3 అంగుళాల ఇంటరాక్టివ్ డ్రైవర్ డిస్ప్లే, స్మార్ట్‌ఫోన్ ఇంటిగ్రేషన్, ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్ప్లే అనుకూలత మరియు సెగ్మెంట్-ఫస్ట్ క్లియర్ సైట్ ఇంటీరియర్ రియర్ వ్యూ మిర్రర్ వంటి వాటిని కలిగి ఉంది.

రేంజ్ రోవర్ ఎవోక్ యొక్క 3.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ 5500 ఆర్‌పిఎమ్ వద్ద 394 బిహెచ్‌పి పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కి జత చేయబడి ఉంటుంది. ఇది కేవలం 7.4 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. కాగా గరిష్ట వేగం గంటకు 209 కిలోమీటర్లు. దీని ధర రూ. 62 లక్షల వరకు ఉంటుంది.

మెర్సిడెస్ బి-క్లాస్ (Mercedes B-Class):
మెర్సిడెస్ బి-క్లాస్ అనేది బి 200 నుండి వచ్చిన సెడాన్. ఇది కూడా ఊర్వశి గ్యారేజిలో ఉంది. దీని ధర రూ. 35 లక్షల వరకు ఉంటుంది. ఈ లగ్జరీ సెడాన్ 2.1 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కలిగి మంచి పనితీరుని అందిస్తుంది. ఇది 3600 - 4400 ఆర్‌పిఎమ్ వద్ద 134.10 బిహెచ్‌పి పవర్ మరియు 1600 - 3000 ఆర్‌పిఎమ్ వద్ద 300 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది.

మెర్సిడెస్ బి-క్లాస్ సెడాన్ కేవలం 10.7 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల వరకు వేగవంతం అవుతుంది. ఇది 7 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కి జత చేయబడి ఉంటుంది. ఇది మంచి డిజైన్, అద్భుతమైన ఫీచర్స్ పొందుతుంది. కావున ఎక్కువ మంది ఈ సెడాన్ ని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతుంటారు.

బిఎండబ్ల్యు 520డి (BMW 520d):
ఊర్వశి గ్యారేజి మెర్సిడెస్ బెంజ్ కార్లు మాత్రమే కాకుండా బిఎండబ్ల్యు కార్లు కూడా ఉన్నాయి. ఇందులో ఒకటి బిఎండబ్ల్యు 520డి (BMW 520d). దీని ధర రూ. 66 లక్షల వరకు ఉంటుంది. ఇది లేటెస్ట్ డిజైన్ కలిగి ఉంటుంది. ఊర్వశి యొక్క బిఎండబ్ల్యు 520డి వైట్ కలర్ లో చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

బిఎండబ్ల్యు 520డి 1995 సిసి ట్విన్ పవర్ టర్బో ఇన్లైన్ 4 సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. ఇది 4000 ఆర్‌పిఎమ్ వద్ద 187.74 బిహెచ్‌పి పవర్ మరియు 1750 - 2500 ఆర్‌పిఎమ్ వద్ద 400 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కి జతచేయబడి ఉంటుంది.

ఫెరారీ 458 స్పైడర్ (Ferrari 458 Spider):
ఊర్వశి గ్యారేజిలో ఉన్న అత్యంత ఖరీదైన కార్లలో ఒకటి ఫెరారీ యొక్క 458 స్పైడర్ (458 Spider). దీని ధర సుమారు రూ. 4.9 కోట్లు. ఇది 4.5 లీటర్ వి8 పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 9000 ఆర్‌పిఎమ్ వద్ద 561.9 బిహెచ్‌పి పవర్ మరియు 6000 ఆర్‌పిఎమ్ వద్ద 540 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 7 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కి జత చేయబడి ఉంటుంది. ఇది కేవలం 2 సీటర్ మోడల్.

హార్లే డేవిడ్సన్ ఫ్యాట్ బాబ్ (Harley-Davidson Fat Bob):
ఊర్వశి రౌతేలా తన తమ్ముడు యశ్రాజ్ రౌటేలా కోసం అత్యంత ఖరీదైన హార్లే డేవిడ్సన్ ఫ్యాట్ బాబ్ కొనుగోలు చేసింది. ఈ బైక్ ధర సుమారు రూ. 20 లక్షలకంటే ఎక్కువగానే ఉంటుంది. ఇది చూడటానికి చాలా స్టైలిష్ గా ఉంటుంది. దీనిని ఈమె 2019 లో కొనుగోలు చేసింది.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:
భారతదేశంలో అత్యంత ఖరీదైన కార్లను కలిగి ఉన్న సెలబ్రెటీల జాబితాలో ఊర్వశి రౌతేలా కూడా ఒకరు. ఈమె వద్ద ఉన్న దాదాపు అన్ని కార్లను గురించి పైన తెలుసుకున్నాం. దీనిపైనా మీ అభిప్రాయాలను మాతో పంచుకొండి, అదే సమయంలో ఎప్పటికప్పుడు మార్కెట్లో విడుదలయ్యే కొత్త బైకులు మరియు కార్లను గురించి అప్డేటెడ్ సమాచారం తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








