జూన్ 9న ఫోక్స్‌వ్యాగన్ వర్త్యుస్ (Volkswagen Virtus) విడుదల.. వేరియంట్ల వివరాలు వెల్లడి..!

జర్మన్ కార్ బ్రాండ్ 'ఫోక్స్‌వ్యాగన్' (Volkswagen) తమ సరికొత్త మిడ్-సైజ్ సెడాన్ 'ఫోక్స్‌వ్యాగన్ వర్త్యుస్' (Volkswagen Virtus) ను జూన్ 9, 2022 వ తేదీన భారత మార్కెట్లో విడుదల చేయనుంది. ఈ మోడల్ కోసం కంపెనీ ఇప్పటికే దేశవ్యాప్తంగా బుకింగ్ లు కూడా ప్రారంభించబడ్డాయి మరియు కొద్ది రోజుల్లోనే దీని డెలివరీలు కూడా ప్రారంభం కానున్నాయి. తాజాగా, ఈ సెడాన్ వేరియంట్లకు సంబంధించిన సమాచారం వెల్లడైంది. ఆ వివరాలేంటో చూద్దాం రండి.

జూన్ 9న ఫోక్స్‌వ్యాగన్ వర్త్యుస్ (Volkswagen Virtus) విడుదల.. వేరియంట్ల వివరాలు వెల్లడి..!

సమాచారం ప్రకారం, ఫోక్స్‌వ్యాగన్ వర్త్యుస్ 1.0 లీటర్ టిఎస్ఐ పెట్రోల్ మరియు 1.5 లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్‌ ఆప్షన్లతో అందుబాటులోకి రానుంది. ఈ ఇంజన్ ఆప్షన్లను బట్టి మొత్తం ఆరు వేరియంట్లలో ఈ సెడాన్ విడుదల కానుంది. వీటిలో 1.0-లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్ వేరియంట్ మొత్తం 5 వేరియంట్‌లలో అందించబడుతుంది. కాగా, 1.5-లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్‌ కేవలం ఒకే ఒక వేరియంట్‌లో మాత్రమే విడుదల చేయబడుతుందని సమాచారం.

జూన్ 9న ఫోక్స్‌వ్యాగన్ వర్త్యుస్ (Volkswagen Virtus) విడుదల.. వేరియంట్ల వివరాలు వెల్లడి..!

వర్త్యుస్ సెడాన్ యొక్క 1.0 లీటర్ ఇంజన్ వెర్షన్ కంఫర్ట్‌లైన్ (మ్యాన్యువల్), హైలైన్ (మ్యాన్యువల్), హైలైన్ (ఆటోమేటిక్), టాప్‌లైన్ (మ్యాన్యువల్) మరియు టాప్‌లైన్ (ఆటోమేటిక్) వేరియంట్లలో అందించబడుతుంది. కాగా, 1.5 లీటర్ ఇంజన్‌ను జిటి వేరియంట్ గా డిసిటి (డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్) వేరియంట్‌లో అందించవచ్చని తెలుస్తోంది. ఇదే ప్లాట్‌ఫారమ్ ను ఉపయోగించుకొని తయారైన స్కోడా స్లావియా మాదిరిగా ఫోక్స్‌వ్యాగన్ వర్త్యుస్ యొక్క దిగువ ట్రిమ్‌లు 1.5-లీటర్ ఇంజన్ ఆప్షన్ ను పొందవు.

జూన్ 9న ఫోక్స్‌వ్యాగన్ వర్త్యుస్ (Volkswagen Virtus) విడుదల.. వేరియంట్ల వివరాలు వెల్లడి..!

అంతే కాకుండా, స్కోడా స్లావియా మాదిరిగా ఇది పెద్ద ఇంజన్‌తో కూడిన మాన్యువల్ గేర్‌బాక్స్‌ను కూడా పొందదు. ఇక ఇంజన్ స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే, ఫోక్స్‌వ్యాగన్ వర్త్యుస్ యొక్క 1.0-లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 113 బిహెచ్‌పి శక్తిని మరియు 178 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది. ఇకపోతే, ఇందులోని రెండవ ఇంజన్ ఆప్షన్ అయిన 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్, గరిష్టంగా 148 బిహెచ్‌పి శక్తిని మరియు 250 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 7-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ తో లభ్యం కానుంది.

జూన్ 9న ఫోక్స్‌వ్యాగన్ వర్త్యుస్ (Volkswagen Virtus) విడుదల.. వేరియంట్ల వివరాలు వెల్లడి..!

ఫోక్స్‌వ్యాగన్ మరియు స్కోడా సంస్థలు కలిసి భారత మార్కెట్ కోసం ప్లాన్ చేసిన ఇండియా 2.0 ప్రాజెక్ట్ (India 2.0 Project) లో భాగంగా వస్తున్న నాల్గవ మోడల్ ఈ వర్త్యుస్ సెడాన్. స్లావియా మరియు వర్త్యుస్ సెడాన్లు రెండూ ఒకే ప్లాట్‌ఫామ్ పై తయారైన నేపథ్యంలో, ఇవి రెండూ కూడా స్కోడా కుషాక్ మరియు ఫోక్స్‌వ్యాగన్ టైగన్ ఎస్‌యూవీల మాదిరిగానే ఒకేరకమైన ఇంజన్ ఆప్షన్స్, పరికరాలు మరియు ఫీచర్లు కలిగి ఉండనున్నాయి. ఫోక్స్‌వ్యాగన్ వర్త్యుస్ సెడాన్ ఉత్పత్తిలో కంపెనీ 95 శాతం స్థానికీకరణను పాటించనుంది. ఫలితంగా, దీని ధర స్కోడా స్లావియా కన్నా తక్కువగా ఉండే అవకాశం ఉంది.

జూన్ 9న ఫోక్స్‌వ్యాగన్ వర్త్యుస్ (Volkswagen Virtus) విడుదల.. వేరియంట్ల వివరాలు వెల్లడి..!

ఫోక్స్‌వ్యాగన్ వర్త్యుస్ సెడాన్‌ యొక్క డిజైన్ హైలైట్లను గమనిస్తే, దీని ముందు భాగంలో డ్యూయల్-స్లాట్ గ్రిల్‌, ఎల్ఈడి డిఆర్ఎల్ లతో కూడిన రెండు ప్రొజెక్టర్ హెడ్‌లైట్‌లు, పెద్ద ఎయిర్ డ్యామ్, సైడ్ ప్రొఫైల్ డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్, వెనుక వైపు షార్క్ ఫిన్ యాంటెన్నా, క్రోమ్ ఇన్సర్ట్‌లతో కూడిన డోర్ హ్యాండిల్స్, బ్లాక్ సైడ్ మిర్రర్స్ మరియు ఎల్ఈడి టెయిల్ లైట్ మొదలైన వాటితో ఇది చాలా ఆకర్షణీయంగా మరియు ప్రీమియంగా కనిపిస్తుంది. కంపెనీ ఈ కారును మొత్తం 6 ఆకర్షణీయమైన రంగులలో విడుదల చేయనుంది.

జూన్ 9న ఫోక్స్‌వ్యాగన్ వర్త్యుస్ (Volkswagen Virtus) విడుదల.. వేరియంట్ల వివరాలు వెల్లడి..!

వర్త్యుస్ సెడాన్ ఇంటీరియర్లలో లభించే ప్రధాన ఫీచర్లను గమనిస్తే, ఇందులో 10 ఇంచ్ టచ్‌స్క్రీన్, 8 ఇంచ్ ఫుల్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ కనెక్టింగ్ టెక్నాలజీ, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్, సన్‌రూఫ్, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ ఏసి, రియర్ ఏసి వెంట్‌లు, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఆటోమేటిక్ హెడ్‌లైట్లు, కీలెస్ ఎంట్రీ, రెయిన్ సెన్సింగ్ వైపర్‌లు, ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్‌లు మరియు 8-స్పీకర్లతో కూడిన సౌండ్ సిస్టమ్‌ మొదలైనవి ఉన్నాయి. ఇది 2,651 మిమీ పొడవైన వీల్‌బేస్ తో క్యాబిన్ లోపల విశాలమైన స్థలాన్ని కలిగి ఉంటుంది మరియు ఇందులో 521 లీటర్ల పెద్ద బూట్ స్పేస్‌ కూడా ఉంటుంది.

జూన్ 9న ఫోక్స్‌వ్యాగన్ వర్త్యుస్ (Volkswagen Virtus) విడుదల.. వేరియంట్ల వివరాలు వెల్లడి..!

భద్రత విషయంలో కూడా ఫోక్స్‌వ్యాగన్ తమ వర్త్యుస్ మిడ్-సైజ్ సెడాన్ లో అనేక ఫీచర్లను అందిస్తోంది. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ సిస్టమ్, మల్టీ-కొలైజన్ బ్రేక్‌లు, రియర్ పార్కింగ్ కెమెరా, ఐఎస్ఓఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఏబిఎస్ విత్ ఈబిడి, ఫ్రంట్ మరియు రియర్ పార్కింగ్ సెన్సార్లు మొదలైనవి ఉన్నాయి. ఫోక్స్‌వ్యాగన్ వర్త్యుస్ సెడాన్ మా డ్రైవ్‌స్పార్క్‌ బృందం ఇటీవలే టెస్ట్ డ్రైవ్ కూడా చేసింది. - ఈ కారుకి సంబంధించిన పూర్తి రివ్యూ కోసంఈ లింకుపై క్లిక్ చేయండి.

More from DriveSpark

Article Published On: Tuesday, June 7, 2022, 16:27 [IST]
English summary
Volkswagen virtus launch scheduled for 9th june variant details revealed
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+