Tiguan అమ్మకాల్లో సంచలనం సృష్టిస్తున్న Volkswagen.. పూర్తి వివరాలు
ప్రముఖ జర్మన్ కార్ బ్రాండ్ ఫోక్స్‌వ్యాగన్ ఇండియా (Volkswagen India) భారతీయ మార్కెట్లో 'ఫోక్స్‌వ్యాగన్ టైగన్' (Volkswagen Tiguan) మిడ్-సైజ్ ఎస్‌యూవీని గత సంవత్సరం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఫోక్స్‌వ్యాగన్ టైగన్ అనేది కంపెనీ 2.0 ప్రాజెక్ట్ క్రింద ఉత్పత్తి చేయబడిన మొదటి ఎస్‌యూవీ. ఇది దేశీయ మార్కెట్లో అడుగుపెట్టినప్పటినుంచి ఇప్పటివరకు కూడా మంచి ఆదరణ పొందుతోంది.
Recommended Video
ఫోక్స్‌వ్యాగన్ యొక్క టైగన్ ఎస్‌యూవీ మార్కెట్లో విడుదలై ఇప్పటికి ఒక సంవత్సరం కావొస్తోంది, ఇప్పటికి ఈ SUV కోసం కంపెనీ 40,000 కంటే ఎక్కువ బుకింగ్స్ పొందింది. అంతే కాకుండా ఇప్పటికే కంపెనీ 22,000 కంటే ఎక్కువ యూనిట్లను కూడా డెలివరీ చేసింది. దీన్ని బట్టి చూస్తే కంపెనీ యొక్క ఈ మిడ్-సైజ్ ఎస్‌యూవీ మంచి అమ్మకాలతో ముందుకు దూసుకెళ్తోంది.

భారతీయ మార్కెట్లో కంపెనీ విడుదల చేసిన ఈ మిడ్-సైజ్ ఎస్‌యూవీ ఇప్పటికి ఒక సంవత్సర కాలం పూర్తి చేసుకున్న తరుణంలో ఇటీవల ఫోక్స్‌వ్యాగన్ కంపెనీ టిగువాన్ యొక్క 'ఫస్ట్ యానివెర్సరీ ఎడిషన్' కూడా విడుదల చేసింది. ఇది చాలా ఆకర్షణీయమైన డిజైన్ లో మరింత అద్భుతంగా ఉంది.

కంపెనీ విడుదల చేసిన ఈ కొత్త యానివెర్సరీ ఎడిషన్ టైగన్ SUV యొక్క లోపల మరియు బయటవైపుల '1వ' యానివెర్సరీ బ్యాడ్జింగ్ ఉంది. ఇది స్పష్టంగా దీనిని 'ఫస్ట్ యానివెర్సరీ ఎడిషన్' అని చెబుతుంది.

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ యొక్క యానివెర్సరీ ఎడిషన్ కొత్త 'రైజింగ్ బ్లూ' కలర్ లో కర్కుమా ఎల్లో మరియు వైల్డ్ చెర్రీ రెడ్ పెయింట్ స్కీమ్‌లతో అందుబాటులో ఉంది. ఇది ఇప్పుడు కొన్ని కాస్మెటిక్ అప్‌డేట్‌లను పొందుతుంది. కానీ ఇందులో ఎటువంటి మెకానికల్ అప్డేట్స్ లేదు. కావున మెకానికల్ ఫీచర్స్ అన్నీ కూడా మునుపటి మాదిరిగానే ఉన్నాయి.

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ రెండు ఇంజన్ ఆప్సన్స్ పొందుతుంది. ఇందులో ఒకటి 1.0 లీటర్ టిఎస్ఐ ఇంజిన్ కాగా, మరొకటి 1.5 లీటర్ TSI ఇంజిన్. 1.0 లీటర్ టిఎస్ఐ ఇంజిన్ 113 బిహెచ్‌పి పవర్ మరియు 178 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ టార్క్-కన్వర్టర్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్ తో జతచేయబడి ఉంటుంది.

ఇక 1.5 లీటర్ టిఎస్ఐ ఇంజిన్ విషయానికి వస్తే, ఇది 148 బిహెచ్‌పి పవర్ మరియు 250 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ మరియు 7-స్పీడ్ DSG తో జతచేయబడి ఉంటుంది. ఫోక్స్‌వ్యాగన్ టైగన్ ప్రస్తుత ధర రూ. 11.40 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి రూ. 18.60 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది.

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ ఎస్‌యూవీ అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఇందులో మ్యాట్రిక్స్ టెక్నాలజీతో కూడిన ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఈడి డిఆర్‌ఎల్‌లు మరియు హెడ్‌ల్యాంప్, ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్‌లు మరియు ఎల్‌ఇడి టెయిల్‌ల్యాంప్స్, 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, ఆల్-రౌండ్ బాడీ క్లాడింగ్, షార్క్-ఫిన్ యాంటెన్నా మరియు క్రోమ్ గ్రిల్, రూఫ్ రైల్స్ వంటి డిజైన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా దీనికి మంచి ప్రీమియం లుక్‌ని అందిస్తాయి.

ఇక ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 10.1 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన పెద్ద 8 ఇంచ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్, రియర్ ఏసి వెంట్స్, ఫ్రంట్ అండ్ రియర్ ఛార్జింగ్ పోర్ట్‌లు, కప్ హోల్డర్‌లతో కూడిన సెంట్రల్ ఆర్మ్‌రెస్ట్ మరియు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మొదలైనవి ఉన్నాయి.

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ ఎస్‌యూవీలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, డ్రైవర్ అలర్ట్ సిస్టమ్, ఏబీఎస్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఆటో హోల్డ్, హిల్ స్టార్ట్ అసిస్ట్, రివర్స్ కెమెరా మరియు హిల్ డిసెంట్ కంట్రోల్ వంటివి ఉన్నాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారుల భద్రతను నిర్థారిస్తాయి.


Click it and Unblock the Notifications








