టాటా.. వీడుకోలు..! గుడ్‌బై.. ఇంక సెలవు..!! తమ కస్టమర్లకు సెలవంటూ ధీనంగా లేఖ రాసిన ఫోక్స్‌వ్యాగన్ పోలో
ఈ టైటిల్ చూడగానే మీకు అర్థమైపోయింటుంది, భారతదేశంలో ఫోక్స్‌వ్యాగన్ పోలో (Volkswagen Polo) కారు డిస్‌కంటిన్యూ కాబోతోందని. అవును, దాదాపు దశాబ్ధం పైగా భారతదేశంలో యువ హృదయాలను దోచుకున్న ఈ జర్మన్ కారు, ఇప్పుడు మన మార్కెట్లో కనుమరుగు కానుంది. ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ మార్కెట్లో మారుతి సుజుకి బాలెనో, టాటా అల్ట్రోజ్, హ్యుందాయ్ ఐ20 మరియు హోండా జాజ్ వంటి కార్లతో పోటీ పడిన ఫోక్స్‌వ్యాగన్ పోలో, ఇప్పుడు సెకండ్ హ్యాండ్ మార్కెట్లలో మాత్రమే లభ్యం కానుంది.

ఈ టైటిల్ చూడగానే మీకు అర్థమైపోయింటుంది, భారతదేశంలో ఫోక్స్‌వ్యాగన్ పోలో (Volkswagen Polo) కారు డిస్‌కంటిన్యూ కాబోతోందని. అవును, దాదాపు దశాబ్ధం పైగా భారతదేశంలో యువ హృదయాలను దోచుకున్న ఈ జర్మన్ కారు, ఇప్పుడు మన మార్కెట్లో కనుమరుగు కానుంది. ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ మార్కెట్లో మారుతి సుజుకి బాలెనో, టాటా అల్ట్రోజ్, హ్యుందాయ్ ఐ20 మరియు హోండా జాజ్ వంటి కార్లతో పోటీ పడిన ఫోక్స్‌వ్యాగన్ పోలో, ఇప్పుడు సెకండ్ హ్యాండ్ మార్కెట్లలో మాత్రమే లభ్యం కానుంది.

ఈ నేపథ్యంలో భారత మార్కెట్లో పోలో కారు విక్రయాలను నిలిపివేస్తున్నట్లు ఫోక్స్‌వ్యాగన్ ప్రకటించింది. దీంతో పోలో అభిమానుల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఫోక్స్‌వ్యాగన్ పోలో కేవలం ఓ క్యాజువల్ హ్యాచ్‌బ్యాక్ మాత్రమే కాదు అనేది ఈ కారును కలిగి ఉన్న లక్షలాది మంది కస్టమర్ల అభిప్రాయం. చాలా మంది ఈ కారుతో ఎమోషనల్‌గా కనెక్ట్ అయి ఉంటారు. ఫోక్స్‌వ్యాగన్ పోలో ప్రస్తుతం భారతదేశం యొక్క ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో ఓ అత్యుత్తమ ఫన్-టు-డ్రైవ్ కారు అని నిస్సందేహంగా చెప్పవచ్చు.

భారత హ్యాచ్‌బ్యాక్ మార్కెట్లో విక్రయిస్తున్న అత్యంత ప్రజాదరణ పొందిన కార్లలో ఫోక్స్‌వ్యాగన్ పోలో ఒకటి. యూరోపియన్ డిజైన్‌తో వచ్చిన ఈ చిన్న కారు అద్భుతమైన పనితీరును కలిగి ఉంటుంది. ఫీచర్ల విషయంలో కూడా ఇది ఎక్కడా తగ్గదు. అలాంటి అత్యుత్తమ కారు ఇప్పుడు మార్కెట్లో నిలిచిపోనుంది. ఫోక్స్‌వ్యాగన్ పోలో కారును భారతదేశంలో నిలిపివేస్తున్న నేపథ్యంలో, కంపెనీ తమ పోలో కస్టమర్లకు గుడ్‌బై చెబుతూ ఓ లేఖను పంపించింది. ఇప్పుడు ఈ ఎమోషనల్ గుడ్‌బై లెటర్ వైరల్ అయ్యింది.

ఫోక్స్‌వ్యాగన్ పోలో భారత మార్కెట్లో తన 12 సంవత్సరాల ప్రయాణాన్ని ఈ లేఖ ద్వారా మనందరితో పంచుకుంది. ఆ లేఖ సారాంశం ఇలా ఉంది.. "రోడ్లు అందంగా ఉంటాయి, కానీ అవన్నీ ఎక్కడో ఒకచోట ముగిసిపోతాయి. మార్కెట్లో నా 12 ఏళ్ల నిరంతర ప్రయాణం తర్వాత, నేను ఇప్పుడు విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం వచ్చింది" అంటూ పోలో ఈ లేఖ ద్వారా తన కస్టమర్లను పలకరించింది. ఫోక్స్‌వ్యాగన్ పోలో కారును తొలిసారిగా 2009లో మహారాష్ట్రలోని పూణే సమీపంలో ఉన్న చాకన్ ప్లాంట్‌లో ఉత్పత్తి చేశారు.

ఆ తర్వాత, 2010లో ఫోక్స్‌వ్యాగన్ పోలో భారతదేశంలో విడుదలై వినియోగదారులకు చేరువ కావడం ప్రారంభించింది. భారతదేశంలో ఈ కారు యొక్క 12 సంవత్సరాల ప్రయాణం ప్రస్తుతం ముగియనుంది. ఈ సందర్భంగా ఇంజనీర్లు, డీలర్లు, సర్వీస్ మెకానిక్‌లు మరియు కస్టమర్‌లు అందరికీ పోలో ధన్యవాదాలు తెలిపింది. "వచ్చేటప్పుడు నేను క్యాజువల్ హ్యాచ్‌బ్యాక్ మాత్రమే. కానీ మీరు నన్ను అందరూ ఇష్టపడే హ్యాచ్‌బ్యాక్‌గా మార్చారు. ఇక నేను వీడ్కోలు పలుకుతూ, నా వారసత్వాన్ని నా ఎస్‌యూవీ మరియు సెడాన్ తోబుట్టువులకు వదిలివేస్తాను. వారు కూడా నాలాగే కొనసాగుతారని ఆశిస్తున్నాను" అంటూ ఫోక్స్‌వ్యాగన్ పోలో పేరుతో కంపెనీ రాసిన లేఖ అందరి హృదయాలను హత్తుకునేలా ఉంది.

ఫోక్స్‌వ్యాగన్ ఇండియా ఇప్పుడు తమ ప్రోడక్ట్ లైనప్‌లో పాత మోడళ్లను తొలగించి వాటి స్థానంలో సరికొత్త మోడళ్లను ప్రవేశపెడుతోంది. ఈ నేపథ్యంలో, పోలో భారత మార్కెట్ నుండి తొలగిపోయినప్పటికీ, దాని స్థానంలో మరొక కొత్త ఎంట్రీ లెవల్ కారు రావచ్చని భావిస్తున్నారు. ఫోక్స్‌వ్యాగన్ ఇటీవల భారత మార్కెట్లో తమ కొత్త టైగన్ (Taigun) మిడ్-సైజ్ ఎస్‌యూవీని, టిగువాన్ (Tiguan) ప్రీమియం ఎస్‌యూవీని విడుదల చేసింది. మరికొద్ది రోజుల్లోనే వర్త్యుస్ (Virtus) అనే మిడ్-సైజ్ సెడాన్‌ను కూడా విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. ఇది ప్రస్తుత వెంటో (Vento) సెడాన్ స్థానాన్ని భర్తీ చేయనుంది.

భారత మార్కెట్లో ఫోక్స్‌వ్యాగన్ ఇప్పటికే తమ వర్త్యుస్ మిడ్-సైజ్ సెడాన్ ఉత్పత్తిని కూడా ప్రారంభించింది. కంపెనీ దీని ధరను మే 2022 నాటికి ప్రకటించనుంది. ఫోక్స్‌వ్యాగన్ అనుబంధ సంస్థ స్కోడా తయారు చేసిన స్లావియా సెడాన్ మాదిరిగానే వర్త్యుస్ కూడా అదే ప్లాట్‌ఫామ్‌పై తయారు కానుంది. ఈ నేపథ్యంలో ఈ రెండు మోడళ్లలో (స్కోడా స్లావియా మరియు ఫోక్స్‌వ్యాగన్ వర్త్యుస్) ఒకే రకమైన ఫీచర్లు మరియు పరికరాలు ఉండనున్నాయి. ఫోక్స్‌వ్యాగన్ వర్త్యుస్ సెడాన్ ఉత్పత్తిలో కంపెనీ 95 శాతం స్థానికీకరణను పాటించనుంది. ఫలితంగా, దీనిని చాలా అగ్రెసివ్ ధరతో మార్కెట్లో విడుదల చేసే అవకాశం ఉంది.

ఫోక్స్‌వ్యాగన్ వర్త్యుస్ సెడాన్‌ను MQB A0 IN ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించనున్నారు. ఇది రెండు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో రానుంది. ఇందులో మొదటిది 1.0 లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్, ఇది గరిష్టంగా 113 బిహెచ్‌పి శక్తిని మరియు 178 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మరియు 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో జతచేయబడి ఉంటుంది. ఇకపోతే, రెండవ ఇంజన్ ఆప్షన్ 1.5 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్, ఇది గరిష్టంగా 148 బిహెచ్‌పి శక్తిని మరియు 250 న్యూటన్ మీటర్ టార్క్ ను జనరేట్ చేస్తుంది. ఇవి రెండూ కూడా 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా 7 స్పీడ్ డిఎస్‌జి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభ్యం కానుంది.


Click it and Unblock the Notifications








