ఫోక్స్‌వ్యాగన్ టైగన్ (Volkswagen Taigun) మిడ్-స్పెక్ వేరియంట్‌లో ఆ ఫీచర్ కట్..!

చెక్ రిపబ్లిక్ కార్ బ్రాండ్ స్కోడా ఆటో (Skoda Auto) దేశీయ విపణిలో విక్రయిస్తున్న మిడ్-సైజ్ ఎస్‌యూవీ స్కోడా కుషాక్ (Skoda Kushaq) ఎస్‌యూవీలోని మిడ్-స్పెక్ యాంబిషన్ వేరియంట్ నుండి కంపెనీ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఫీచర్‌ను తొలగించింది. ఇప్పుడు ఇదే బాటలో, స్కోడా ఆటో యొక్క సోదర సంస్థ అయిన ఫోక్స్‌వ్యాగన్ ఇండియా (Volkswagen India) తమ ఫోక్స్‌వ్యాగన్ టైగన్ (Volkswagen Taigun) ఎస్‌యూవీ యొక్క మిడ్-స్పెక్ వేరియంట్ నుండి కూడా ఈ ఫీచర్‌ను తీసివేయబోతోంది.

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ (Volkswagen Taigun) మిడ్-స్పెక్ వేరియంట్‌లో ఆ ఫీచర్ కట్..!

తాజా సమాచారం ప్రకారం, ఫోక్స్‌వ్యాగన్ టైగన్ యొక్క మిడ్-స్పెక్ హైలైన్ వేరియంట్ నుండి కంపెనీ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఫీచర్‌ను తొలగించబోతోంది. స్కోడా మాదిరిగానే, ఫోక్స్‌వ్యాగన్ కూడా సెమీకండక్టర్ చిప్‌ల కొరతను దృష్టిలో ఉంచుకుని ఈ చర్య తీసుకుంది. అయితే, ఫోక్స్‌వ్యాగన్ మాత్రం ఈ విషయం గురించి అధికారికంగా ఎటువంటి సమాచారాన్ని ఇవ్వలేదు.

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ (Volkswagen Taigun) మిడ్-స్పెక్ వేరియంట్‌లో ఆ ఫీచర్ కట్..!

టైగన్ ఎస్‌యూవీలో అందిస్తున్న ఫీచర్ల జాబితాలో ఫోక్స్‌వ్యాగన్ మార్పులు చేయడం ఇదే మొదటిసారి. ఫోక్స్‌వ్యాగన్ టైగన్ యొక్క హైలైన్ వేరియంట్ కంపెనీ విక్రయిస్తున్న ఎంట్రీ-లెవల్ 'కంఫర్ట్‌లైన్' మరియు టాప్-స్పెక్ 'టాప్‌లైన్' వేరియంట్‌ల మధ్యలో అందుబాటులో ఉండ్ మిడ్-స్పెక్ వేరియంట్. ఇంతకు ముందు ఈ వేరియంట్ టచ్-కంట్రోల్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ప్యానెల్‌తో అందించబడేది. కాగా, ఇప్పుడు అది ఎంట్రీ-లెవల్ 'కంఫర్ట్‌లైన్' వేరియంట్‌లో అందిస్తున్న మాన్యువల్ AC ప్యానెల్ ద్వారా భర్తీ చేయబడుతుంది.

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ (Volkswagen Taigun) మిడ్-స్పెక్ వేరియంట్‌లో ఆ ఫీచర్ కట్..!

మాన్యువల్ ఏసి కంట్రోల్ యూనిట్ కోసం డ్యాష్‌బోర్డుపై మూడు గుండ్రటి స్విచ్‌లు అందించబడి ఉంటాయి. ఈ మార్పు తర్వాత, ఇప్పుడు కారులో చాలా ఆకర్షణీయంగా కనిపించే టచ్-సెన్సిటివ్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ప్యానెల్ ఇప్పుడు 'టాప్‌లైన్' వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. స్కోడా కుషాక్ విషయానికి వస్తే, ఈ ఎస్‌యూవీ యొక్క మిడ్-స్పెక్ యాంబిషన్ వేరియంట్ లో కంపెనీ ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ రియర్‌వ్యూ మిర్రర్‌ను కూడా తొలగించింది.

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ (Volkswagen Taigun) మిడ్-స్పెక్ వేరియంట్‌లో ఆ ఫీచర్ కట్..!

కాగా, ఫోక్స్‌వ్యాగన్ టైగన్ మిడ్-స్పెక్ వేరియంట్‌లో మాత్రం కంపెనీ ఈ మార్పు (పవర్ సైడ్ మిర్రర్ తొలగింపు)ను చేయలేదు. ఫోక్స్‌వ్యాగన్ టైగన్ యొక్క హైలైన్ వేరియంట్‌లో ఎలక్ట్రికల్లీ ఫోల్డబుల్ రియర్‌వ్యూ మిర్రర్‌లు ఉంటాయి. ఫోక్స్‌వ్యాగన్ తమ టైగన్ మిడ్-స్పెక్ వేరియంట్లో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఫీచర్‌ను తొలగించినప్పటికీ, హైలైన్ వేరియంట్ ధరలలో మాత్రం కంపెనీ ఎలాంటి మార్పు చేయలేదు.

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ (Volkswagen Taigun) మిడ్-స్పెక్ వేరియంట్‌లో ఆ ఫీచర్ కట్..!

మార్కెట్లో ఫోక్స్‌వ్యాగన్ టైగన్ మాన్యువల్ వేరియంట్ ధర రూ. 13.00 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంటే, ఇందులో ఆటోమేటిక్ వేరియంట్ ధర రూ. 14.40 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంది. ఇది కంఫర్ట్‌లైన్, హైలైన్ మరియు టాప్‌లైన్ అనే మూడు వేరియంట్‌లలో విక్రయించబడుతోంది. స్కోడా కుషాక్ ను తయారు చేసిన అదే MQB-A0-IN ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని ఈ సరికొత్త ఫోక్స్‌వ్యాగన్ టైగన్ ఎస్‌యూవీని కూడా తయారు చేశారు. ఇది స్కోడా-ఫోక్స్‌వ్యాగన్ కంపెనీలు ప్లాన్ చేసిన ఇండియా స్ట్రాటజీ 2.0 ప్లాన్‌లో మొదటి ఫోక్స్‌వ్యాగన్ మోడల్.

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ (Volkswagen Taigun) మిడ్-స్పెక్ వేరియంట్‌లో ఆ ఫీచర్ కట్..!

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ రెండు టర్బో పెట్రోల్ ఇంజన్లతో లభిస్తుంది. ఇందులో మొదటిది 1.0 లీటర్ టిఎస్ఐ ఇంజిన్ కాగా, రెండవది 1.5 లీటర్ టిఎస్ఐ ఇంజన్. వీటిలో చిన్న 1.0-లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్ 5,000-5,500 ఆర్‌పిఎమ్ వద్ద 114 బిహెచ్‌పి శక్తిని మరియు 1,750-4,500 ఆర్‌పిఎమ్ వద్ద 178 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌తో లభిస్తుంది. కాగా, ఇందులోని పెద్ద 1.5 లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్ 5,000-6,000 ఆర్‌పిఎమ్ వద్ద 148 బిహెచ్‌పి శక్తిని మరియు 1,600-3,500 ఆర్‌పిఎమ్ వద్ద 250 ఎన్ఎమ్ టార్క్‌ని జనరేట్ చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ లేదా 7-స్పీడ్ డిఎస్‌జి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో జతచేయబడి ఉంటుంది.

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ (Volkswagen Taigun) మిడ్-స్పెక్ వేరియంట్‌లో ఆ ఫీచర్ కట్..!

డిజైన్ విషయానికి వస్తే, ఫోక్స్‌వ్యాగన్ టైగన్ ఎస్‌యూవీ ఎక్స్‌టీరియర్‌ లో మ్యాట్రిక్స్ టెక్నాలజీతో కూడిన ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఈడి డిఆర్‌ఎల్‌లు మరియు హెడ్‌ల్యాంప్, ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్‌లు మరియు ఎల్‌ఇడి టెయిల్‌ల్యాంప్‌లు, 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, ఆల్-రౌండ్ బాడీ క్లాడింగ్, షార్క్-ఫిన్ యాంటెన్నా మరియు క్రోమ్ గ్రిల్, రూఫ్ రైల్స్ వంటి డిజైన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. స్టాండర్డ్ టైగన్ ఎస్‌యూవీతో పాటుగా కంపెనీ ఇందులో ఓ జిటి వెర్షన్ ను కూడా విక్రయిస్తోంది. ఈ జిటి మోడల్‌ను స్టాండర్డ్ మోడల్ నుండి వేరు చేయడానికి, కంపెనీ ఇందులో డ్యూయల్ కలర్ 2-స్పోక్ అల్లాయ్ వీల్స్‌ను మరియు రెడ్ కలర్‌లో పెయింట్ చేసిన బ్రేక్ కాలిపర్‌లను అందిస్తోంది.

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ (Volkswagen Taigun) మిడ్-స్పెక్ వేరియంట్‌లో ఆ ఫీచర్ కట్..!

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ అద్భుతమైన ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. ఇందులో వర్చువల్ కాక్‌పిట్, 10.1 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన పెద్ద 8 ఇంచ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్, రియర్ ఏసి వెంట్స్, ఫ్రంట్ అండ్ రియర్ ఛార్జింగ్ పోర్ట్‌లు, కప్ హోల్డర్‌లతో కూడిన సెంట్రల్ ఆర్మ్‌రెస్ట్ మరియు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు లభిస్తాయి.

More from DriveSpark

Article Published On: Saturday, April 16, 2022, 11:32 [IST]
English summary
Volkswagen india drops automatic climate control feature in taigun mid spec variant details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+