ఫోక్స్‌వ్యాగన్ టైగన్ మొదటి వార్షికోత్సవ ఎడిషన్ (VW Taigun Anniversary Edition) విడుదల.. ఫీచర్లు
జర్మనీకి చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోక్స్‌వ్యాగన్ (Volkswagen) భారత మార్కెట్లో విక్రయిస్తున్న కాంపాక్ట్ ఎస్‌యూవీ టైగన్ (Taigun) ని మార్కెట్లో విడుదల చేసి అప్పుడు ఒక సంవత్సరం పూర్తయింది. ఈ నేపథ్యంలో కంపెనీ ఇందులో మొదటి వార్షికోత్సవ ఎడిషన్‌ను విడుదల చేసింది.
Recommended Video
స్టాండర్డ్ టైగన్‌తో పోల్చుకుంటే, ఈ కొత్త ఫోక్స్‌వ్యాగన్ టైగన్ ఫస్ట్ యానివర్సరీ ఎడిషన్ ప్రత్యేకమైన బాడీ గ్రాఫిక్స్ మరియు ఇతర ఫీచర్లను కలిగి ఉంటుంది.

గతేడాది ఫోక్స్‌వ్యాగన్ టైగన్ భారత మార్కెట్లో విడుదలైనప్పటి నుండి ఇప్పటి వరకూ 40,000 లకు పైగా ఆర్డర్‌లను దక్కించుకుంది. విడిభాగాల సరఫరాలో పలు సవాళ్లు ఉన్నప్పటికీ, తాము ఇప్పటి వరకు 22,000 యూనిట్లకు పైగా టైగన్ ఎస్‌యూవీలను కస్టమర్‌లు డెలివరీ చేశామని ఫోక్స్‌వ్యాగన్ తెలిపింది.

మొదటి వార్షికోత్సవ ఎడిషన్ టైగన్ ఎస్‌యూవీ విషయానికి వస్తే, కంపెనీ స్పెషల్ ఎడిషన్ మోడల్ ను 1.0 లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్‌తో మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లలో అందిస్తోంది. ఇది డైనమిక్ లైన్ మరియు టాప్‌లైన్ వేరియంట్‌లలో అందించబడుతుంది. మొదటి వార్షికోత్సవ ఎడిషన్ కావడంతో కారు బయట మరియు లోపల "1వ" వార్షికోత్సవ బ్యాడ్జింగ్‌ను ఉపయోగించారు.

అంతేకాకుండా, ఈ ఫస్ట్ యానివర్సరీ ఎడిషన్‌లో హై లక్స్ ఫాగ్ ల్యాంప్స్, బాడీ-కలర్ డోర్ గార్నిష్, బ్లాక్ సి-పిల్లర్ గ్రాఫిక్స్, బ్లాక్ రూఫ్ ఫాయిల్, డోర్-ఎడ్జ్ ప్రొటెక్టర్, బ్లాక్ సైడ్ మిర్రర్ క్యాప్స్, విండో వైజర్‌లు మరియు అల్యూమినియం పెడల్స్ వంటి 11 ప్రత్యేకమైన బాడీ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. కాగా, ఈ స్పెషల్ ఎడిషన్ ధరలను మాత్రం కంపెనీ ఇంకా వెల్లడించలేదు. ప్రస్తుతం మార్కెట్లో ఫోక్స్‌వ్యాగన్ టైగన్ ధరలు రూ. 11.39 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతాయి.

ఈ సందర్భంగా ఫోక్స్‌వ్యాగన్ ప్యాసింజర్ కార్స్ ఇండియా బ్రాండ్ డైరెక్టర్ ఆశిష్ గుప్తా మాట్లాడుతూ.. "టైగన్ భారతదేశంలో అత్యంత సంతృప్తికరమైన ప్రయాణాన్ని కలిగి ఉంది, అలాగే వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్‌లో టాప్ 3 ఫైనలిస్ట్‌లుగా ప్రపంచ స్థాయికి చేరుకుంది. మా కస్టమర్ల నుండి ఈ ఎస్‌యూవీ అందుకున్న ఫీడ్‌బ్యాక్, ప్రశంసలు మరియు అంగీకారం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఈ కారు నిజంగా ఫోక్స్‌వ్యాగన్ బ్రాండ్ యొక్క కోర్ DNAను కలిగి ఉండి, ఉన్నతమైన నిర్మాణ నాణ్యత, భద్రత మరియు ఫన్-టు-డ్రైవ్ అనుభవాన్ని అందిస్తుంది" అని చెప్పారు.

ఈ లిమిటెడ్ ఎడిషన్ ఫోక్స్‌వ్యాగన్ టైగన్ కర్కుమా ఎల్లో మరియు వైల్డ్ చెర్రీ రెడ్ ఆప్షన్‌లతో పాటు రైజింగ్ బ్లూ కలర్ ఆప్షన్‌లో కూడా అందుబాటులో ఉంటుంది. కొత్తగా ప్రారంభించబడిన మొదటి వార్షికోత్సవ ఎడిషన్ టైగన్ భారతదేశంలోని 152 ఫోక్స్‌వ్యాగన్ టచ్‌పాయింట్‌లలో అందుబాటులో ఉంటుంది. ఫొక్స్‌వ్యాగన్ ఇండియా ఇటీవలే ఈ 1.0-లీటర్ టిఎస్ఐ ఇంజన్ వేరియంట్లలో కొత్తగా ఆటో ఇంజన్ స్టార్ట్-స్టాప్ ఫీచర్ ను జోడించింది. ఈ ఫీచర్ కారణంగా, ఈ ఇంజన్ గతంలో కంటే ఇప్పుడు మరింత ఎక్కువ ఇంధన సామర్థ్యాన్ని అందిస్తుందని కంపెనీ తెలిపింది.

మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేసినప్పుడు ఈ ఇంజన్ లీటరుకు 19.2 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. అంటే, మునుపటితో పోలిస్తే, ఇది 1.1 కిమీ మెరుగ్గా ఉంటుంది. కాగా, ఆటోమేటిక్ వేరియంట్‌లు ఇప్పుడు 17.23 కిమీ మైలేజీని అందిస్తాయి. ఈ మోడళ్లలో ఆటో స్టార్ట్-స్టాప్ సిస్టమ్ జోడించిక ముందు ఇది లీటరుకు 16.44 కిమీ మైలేజీని అందిస్తుంది. అంటే, దీని మైలేజ్ లీటరుకు 0.79 కిమీ మెరుగు పడింది.

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ రెండు రకాల పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులో మొదటిది 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్. ఈ ఇంజన్ గరిష్టంగా 114 బిహెచ్‌పి శక్తిని మరియు 178 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌తో లభిస్తుంది. ఇకపోతే, రెండవది 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్, ఇది గరిష్టంగా 148 బిహెచ్‌పి శక్తిని మరియు 250 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ మాన్యువల్ లేదా 7-స్పీడ్ డిఎస్‌జి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో జతచేయబడి ఉంటుంది.

టైగన్ ఎస్‌యూవీ మ్యాట్రిక్స్ టెక్నాలజీతో కూడిన ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఈడి డిఆర్‌ఎల్‌లు మరియు హెడ్‌ల్యాంప్, ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్‌లు మరియు ఎల్‌ఇడి టెయిల్‌ల్యాంప్‌లు, 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, ఆల్-రౌండ్ బాడీ క్లాడింగ్, షార్క్-ఫిన్ యాంటెన్నా మరియు క్రోమ్ గ్రిల్, రూఫ్ రైల్స్ వంటి డిజైన్ ఎలిమెంట్స్ తో మంచి ప్రీమియం లుక్‌ని కలిగి ఉంటుంది. స్పోర్టీ వెర్షన్ ఎస్‌యూవీని కోరుకునే వారి కోసం కంపెనీ ఇందులో జిటి వెర్షన్ ను కూడా విక్రయిస్తోంది.

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ లోని ఇతర ముఖ్యమైన ఫీచర్లను గమనిస్తే, ఈ కారులో వర్చువల్ కాక్‌పిట్, 10.1 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన పెద్ద 8 ఇంచ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్, రియర్ ఏసి వెంట్స్, ఫ్రంట్ అండ్ రియర్ ఛార్జింగ్ పోర్ట్‌లు, కప్ హోల్డర్‌లతో కూడిన సెంట్రల్ ఆర్మ్‌రెస్ట్ మరియు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మొదలైనవి ఉన్నాయి. స్కోడా కుషాక్ ను తయారు చేసిన అదే MQB-A0-IN ప్లాట్‌ఫామ్‌పై ఈ టైగన్‌ను తయారు చేశారు. కాబట్టి, ఈ రెండు మోడళ్లలో ఫీచర్లు ఒకేలా ఉంటాయి.


Click it and Unblock the Notifications








