డేట్ బ్లాక్ చేసుకోండి.. మార్చ్ 8న ఫోక్స్‌వ్యాగన్ వర్త్యుస్ (Volkswagen Virtus) సెడాన్ వస్తోంది..!

చెక్ రిపబ్లిక్ కార్ బ్రాండ్ స్కోడా (Skoda) తమ ర్యాపిడ్ (Rapid) సెడాన్ స్థానాన్ని రీప్లేస్ చేస్తూ కొత్త స్లావియా (Slavia) అనే సెడాన్ ను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, స్కోడా అనుబంధ సంస్థ అయిన ఫోక్స్‌వ్యాగన్ (Volkswagen) కూడా తమ ప్రస్తుత వెంటో (Vento) సెడాన్ స్థానాన్ని రీప్లేస్ చేస్తూ, వర్త్యుస్ (Virtus) అనే కొత్త సెడాన్ ను పరిచయం చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు కంపెనీ ఈ టీజర్ ను కూడా విడుదల చేసింది. ఈ టీజర్ ప్రకారం, కొత్త ఫోక్స్‌వ్యాగన్ వర్త్యుస్ (Volkswagen Virtus) ను కంపెనీ మార్చి 8, 2022 వ తేదీన అధికారికంగా ఆవిష్కరించనుంది.

డేట్ బ్లాక్ చేసుకోండి.. మార్చ్ 8న ఫోక్స్‌వ్యాగన్ వర్త్యుస్ (Volkswagen Virtus) సెడాన్ వస్తోంది..!

ఫోక్స్‌వ్యాగన్ బ్రాండ్ నుండి చాలా కాలంగా మార్కెట్లో ఉన్న వెంటో సెడాన్ స్థానంలో కంపెనీ ఈ కొత్త వర్త్యుస్ సెడాన్ భారతదేశానికి తీసుకురాబోతోంది. మార్చ్ నెలలో కంపెనీ ఈ కారును ప్రపంచ వ్యాప్తంగా ఆవిష్కరించిన తర్వాత, ఇది మే 2022 నాటికి భారత మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉంది. స్కోడా తీసుకురానున్న స్లావియా మిడ్-సైజ్ సెడాన్ ఆధారంగానే, ఈ కొత్త ఫోక్స్‌వ్యాగన్ వర్త్యుస్ సెడాన్ కూడా అదే ప్లాట్‌ఫామ్, ఇంజన్ మరియు పరికరాలను కలిగి ఉండే అవకాశం ఉంది.

డేట్ బ్లాక్ చేసుకోండి.. మార్చ్ 8న ఫోక్స్‌వ్యాగన్ వర్త్యుస్ (Volkswagen Virtus) సెడాన్ వస్తోంది..!

ఫోక్స్‌వ్యాగన్ మరియు స్కోడా సంస్థలు భారతదేశం కోసం ప్రత్యేకంగా రూపొందించిన MQB A0 IN ప్లాట్‌ఫారమ్‌పై ఈ కొత్త సెడాన్ కూడా ఆధారపడి ఉంటుంది. ఇదే ప్లాట్‌ఫామ్ పై స్కోడా తమ స్లావియా సెడాన్ ను కూడా తయారు చేస్తోంది. ఫోక్స్‌వ్యాగన్ టైగన్ మరియు స్కోడా కుషాక్ మిడ్-సైజ్ ఎస్‌యూవీల విషయంలో ఈ ఇరు కంపెనీలు అనుసరించిన విధానాన్నే ఈ కొత్త సెడాన్ల విషయంలో కూడా అనుసరించనున్నారు. స్కోడా స్లావియా పేరుతో కంపెనీ ఓ కారును ప్రస్తుతం దక్షిణ అమెరికా మార్కెట్లలో విక్రయిస్తోంది.

డేట్ బ్లాక్ చేసుకోండి.. మార్చ్ 8న ఫోక్స్‌వ్యాగన్ వర్త్యుస్ (Volkswagen Virtus) సెడాన్ వస్తోంది..!

ఇదే మోడల్ ఆధారంగా, పూర్తి ఫేస్‌లిఫ్ట్ మోడల్ ను భారతదేశంలో తయారు చేయబోతున్నారు. ఇది ప్రస్తుతం, మార్కెట్లో అత్యంత పోటీతో ఉన్న మిడ్-సైజ్ సెడాన్ విభాగంలో హోండా సిటీ మరియు హ్యుందాయ్ వెర్నా వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుందని భావిస్తున్నారు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, ఫోక్స్‌వ్యాగన్ వర్త్యుస్ మొత్తం పొడవు 4,482 మిమీ, వెడల్పు 1751 మిమీ, ఎత్తు 1472 మిమీ గా ఉంటుంది. ఇది కంపెనీ ప్రస్తుతం విక్రయిస్తున్న వెంటో సెడాన్ తో పోల్చినప్పుడు దాని కన్నా 92 మిమీ ఎక్కువ పొడవు, 52 మిమీ ఎక్కువ వెడల్పు మరియు 5 మిమీ ఎక్కువ ఎత్తును కలిగి ఉంటుంది. వర్త్యుస్ వీల్‌బేస్ 2651 మిమీగా ఉంటుంది, ఇది వెంటో కంటే 98 మిమీ ఎక్కువ.

డేట్ బ్లాక్ చేసుకోండి.. మార్చ్ 8న ఫోక్స్‌వ్యాగన్ వర్త్యుస్ (Volkswagen Virtus) సెడాన్ వస్తోంది..!

ఫోక్స్‌వ్యాగన్ వర్త్యుస్ ఇంజన్ విషయానికి వస్తే, ఇందులో 1.0 లీటర్ టిఎస్ఐ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించే అవకాశం ఉంది. ఈ ఇంజన్ గరిష్టంగా 110 బిహెచ్‌పి శక్తిని అందించగలదు. ఇది కాకుండా, ఈ మోడల్ లో 150 బిహెచ్‌పి పవర్ మరియు 250 న్యూటన్ మీటర్ టార్క్ ఉత్పత్తి చేసే 1.5 లీటర్ న్యాచురల్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ కూడా ఉంటుందని సమాచారం. అయితే, ప్రస్తుతానికి కంపెనీ ఇందులో ఎలాంటి డీజిల్ ఇంజన్ ఆప్షన్ ను ప్రవేశపెట్టే అవకాశాలు కనిపించడం లేదు.

డేట్ బ్లాక్ చేసుకోండి.. మార్చ్ 8న ఫోక్స్‌వ్యాగన్ వర్త్యుస్ (Volkswagen Virtus) సెడాన్ వస్తోంది..!

ఇక గేర్‌బాక్స్ ఆప్షన్ల విషయానికి వస్తే, ఇందులో 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్, 6-స్పీడ్ ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ మరియు 7-స్పీడ్ డిఎస్‌జి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లను ఉండొచ్చని సమాచారం. ఇక ఈ కారులో ప్రధానంగా ఆఫర్ చేయబోయే ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో పెద్ద 10.25 ఇంచ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పెద్ద టచ్‌స్క్రీన్ ఫోక్స్‌వ్యాగన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే సపోర్ట్, లేటెస్ట్ స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్లు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, కీలెస్ ఎంట్రీ, ఫ్రంట్ మరియు రియర్ పార్కింగ్ సెన్సార్‌లు మొదలైనవి లభ్యం కానున్నాయి.

డేట్ బ్లాక్ చేసుకోండి.. మార్చ్ 8న ఫోక్స్‌వ్యాగన్ వర్త్యుస్ (Volkswagen Virtus) సెడాన్ వస్తోంది..!

ఫోక్స్‌వ్యాగన్ వర్త్యుస్ స్టైలింగ్ ను గమనిస్తే, ఇందులో ముందు వైపు ఫోక్స్‌వ్యాగన్ సిగ్నేచర్ ఫ్రంట్ గ్రిల్, సన్నని హెడ్‌ల్యాంప్‌లు మరియు ఇంటిగ్రేటెడ్ యాంగిల్ రన్నింగ్ లైట్లు, ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్ మరియు స్లోపింగ్ రూఫ్‌లైన్ వంటి డిజైన్ ఎలిమెంట్స్ ఉంటాయి. వెనుక వైపు వ్రాప్అ‌రౌండ్ టెయిల్‌లైట్స్, డక్‌టైల్ స్పాయిలర్ వంటి హైలైట్స్ ఉంటాయి. వర్త్యుస్ సెడాన్ ను ఫోక్స్‌వ్యాగన్ యొక్క చకన్ (పుణె)లోని ప్లాంట్‌లో తయారు చేయనున్నారు. అంతర్జాతీయంగా, ఫోక్స్‌వ్యాగన్ వర్త్యుస్ బ్రెజిల్‌లో మాత్రమే అమ్మకానికి ఉంది. ఇది ఆరవ తరం పోలో హ్యాచ్‌బ్యాక్ యొక్క సెడాన్ వెర్షన్ వెంటోతో భర్తీ చేయబడనుంది.

డేట్ బ్లాక్ చేసుకోండి.. మార్చ్ 8న ఫోక్స్‌వ్యాగన్ వర్త్యుస్ (Volkswagen Virtus) సెడాన్ వస్తోంది..!

వర్త్యుస్ సెడాన్ ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించేందుకు ఫోక్స్‌వ్యాగన్ ఈ కారు తయారీలో దాదాపు 93 శాతం స్థానికీకరణ విధానాన్ని అనుసరిస్తుందని, ఇందుకోసం కంపెనీ దేశీయ మార్కెట్లో తయారు చేసిన భాగాలను ఉపయోగిస్తుందని గతంలో వెల్లడి చేసింది. టైగన్, టిగువాన్ వంటి మోడళ్ల విడుదలతో మంచి జోరుమీదున్న ఫోక్స్‌వ్యాన్ ఈ 2022 సంవత్సరంలో భారత మార్కెట్లో దశాబ్దపు అత్యధిక విక్రయాలను అంచనా వేస్తోంది. భారత మార్కెట్లో అమ్మకాలను పెంచుకునేందుకు ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్ వచ్చే ఏడాది నాటికి ఇక్కడి మార్కెట్లో 18 కొత్త మోడళ్లను విడుదల చేయాలని ప్లాన్ చేస్తోంది.

డేట్ బ్లాక్ చేసుకోండి.. మార్చ్ 8న ఫోక్స్‌వ్యాగన్ వర్త్యుస్ (Volkswagen Virtus) సెడాన్ వస్తోంది..!

ఈ కారణంగా 2022లో కంపెనీ అమ్మకాలు రెట్టింపు అవుతాయని ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్ అంచనా వేస్తోంది. ఇదే గనుక జరిగితే ఈ గ్రూప్ యొక్క విక్రయాలు సంవత్సరానికి 100,000 యూనిట్లను దాటే అవకాశం ఉంది. ఇండియా స్ట్రాటజీ 2.0 పథకం కింద కంపెనీ ఇప్పటికే రూ. 7500 కోట్లు పెట్టుబడులను వెచ్చించింది. ఇప్పుడు దాని ఫలితాలు క్రమంగా కనిపిస్తున్నాయి, కొత్త ఉత్పత్తులు మరియు నెట్‌వర్క్ విస్తరణ కారణంగా ఈ ఏడాది కంపెనీ అమ్మకాలు అద్భుతంగా ఉన్నాయి. ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్లో ప్రస్తుతం స్కోడా, ఫోక్స్‌వ్యాగన్, ఆడి, పోర్ష్ మరియు లంబోర్ఘిని కార్ బ్రాండ్లు ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Wednesday, February 16, 2022, 17:30 [IST]
English summary
Volkswagen to unveil its all new sedan virtus on 8th march 2022 details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+