టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ (Tata Nexon EV Max) వేరియంట్ల వారీగా లభించే ఫీచర్లు - వివరాలు

ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ (Tata Motors) భారత మార్కెట్లో విక్రయిస్తున్న నెక్సాన్ ఈవీ (Nexon EV) ఎలక్ట్రిక్ కారులో ఇటీవలే ఓ లాంగ్ రేంజ్ వెర్షన్ టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ (Tata Nexon EV Max) ను మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసినదే. మార్కెట్లో ఇది XZ+ మరియు XZ+ Lux అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. దేశీయ విపణిలో ఈ కొత్త లాంగ్ రేంజ్ వెర్షన్ టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ ధరలు రూ.17.74 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతాయి. అయితే, ఈ రెండు వేరియంట్లలో లభించే ఫీచర్లు ఏంటి మరియు వ్యత్యాసాలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ (Tata Nexon EV Max) వేరియంట్ల వారీగా లభించే ఫీచర్లు - వివరాలు

టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ ఎలక్ట్రిక్ కారును కంపెనీ రెండు వేరియంట్లు (XZ+ మరియు XZ+ Lux) మరియు రెండు రకాల చార్జర్ (3.3kW చార్జర్ మరియు 7.2kW ఏసి ఫాస్ట్ చార్జర్‌) ఆప్షన్లతో విక్రయిస్తోంది. ఈ లాంగ్ రేంజ్ వెర్షన్ నెక్సాన్ ఈవీ మ్యాక్స్ ప్రత్యేకమైన ఇంటెన్సిటీ-టీల్ కలర్ ఆప్షన్ లో లభిస్తుంది. దీనితో పాటుగా డేటోనా గ్రే మరియు ప్రిస్టీన్ వైట్ అనే మరో రెండు కలర్ ఆప్షన్లు కూడా ఉన్నాయి. వీటిలో డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్‌లు స్టాండర్డ్‌గా లభిస్తాయి. ఇక దీని ఓవరాల్ డిజైన్ స్టాండర్డ్ నెక్సాన్ ఈవీ మాదిరిగానే ఉంటుంది.

టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ (Tata Nexon EV Max) వేరియంట్ల వారీగా లభించే ఫీచర్లు - వివరాలు

Tata Nexon EV Max XZ+ వేరియంట్‌లో లభించే ఫీచర్లు

నెక్సాన్ ఈవీ మ్యాక్స్‌లో XZ+ అనేది ఇందులో లభించే బేస్ వేరియంట్. ఈ వేరియంట్‌లో మల్టీ-మోడ్ రీజెన్ బ్రేకింగ్ సిస్టమ్, ఆటోమేటిహెడ్‌ల్యాంప్‌లు, రెయిన్ సెన్సింగ్ వైపర్‌లు, ఫుల్లీ ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్, నాలుగు చక్రాలపై డిస్క్ బ్రేక్‌లు, ఇంటెలిజెంట్ వాక్యూమ్-లెస్ బూస్ట్‌ అండ్ యాక్టివ్ కంట్రోల్‌తో కూడిన ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, ఆటో-హోల్డ్, మల్టీ-డ్రైవ్ మోడ్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్, జ్యువెల్డ్ కంట్రోల్ నాబ్, క్రూయిజ్ కంట్రోల్‌ మరియు ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ (Tata Nexon EV Max) వేరియంట్ల వారీగా లభించే ఫీచర్లు - వివరాలు

Tata Nexon EV Max XZ+ Lux వేరియంట్‌లో లభించే ఫీచర్లు

టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్‌లో XZ+ Lux అనేది ఇందులో లభించే టాప్-ఎండ్ వేరియంట్. ఈ టాప్-ఎండ్ వేరియంట్‌లో, పైన పేర్కొన్న బేస్ XZ+ వేరియంట్‌లో లభించే అన్ని ఫీచర్లు లభిస్తాయి. వాటికి అదనంగా,ఈ XZ+ Lux వేరియంట్‌లో ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, వెంటిలేషన్‌తో కూడిన ఫ్రంట్ లెథెరెట్ సీట్లు, కొత్త మక్రానా బేజ్ కలర్ ఇంటీరియర్స్, ఆటో-డిమ్మింగ్ ఇన్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్ (IRVM) మరియు ఎయిర్ ప్యూరిఫైయర్ వంటి ఫీచర్లు లభిస్తాయి. ఇక ఈ రెండు వేరియంట్లోల ఇతర సాధారణ ఫీచర్లు స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే ఉంటాయి.

టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ (Tata Nexon EV Max) వేరియంట్ల వారీగా లభించే ఫీచర్లు - వివరాలు

కొత్త సేఫ్టీ ఫీచర్లు జోడించబడ్డాయి..

కొత్త టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ వేరియంట్లలో, స్టాండర్డ్ నెక్సాన్ ఈవీలో అందించబడే ఎయిర్‌బ్యాగ్స్, ఏబిఎస్ వంటి సేఫ్టీ ఫీచర్లుకు అదనంగా, ఇందులో I-VBAC (ఇంటెలిజెంట్ - వాక్యూమ్-లెస్ బూస్ట్ అండ్ యాక్టివ్ కంట్రోల్), హిల్ హోల్డ్, హిల్ డిసెంట్ కంట్రోల్, ఆటో వెహికల్ హోల్డ్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ మరియు 4 చక్రాలపై డిస్క్ బ్రేక్‌లు వంటి ఇతర సేఫ్టీ ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ (Tata Nexon EV Max) వేరియంట్ల వారీగా లభించే ఫీచర్లు - వివరాలు

పెద్ద బ్యాటరీతో 437 కిలోమీటర్ల రేంజ్..

స్టాండర్డ్ నెక్సాన్ ఈవీలో 30.1kWh బ్యాటరీ ప్యాక్ మాత్రమే ఉంటుంది. ఫలితంగా, ఇది పూర్తి చార్జ్ పై 312 కిమీ (ARAI సర్టిఫైడ్) రేంజ్‌ని అందిస్తుంది. కాగా, కొత్తగా విడుదలైన టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ వెర్షన్‌లో పెద్ద 40.5kWh బ్యాటరీ ప్యాక్‌ని ఉపయోగించారు. ఫలితంగా, ఇది పూర్తి చార్జ్ పై 437 కిలోమీటర్ల (ARAI సర్టిఫైడ్) రేంజ్‌ని అందిస్తుందని కంపెనీ పేర్కొంది. అంటే, స్టాండర్డ్ నెక్సాన్ ఈవీతో పోల్చుకుంటే, ఈ నెక్సాన్ ఈవీ మ్యాక్స్ అదనంగా 125 కిలోమీటర్లు ఎక్కువ రేంజ్‌ను అందిస్తుంది.

టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ (Tata Nexon EV Max) వేరియంట్ల వారీగా లభించే ఫీచర్లు - వివరాలు

నెక్సాన్ ఈవీ మ్యాక్స్ పెర్ఫార్మెన్స్ ఫిగర్స్..

ఈ కొత్త లాంగ్ రేంజ్ వెర్షన్ నెక్సాన్ ఈవీ మ్యాక్స్ లో పెరిగిన బ్యాటరీ ప్యాక్ కారణంగా ఇది కేవలం 9 సెకన్లలోనే గంటకు 0-100 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది మరియు దీని గరిష్ట వేగం గంటకు 140 కిలోమీటర్లుగా ఉంటుంది. ఇందులో ఒక ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. కొత్త నెక్సాన్ ఈవీ మ్యాక్స్ పవర్, టార్క్ గణాంకాల్లో స్వల్ప మార్పు మాత్రమే ఉంటుంది. స్టాండర్డ్ నెక్సాన్ ఈవీ యొక్క 129 బిహెచ్‌పి పవర్ మరియు 245 ఎన్ఎమ్ టార్క్‌తో పోలిస్తే, కొత్త నెక్సాన్ ఈవీ మ్యాక్స్ 141 బిహెచ్‌పి శక్తిని మరియు 250 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ (Tata Nexon EV Max) వేరియంట్ల వారీగా లభించే ఫీచర్లు - వివరాలు

టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ ధరలు..

- టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ ఎక్స్‌జెడ్+ (3.3 కివా చార్జర్) : రూ.17.74 లక్షలు

- టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ ఎక్స్‌జెడ్+ (7.2 కివా చార్జర్) : రూ.18.24 లక్షలు

- టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ ఎక్స్‌జెడ్+ లగ్జరీ (3.3 కివా చార్జర్) : రూ.18.74 లక్షలు

- టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ ఎక్స్‌జెడ్+ లగ్జరీ (7.2 కివా చార్జర్) : రూ.19.24 లక్షలు

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా)

Article Published On: Friday, May 13, 2022, 11:58 [IST]
English summary
Variant wise features in tata nexon ev max specs range price details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+