Volkswagen నుంచి Virtus సెడాన్ వచ్చేస్తోంది: బుకింగ్స్ కూడా షురూ.. ఇక మీదే ఆలస్యం
ప్రముఖ వాహన తయారీ సంస్థ 'ఫోక్స్‌వ్యాగన్' (Volkswagen) తన 'ఫోక్స్‌వ్యాగన్ వర్టస్' (Volkswagen Virtus) ను ఆవిష్కరించింది. ఈ కొత్త SUV భారతీయ మార్కెట్లో విడుదల కానున్న కొత్త మోడల్ కానుంది. కావున ఇది త్వరలోనే మార్కెట్లో విడుదలవుతుంది. త్వరలో విడుదలకానున్న ఈ కొత్త మోడల్ అనేక ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. ఈ కొత్త 'ఫోక్స్‌వ్యాగన్ వర్టస్' (Volkswagen Virtus) గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

భారతీయ మార్కెట్లో విడుదలకానున్న 'ఫోక్స్‌వ్యాగన్ వర్టస్' Volkswagen Virtus అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఈ మోడల్ ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉన్న 'ఫోక్స్‌వ్యాగన్ వెంటో' స్థానంలో ఉంటుంది. అయితే ఈ కొత్త వర్టస్ బుకింగ్స్ కంపెనీ యొక్క డీలర్‌షిప్‌లలో నేటి నుంచి ప్రారంభించబడ్డాయి. కంపెనీ దీనిని మొత్తం 6 కలర్ ఆప్షన్లలో తీసుకురానున్నట్లు సమాచారం.

ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ (Volkswagen Virtus) యొక్క ముందు భాగంలో డ్యూయల్-స్లాట్ గ్రిల్‌తో పాటు ఎల్ఈడీ డిఆర్ఎల్ లతో రెండు ప్రొజెక్టర్ హెడ్‌లైట్‌లను పొందుతుంది. అంతే కాకూండా దీని ముందు భాగంలో పెద్ద ఎయిర్ డ్యామ్ మరియు హాలోజన్ హెడ్‌లైట్లు వంటివి కూడా అందుబాటులో ఉంటాయి.

ఇక సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే, ఇందులో డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్, షార్క్ ఫిన్ యాంటెన్నా, క్రోమ్ ఇన్సర్ట్‌లతో కూడిన డోర్ హ్యాండిల్స్, బ్లాక్ ORVM వంటివి ఉన్నాయి. దీని వెనుక భాగంలో ఎల్ఈడీ టెయిల్ లైట్ కూడా ఇవ్వబడ్డాయి. మొత్తం మీద వెనుక భాగం నుంచి చూడటానికి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ (Volkswagen Virtus) యొక్క ఫ్రంట్ ఫెండర్‌లపై 'GT' బ్యాడ్జ్ ఇవ్వబడ్డాయి. ఇక దీని కొలతల విషయానికి వస్తే, దీని పొడవు 4,482 మిమీ, వెడల్పు 1751 మిమీ మరియు ఎత్తు 1472 మిమీ ఉంటుంది. ఈ కొత్త మోడల్ దాని వెంటో మోడల్ కంటే కూడా 92 మిమీ పొడవు, 52 మిమీ వెడల్పు మరియు 5 మిమీ ఎత్తు ఎక్కువగా ఉంటుంది. ఇక దీని వీల్‌బేస్ అనేది 2651 మిమీ వరకు ఉంటుంది. ఈ వీల్‌బేస్ కూడా వెంటో కంటే 98 మిమీ ఎక్కువ. మొత్తం మీద ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ అనేది వెంటో కంటే కూడా పరిమాణంలో పెద్దదిగా ఉంటుంది.
| Volkswagen Virtus | |
| Dimensions | Measurements |
| Length | 4,561 mm |
| Width | 1,752 mm |
| Height | 1,507 mm |
| Wheelbase | 2,651 mm |
| Bootspace | 521 litres |
| Specifications | Details |
| Engine | 1.0L Turbo Petrol / 1.5L Turbo Petrol |
| Power | 115 PS / 150 PS |
| Torque | 175 Nm / 250 Nm |
| Transmission | 6-speed MT, 6-speed AT, 7-speed DCT |

'ఫోక్స్‌వ్యాగన్ వర్టస్' మోడల్ 10-ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే సపోర్ట్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, కీలెస్ ఎంట్రీ, వైర్‌లెస్ ఛార్జింగ్, రియర్ ఎయిర్ కండిషనింగ్, యాంబియంట్ లైటింగ్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, క్రూయిజ్ కంట్రోల్ మరియు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్ వంటి వాటిని పొందుతుంది. కావున ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

కొత్త ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ యొక్క సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో దాదాపు 40 సేఫ్టీ ఫీచర్స్ అందుబాటులో ఉన్నట్లు తెలిసింది. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ సిస్టమ్, మల్టీ-కొలిషన్ బ్రేక్‌లు, రియర్ పార్కింగ్ కెమెరా, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఏబీఎస్ విత్ ఈబిడి, ఫ్రంట్ మరియు రియర్ పార్కింగ్ సెన్సార్లు వంటివి ఉన్నాయి.

ఇక ఇంజన్ విషయానికి వస్తే, ఇందులో 1.0-లీటర్ TSI టర్బో పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇది 110 బిహెచ్‌పి పవర్ మరియు 170 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. అంతే కాకుండా ఈ కొత్త మోడల్ 150 బిహెచ్‌పి పవర్ మరియు 250 ఎన్ఎమ్ టార్క్‌ను అందించే 1.5 లీటర్ ఇంజన్ కూడా పొందుతుంది. ఈ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్, 6-స్పీడ్ ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ మరియు 7-స్పీడ్ DSG ఆటోమేటిక్ వంటి వాటిని పొందుతుంది. కావున మంచి పనితీరుని అందించే అవకాశం కూడా ఉంటుంది.

ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది. అవి డైనమిక్ లైన్ మరియు జిటి లైన్ వేరియంట్స్. కంపెనీ వీటిని MQB A0 IN ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించనుంది. ఇది కంపెనీ యొక్క ఇండియా 2.0 ప్రాజెక్ట్ కింద విడుదలకానున్న నాల్గవ మోడల్. కావున ఇందులోని ఫీచర్లు మరియు పరికరాలు స్కోడా స్లావియా నుండి ప్రేరణ పొందాయి.

ఫోక్స్‌వ్యాగన్ కంపెనీ ఈ కొత్త సెడాన్‌ను 2022 మే నాటికి భారత మార్కెట్లోకి తీసుకువచ్చే అవకాశం ఉంది. ఈ సంవత్సరం ఫోక్స్‌వ్యాగన్ కంపెనీ మొత్తం 18 కొత్త మోడళ్లను విడుదల చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తోంది. కావున ఇవన్నీ కూడా త్వరలోనే మార్కెట్లో విడుదలకానున్నాయి.

వోక్స్‌వ్యాగన్ వర్టస్ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకూండా ఒక విలాసవంతమైన సెడాన్ కూడా. ఇది దాని సెగ్మెంట్‌లో పొడవైనదిగా ఉంటుంది. అయితే ఈ కొత్త మోడల్ లో కంపెనీ వాహన వినియోగదారులకు కావలసిన ఫీచర్స్ మాత్రమే కాకుండా సేఫ్టీ ఫీచర్స్ వంటి వాటిని కూడా అందిస్తుంది. కొత్త వోక్స్‌వ్యాగన్ వర్టస్ భారతీయ మార్కెట్లో విడుదలైన తరువాత స్కోడా స్లావియా, హోండా సిటీ, హ్యుందాయ్ వెర్నా మరియు మారుతి సుజుకి సియాజ్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.


Click it and Unblock the Notifications








