భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్న ఫోక్స్‌వ్యాగన్

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న పాపులారిటీని దృష్టిలో ఉంచుకొని, జర్మనీకి చెందిన ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ 'ఫోక్స్‌వ్యాగన్' (Volkswagen) కూడా ఈవీ విభాగంలోకి ప్రవేశించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఆ వివరాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

Recommended Video

భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త Volkswagen Virtus: ధర & వివరాలు #Launch

ప్రస్తుతం, ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్ ఆధ్వర్యంలో చెక్ రిపబ్లిక్ కార్ బ్రాండ్ స్కోడా కూడా ఉన్న సంగతి తెలిసినదే. ఇటీవలే మహారాష్ట్రలోని పూనే రోడ్లపై బ్యాటరీతో నడిచే స్కోడా ఎన్యాక్ ఐవి 80ఎక్స్ ఎలక్ట్రిక్ కారు టెస్టింగ్ దశలో గుర్తించబడింది. ఇది ఫోక్స్‌వ్యాగన్ యొక్క పాపులర్ ఎమ్ఈబి ప్లాట్‌ఫామ్ పై తయారు చేయబడింది.

భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్న ఫోక్స్‌వ్యాగన్

ఇప్పుడు తాజాగా ఫోక్స్‌వ్యాగన్ ఐడి4. జిటిఎక్స్ ఎలక్ట్రిక్ కారు కూడా గుర్తించింది. ఇది కూడా అదే 77 kWh బ్యాటరీ ప్యాక్ ని పొందుతుంది.

భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్న ఫోక్స్‌వ్యాగన్

ఫోక్స్‌వ్యాగన్ యొక్క కొత్త ఎలక్ట్రిక్ కారు ID.4 GTX హై-పెర్ఫార్మెన్స్ వేరియంట్ యొక్క స్పై చిత్రాలు ఇటీవల ఆన్‌లైన్ లో లీక్ అయ్యాయి. ఫోక్స్‌వ్యాగన్ ఐడి.4 కంపెనీ యొక్క మిగిలిన ID లైనప్‌ల మాదిరిగానే ఉంటుంది. ఇది 2020 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించబడిన VW ID క్రాస్ కాన్సెప్ట్ ఆధారంగా రూపొందించబడింది. ప్రస్తుతం ఈ కారు యూఎస్, జర్మనీ మరియు చైనా దేశాలో తయారు చేయబడుతోంది.

భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్న ఫోక్స్‌వ్యాగన్

స్పై చిత్రాలలో చూసినట్లుగా ఇండియా-స్పెక్ GTX వేరియంట్ దాని ఆసక్తికరమైన రెడ్ డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్ ద్వారా తక్షణమే గుర్తించబడుతుంది. ఇందులోని 20 ఇంచ్ అల్లాయ్ వీల్స్ ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్ ఆఫర్ చేసే స్కోడా మరియు ఆడి వంటి ప్రీమియం కార్లలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఫోక్స్‌వ్యాగన్ గ్రూపులో భాగమైన ఆడి (Audi) ఇప్పటికే ఎలక్ట్రిక్ కార్ల విభాగంలోకి ప్రవేశించి, విజయవంతంగా వ్యాపారం చేస్తోంది.

భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్న ఫోక్స్‌వ్యాగన్

భారతదేశంలో ఆడి ఇ-ట్రాన్ హాట్ కేకుల్లా అమ్మువుతోంది మరియు కంపెనీ యొక్క బెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ కారుగా ఉంది. ఆడి ఇ-ట్రోన్ రేంజ్ తో కొత్త స్కోడా ఎన్యాక్ రేంజ్ దాదాపు సమానంగా ఉంటుంది. భారత రోడ్లపై Volkswagen ID.4 GTX మరియు Skoda Enyaq iV 80X రెండు మోడళ్లు కూడా వాటి వివరాలు కనిపించకుండా ఉండే, పూర్తి క్యామోఫ్లేజ్ తో పరీక్షించబడుతున్నాయి. ఫోక్స్‌వ్యాగన్ ఐడి4 ఈ విభాగంలో నేరుగా కియా ఈవీ6 తో పోటీ పడుతుంది మరియు ఇది ఫోక్స్‌వ్యాగన్ భారతదేశంలో విడుదల కాబోయే మొదటి ఎలక్ట్రిక్ వాహనంగా ప్రచారం చేయబడుతోంది.

భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్న ఫోక్స్‌వ్యాగన్

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ మరియు అభివృద్ధి కోసం దేశపు అగ్రగామి యుటిలిటీ వాహన తయారీ సంస్థ మహీంద్రా మరియు జర్మన్ ఆటోమేజర్ ఫోక్స్‌వ్యాగన్ గ్రూపులు రెండూ చేతులు కలిపిన సంగతి తెలిసినదే. మహీంద్రా యొక్క INGLO ప్లాట్‌ఫారమ్ ఫోక్స్‌వ్యాగన్ యొక్క MEB గ్లోబల్ స్కేలబుల్ ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది. ఇదే ప్లాట్‌ఫారమ్ VW ID.4 మరియు Skoda Enyaq వాహనాలను కూడా తయారు చేస్తున్నారు. కాబట్టి, ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్ ఈ రెండు టెస్ట్ వాహనాల్లో భారతీయ పరిస్థితుల కోసం ఈ ప్లాట్‌ఫారమ్‌ని పరీక్షిస్తూ ఉండవచ్చని చెబుతున్నారు.

భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్న ఫోక్స్‌వ్యాగన్

ప్రారంభంలో ఈ రెండు మోడళ్లు కూడా పూర్తిగా ఇంపోర్టెడ్ రూట్‌లో ఇండియాకు రానున్న నేపథ్యంలో, వీటిలో ID.4 GTX మరియు Enyaq- 80X వంటి టాప్-స్పెక్ ట్రిమ్‌లను మాత్రమే పొందే అవకాశం ఉంది. ఫోక్స్‌వ్యాగన్ ఐడి.4 జిటిఎక్స్ 302 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేయగల 77 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. ఉత్తర అమెరికా మార్కెట్‌లలో విక్రయించబడే ఈ మోడల్ పూర్తి చార్జ్ పై గరిష్టంగా 418 కిలోమీటర్ల రేంజ్ ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది.

భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్న ఫోక్స్‌వ్యాగన్

గ్లోబల్ మార్కెట్లలో విక్రయించబడుతున్న ఫోక్స్‌వ్యాగన్ ఐడి4 క్రాసోవర్ ఎలక్ట్రిక్ కారు పొడవు 4,584 మిమీ మరియు వీల్‌బేస్ 2,765 మిమీగా ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్లలో ఫోక్స్‌వ్యాగన్ ఐడి5 పేరుతో ఓ కూప్ వేరియంట్ ను కూడా విక్రయిస్తోంది. కొత్త ID.5 ఈ బ్రాండ్ యొక్క ID.4 కంటే కొంచెం పొడవుగా ఉంటుంది. ఫోక్స్‌వ్యాగన్ ఐడి4 పూర్తిగా ఇంపోర్టెడ్ మోడల్ కావడంతో, ఐడి.4 జిటిఎక్స్ గ్లోబల్ మోడల్‌లో ఉన్న అన్ని ఫీచర్లు ఇండియా స్పెక్ మోడల్ లో కూడా ఉండే అవకాశం ఉంది.

భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్న ఫోక్స్‌వ్యాగన్

ఫోక్స్‌వ్యాగన్ ఐడి.బజ్ (Volkswagen ID.Buzz) ఈవీ ఆవిష్కరణ

ఇదిలా ఉంటే, ఫోక్స్‌వ్యాగన్ 1950 కాలంలో విక్రయించిన ఐకానిక్ మినీ వ్యాన్ 'కోంబి' (Kombi) నుండి ప్రేరణ పొంది 'ఫోక్స్‌వ్యాగన్ ఐడి.బజ్' (Volkswagen ID.Buzz) పేరుతో ఓ ఆల్-ఎలక్ట్రిక్ మినీ వ్యాన్ ను ఇటీవలే ప్రపంచ వ్యాప్తంగా ఆవిష్కరించింది. ఫోక్స్‌వ్యాగన్ తమ ఐడి బ్రాండ్ క్రింద తయారు చేయనున్న ఎలక్ట్రిక్ వాహనాలలో ఇది లేటెస్ట్ మోడల్ మరియు ఇది చరిత్రలో మిగిలిపోయిన ఐకానిక్ కోంబి మినీ వ్యాన్ కు ఓ ఆధునిక రూపాన్ని అందించడంలో సహాయపడుతుంది.

భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్న ఫోక్స్‌వ్యాగన్

కొత్త 2022 ఫోక్స్‌వ్యాగన్ ఐడి.బజ్ ఈ సంవత్సరం చివరి నాటికి యూరోపియన్ మార్కెట్లలో మరియు మరో ఏడాది నాటికి అమెరికన్ మార్కెట్లో విడుదల కావచ్చని భావిస్తున్నారు. ఫోక్స్‌వ్యాగన్ తమ ఐడి బజ్ ఎలక్ట్రిక్ మినీ బస్ యొక్క రెండు వెర్షన్‌ లను ఆవిష్కరించింది. ఈ రెండింటిలో ఒకటి ప్రయాణికులను తీసుకెళ్లేందుకు ఉద్దేశించబడింది కాగా, మరొకటి వాణిజ్య ప్రయోజనాల కోసం కార్గోను తరలించడానికి వీలుగా రూపొందించబడింది. కొత్త 2022 ఫోక్స్‌వ్యాగన్ ఐడి బజ్ కూడా మాడ్యులర్ ఎలక్ట్రిక్ డ్రైవ్ కిట్ (MEB) ప్లాట్‌ఫారమ్‌పైనే తయారు కానుంది.

Source: Rushlane

More from DriveSpark

Article Published On: Saturday, September 3, 2022, 14:48 [IST]
English summary
Volkswagen plans to launch electric cars in india details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+