ఆడి కారులో వాడి పడేసిన బ్యాటరీలను ఎలక్ట్రిక్ రిక్షాలలో ఉపయోగించేందుకు ప్లాన్స్..
భారతదేశంలో, ఎలక్ట్రిక్ కార్లలో ఉపయోగించిన పాత బ్యాటరీలను తిరిగి ఎలక్ట్రిక్ రిక్షాలలో ఉపయోగించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇటీవల, న్యూనమ్ (Nunam) అనే ఓ స్టార్టప్ కంపెనీ ఈ ప్రాజెక్ట్ కోసం జర్మన్ కార్ బ్రాండ్ ఆడి (Audi) తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా, భారతదేశంలో విక్రయించబడే ఎలక్ట్రిక్ రిక్షాలలో ఆడి ఇ-ట్రాన్ (Audi e-tron) లగ్జరీ ఎలక్ట్రిక్ కారు యొక్క పాత బ్యాటరీలను ఉపయోగించనున్నారు. ఈ ప్రక్రియ వలన భారతదేశంలో లిథియం-అయాన్ బ్యాటరీలను రీసైకిల్ చేయడానికి మార్గం సుగమమం అవుతుందని కంపెనీ విశ్వసిస్తోంది.

అంతేకాకుండా, ఇలాంటి రీసైకిల్డ్ బ్యాటరీల వినియోగించడం వలన ఇ-రిక్షాల వంటి ఎలక్ట్రిక్ వాహనాల ధరలను తగ్గించడంలో కూడా ఇది సహాయపడుతుంది. ఆడి ఇ-ట్రాన్ యొక్క పాత బ్యాటరీని ఉపయోగించే ముందు కంపెనీ మూడు ప్రోటోటైప్ మోడళ్లను ప్రవేశపెట్టింది. అలాగే, ఈ కంపెనీ ఇప్పుడు మరిన్ని కొత్త మోడళ్లపై కూడా పని చేస్తోంది. భారతదేశంలోని ఆడి ఇ-ట్రాన్ యొక్క పాత బ్యాటరీతో తయారు చేయబడిన ఎలక్ట్రిక్ రిక్షాను 2023 తొలి నెలల్లో విడుదల చేయనున్నట్లు కంపెనీ తెలిపింది.
ఈ ఇ-రిక్షాలను మొదట పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రారంభించనున్నారు. ఆడి ఇ-ట్రాన్ వంటి ఖరీదైన కార్లలో ఉపయోగించే అధునాతన లిథియం అయాన్ బ్యాటరీ పాతబడిన తర్వాత కూడా ఇతర చిన్న వాహనాల్లో ఉపయోగించవచ్చని న్యూమాన్ స్టార్టప్ వ్యవస్థాపకుడు ప్రదీప్ ఛటర్జీ పేర్కొన్నారు. పాత లిథియం-అయాన్ బ్యాటరీలు చౌకగా ఉంటాయని, వాటిని ఇ-రిక్షా లేదా ఇ-కార్గో వంటి చిన్న వాహనాలలో ఉపయోగించవచ్చని ఆయన చెప్పారు. దీనివల్ల ఎలక్ట్రిక్ వాహనాల ధర తగ్గడంతోపాటు అవి ప్రజలకు అందుబాటులో ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు.
సాధారణంగా, ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలతో పోలిస్తే, ఎలక్ట్రిక్ కార్లలో ఉపయోగించే బ్యాటరీలు చాలా ఎక్కువ కాలం పాటు ఉండేలా రూపొందించబడి ఉంటాయి. ఇవి బ్యాటరీ జీవితకాలం పాటు మన్నేటట్లు డిజైన్ చేయబడి ఉంటాయి. బ్యాటరీ జీవిత కాలం ముగిసిన తర్వాత కూడా, ఇలాంటి అధునిక బ్యాటరీలు కొంతమేర సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి మరియు అలాంటి వాటిని తక్కువ శక్తితో కూడిన చిన్న ఎలక్ట్రిక్ వాహనాలలో ఉపయోగించవచ్చని న్యూమాన్ కంపెనీ చెబుతోంది.
ఇలా రీసైకిల్డ్ బ్యాటరీలను ఉపయోగించడం వలన ఇ-రిక్షాల తయారీ ఖర్చును తక్కువగా ఉంచడమే కాకుండా, భారతదేశంలో ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సమర్థవంతంగా రీసైకిల్ చేసి, పర్యావరణాన్ని రక్షించడం కూడా సాధ్యమవుతుంది. ఆడి ఇ-ట్రాన్ విషయానికి వస్తే, ఇది ఈ జర్మన్ కార్ బ్రాండ్ నుండి భారత మార్కెట్లో విడుదలైన మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు. గతేడాది జులై నెలలో ఇది భారత మార్కెట్లో విడుదలైంది.
దేశీయ విపణిలో ఆడి ఇ-ట్రాన్ ఎలక్ట్రిక్ కారు మొత్తం మూడు వేరియంట్లలో లభిస్తుంది. వీటిలో ఇ-ట్రాన్ 50, ఇ-ట్రాన్ 55 మరియు ఇ-ట్రాన్ స్పోర్ట్‌బ్యాక్ వేరియంట్‌లు ఉన్నాయి. మార్కెట్లో ఈ ఎలక్ట్రిక్ కారు ఆడి ఇ-ట్రాన్ ఎలక్ట్రిక్ కారు ధరలు రూ. 99.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతాయి. ఆడి ఇ-ట్రాన్ ఎలక్ట్రిక్ కారును కంపెనీ పూర్తిగా విదేశాలలో తయారు చేసి కంప్లీట్లీ బిల్ట్ యూనిట్ (CBU) గా భారతదేశంలోకి దిగుమతి చేసుకుంటుంది.
ఆడి ఇ-ట్రోన్ 50 క్వాట్రో వేరియంట్‌లో 71.2 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌ను ఉపయోగించారు. ఉంటుంది. ఇది గరిష్టంగా 312 బిహెచ్‌పి శక్తిని మరియు 540 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో మరింత శక్తివంతమైన 55 క్వాట్రో మరియు ఎస్ వేరియంట్లు రెండూ 95 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌తో పనిచేస్తాయి. ఈ రెండు వేరియంట్లలో రెండు ఎలక్ట్రిక్ మోటార్లు ఉంటాయి. ఇవి గరిష్టంగా 402 బిహెచ్‌పి పవర్‌ను మరియు 664 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి.

బేస్ వేరియంట్ అయిన ఆడి ఇ-ట్రోన్ 50 పూర్తి చార్జ్ పై 359 కిలోమీటర్ల రేంజ్‌ను ఆఫర్ చేస్తుండగా, ఆడి ఇ-ట్రోన్ 55 పూర్తి ఛార్జ్‌పై 484 కిలోమీటర్ల రేంజ్‌ను ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది. కొత్త Audi e-Tron GT ఎలక్ట్రిక్ కారు విషయానికి వస్తే, ఇందులో 85 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్లు స్టాండర్డ్ మోడల్ 469 హెచ్‌పి శక్తిని మరియు 630 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. అలాగే, RS వేరియంట్ 590 హెచ్‌పి శక్తిని మరియు 830 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.
ఇందులోని స్టాండర్డ్ ఫోర్-డోర్ కూప్ మోడల్ పూర్తి ఛార్జ్ పై 487 కిమీ డ్రైవింగ్ రేంజ్ ను ఆఫర్ చేస్తుండగా RS ట్రిమ్ పూర్తి చార్జ్ పై 471 కిమీ రేంజ్ ను ఆఫర్ చేస్తుంది. పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, Audi e-Tron GT కేవలం 4.1 సెకన్లలో సున్నా నుండి గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోగలదు. స్టాండర్డ్ వేరియంట్ గరిష్ట వేగం గంటకు 245 కిమీ గా ఉంటుందని కంపెనీ తెలిపింది.
ఈ ఎలక్ట్రిక్ కారులో ఆడి వర్చువల్ కాక్‌పిట్, యాంబియంట్ లైటింగ్, ఫోర్-జోన్ క్లైమేట్ కంట్రోల్, 360-డిగ్రీ కెమెరా, వైర్‌లెస్ ఛార్జింగ్, హెడ్స్-అప్ డిస్‌ప్లే, ఎనిమిది ఎయిర్‌బ్యాగ్‌లు వంటి అనేక ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఇంకా ఇందులో 12.3 ఇంచ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, లేటెస్ట్ కార్ కనెక్టింగ్ టెక్నాలజీ, మల్టిపుల్ అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ మరియు 10.1 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మొదలైనవి ఉన్నాయి. అలాగే, Audi e-Tron GT ఎలక్ట్రిక్ కారులో వివిధ రకాల డ్రైవర్ అసిస్టెన్స్ ఫీచర్లు మరియు అధునాతన భద్రతా ఫీచర్లు కూడా ఉన్నాయి
లిథియం-అయాన్ బ్యాటరీలను ఎలక్ట్రిక్ కార్లు మరియు ఇ-రిక్షాలలో ఉపయోగించిన తర్వాత కూడా వాటిలో కొంత సామర్థ్యం మిగిలి ఉంటుంది మరియు మరికొంత కాలం పాటు చిన్న వాహనాలకు శక్తిని అందించగలవు. కాబట్టి, ఇటువంటి బ్యాటరీలను LED లైట్లు లేదా చిన్నపాటి ఉపకరణాలకు శక్తినివ్వడానికి ఉపయోగించవచ్చు. లిథియం-అయాన్ బ్యాటరీలను పూర్తిగా ఉపయోగించకముందే రీసైక్లింగ్ చేయడం వల్ల ప్రపంచంలో లిథియం తవ్వకాలు తగ్గుతాయి మరియు లిథియం నిల్వలు ఎక్కువ ఉంటాయి మరియు పర్యావరణానికి కూడా మేలు జరుగుతుంది.


Click it and Unblock the Notifications








