తగ్గని డిమాండ్.. పెరిగిన బుకింగ్స్: ఫోక్స్‌వ్యాగన్ టైగన్ గొప్ప రికార్డ్

ఫోక్స్‌వ్యాగన్ ఇండియా యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన మిడ్-సైజ్ ఎస్‌యూవీ టైగన్ గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో విడుదలైంది. కంపెనీ ఈ SUV ని దేశీయ మార్కెట్లో విడుదలచేసినప్పటినుంచి కూడా మంచి సంఖ్యలో బుకింగ్స్ పొందుతోంది. కాగా కంపెనీ ఇప్పటికి ఈ కారు కోసం ఏకంగా 45,000 కంటే ఎక్కువ యూనిట్ల కోసం బుకింగ్స్ స్వీకరించగలిగింది. దీని గురించి మరింత సమాచారం ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

తగ్గని డిమాండ్.. పెరిగిన బుకింగ్స్: ఫోక్స్‌వ్యాగన్ టైగన్ గొప్ప రికార్డ్

కంపెనీ అందించిన సమాచారం ప్రకారం.. 2021 సెప్టెంబర్ నుంచి 28,000 యూనిట్ల టైగన్ SUV లను డెలివరీ చేసింది. ఈ SUV మంచి డిజైన్ కలిగి అప్డేటెడ్ ఫీచర్స్ కలిగి ఉండటం వల్ల ఎక్కువమంది కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇది కుర్కుమా ఎల్లో, వైల్డ్ చెర్రీ రెడ్, కాండీ వైట్, రిఫ్లెక్స్ సిల్వర్ మరియు కార్బన్ స్టీల్ గ్రే అనే 5 కలర్ ఆప్సన్స్ లో అందిస్తుంది.

తగ్గని డిమాండ్.. పెరిగిన బుకింగ్స్: ఫోక్స్‌వ్యాగన్ టైగన్ గొప్ప రికార్డ్

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ MQB-AO-IN ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ SUV ముందుభాగంలో ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడీ డిఆర్ఎల్ లతో ఎల్ఈడీ మ్యాట్రిక్స్ హెడ్‌ల్యాంప్‌లను కలిగి ఉంది. బంపర్‌లో ఎల్ఈడీ ఫాగ్ ల్యాంప్‌లను కూడా పొందుతుంది. ముందు బంపర్‌లో బ్లాక్డ్ అవుట్ హనీకూంబ్ గ్రిల్ కూడా చూడవచ్చు. బోనెట్‌పై లైన్స్ కూడా గమనించవచ్చు. ఇందులోని వీల్ ఆర్చెస్ కారుని మరింత స్టైలిష్ గా కనిపించేలా చేస్తాయి.

తగ్గని డిమాండ్.. పెరిగిన బుకింగ్స్: ఫోక్స్‌వ్యాగన్ టైగన్ గొప్ప రికార్డ్

సైడ్ ప్రొఫైల్ లో 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్‌ కలిగి ఉంటుంది. రియర్ ప్రొఫైల్ ఒక ఎల్ఈడీ బార్‌తో ఒక ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్ కలిగి ఉండి, చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇవి మాత్రమే కాకుండా ఇందులో షార్క్-ఫిన్ యాంటెన్నా, రూఫ్ రైస్, డ్యూయల్ టోన్ ORVM వంటివి కూడా ఉన్నాయి.

తగ్గని డిమాండ్.. పెరిగిన బుకింగ్స్: ఫోక్స్‌వ్యాగన్ టైగన్ గొప్ప రికార్డ్

భారతీయ మార్కెట్లో 'ఫోక్స్‌వ్యాగన్ టైగన్' విడుదలై ఒక సంవత్సరం కావడంతో, కంపెనీ 'టైగన్ ఫస్ట్ యానివెర్సరీ ఎడిషన్' కూడా విడుదల చేసింది. ఈ కొత్త యానివెర్సరీ ఎడిషన్ లోపల మరియు బయట వైపుల '1వ' యానివెర్సరీ బ్యాడ్జింగ్‌ ఉంది. ఇది స్పష్టంగా దీనిని 'ఫస్ట్ యానివెర్సరీ ఎడిషన్' అని చెబుతుంది.

తగ్గని డిమాండ్.. పెరిగిన బుకింగ్స్: ఫోక్స్‌వ్యాగన్ టైగన్ గొప్ప రికార్డ్

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ యొక్క యానివెర్సరీ ఎడిషన్ కొత్త 'రైజింగ్ బ్లూ' కలర్ లో కర్కుమా ఎల్లో మరియు వైల్డ్ చెర్రీ రెడ్ పెయింట్ స్కీమ్‌లతో అందుబాటులో ఉంది. ఇది ఇప్పుడు కొన్ని కాస్మెటిక్ అప్‌డేట్‌లను పొందుతుంది. కానీ ఇందులో ఎటువంటి మెకానికల్ అప్డేట్స్ లేదు. కావున మెకానికల్ ఫీచర్స్ అన్నీ కూడా మునుపటి మాదిరిగానే ఉన్నాయి.

తగ్గని డిమాండ్.. పెరిగిన బుకింగ్స్: ఫోక్స్‌వ్యాగన్ టైగన్ గొప్ప రికార్డ్

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ 1.0 లీటర్ టిఎస్ఐ ఇంజిన్ మరియు 1.5 లీటర్ TSI ఇంజిన్‌ పొందుతుంది. ఇందులోని 1.0 లీటర్ టిఎస్ఐ ఇంజిన్ 113 బిహెచ్‌పి పవర్ మరియు 178 ఎన్ఎమ్ టార్క్‌ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ టార్క్-కన్వర్టర్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్ తో జతచేయబడి ఉంటుంది.

1.5 లీటర్ టిఎస్ఐ ఇంజిన్‌ విషయానికి వస్తే, ఇది 148 బిహెచ్‌పి పవర్ మరియు 250 ఎన్ఎమ్ టార్క్‌ అందిస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ మరియు 7-స్పీడ్ DSG తో జతచేయబడి ఉంటుంది.

తగ్గని డిమాండ్.. పెరిగిన బుకింగ్స్: ఫోక్స్‌వ్యాగన్ టైగన్ గొప్ప రికార్డ్

ఫీచర్స్ విషయానికి వస్తే, ఫోక్స్‌వ్యాగన్ టైగన్ 10.1 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన పెద్ద 8 ఇంచ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్, రియర్ ఏసి వెంట్స్, ఫ్రంట్ అండ్ రియర్ ఛార్జింగ్ పోర్ట్‌లు, కప్ హోల్డర్‌లతో కూడిన సెంట్రల్ ఆర్మ్‌రెస్ట్ మరియు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి వాటిని పొందుతుంది.

తగ్గని డిమాండ్.. పెరిగిన బుకింగ్స్: ఫోక్స్‌వ్యాగన్ టైగన్ గొప్ప రికార్డ్

చివరగా సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, డ్రైవర్ అలర్ట్ సిస్టమ్, ఏబీఎస్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఆటో హోల్డ్, హిల్ స్టార్ట్ అసిస్ట్, రివర్స్ కెమెరా మరియు హిల్ డిసెంట్ కంట్రోల్ వంటివి ఉన్నాయి.

తగ్గని డిమాండ్.. పెరిగిన బుకింగ్స్: ఫోక్స్‌వ్యాగన్ టైగన్ గొప్ప రికార్డ్

ఇదిలా ఉండగా వోక్స్‌వ్యాగన్ టైగన్ ఇటీవల నిర్వహించిన గ్లోబల్ NCAP టెస్ట్ లో 5 స్టార్ రేటింగ్ సంపాదించిన భారతదేశంలో అందుబాటులో ఉన్న అత్యంత సురక్షితమైన వాహనాల జాబితాలో ఒకటిగా మారింది. కావున ఇప్పుడు ఇది వాహన వినియోగదారులకు ఒక రక్షణ కవచం లాగా పనిచేస్తుంది.రానున్న రోజుల్లో ఈ SUV మరిన్ని మంచి అమ్మకాలు పొందుతుందని భావిస్తున్నాము.

More from DriveSpark

Article Published On: Sunday, October 23, 2022, 8:00 [IST]
English summary
Volkswagen taigun suv completes one year in india bookings crossed 45000 units
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+