ఫోక్స్‌వ్యాగన్ వర్త్యుస్ (volkswagen-virtus) సెడాన్ కావాలా..? అయితే జూన్ 9 వరకూ ఆగాల్సిందే..!

జర్మన్ కార్ బ్రాండ్ 'ఫోక్స్‌వ్యాగన్' (Volkswagen) ఇటీవలే భారత మార్కెట్లో ఆవిష్కరించిన తమ సరికొత్త మిడ్-సైజ్ సెడాన్ 'ఫోక్స్‌వ్యాగన్ వర్త్యుస్' (Volkswagen Virtus) కారును పొందాలంటే, కస్టమర్లు ఇప్పుడు వచ్చే నెల వరకూ వేచి ఉండాల్సిందే. భారత మార్కెట్లో వర్త్యుస్ సెడాన్‌ను జూన్ 9, 2022 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఫోక్స్‌వ్యాగన్ ఇండియా తెలిపింది. కాగా, ఈ మోడల్ కోసం కంపెనీ ఇప్పటికే అధికారిక బుకింగ్ లను కూడా స్వీకరించడం ప్రారంభించింది.

ఫోక్స్‌వ్యాగన్ వర్త్యుస్ (volkswagen-virtus) సెడాన్ కావాలా..? అయితే జూన్ 9 వరకూ ఆగాల్సిందే..!

ఫోక్స్‌వ్యాగన్ తమ వర్త్యుస్ సెడాన్ కస్టమర్ల కోసం వెయిటింగ్ పీరియడ్‌ను తగ్గించేందుకు ముందుగానే ప్లాన్ చేస్తోంది. పూనేలో ఉన్న తమ చాకన్ ప్లాంట్‌లో ఫోక్స్‌వ్యాగన్ ఇప్పటికే వర్త్యుస్ సెడాను కారును ఉత్పత్తి చేయడం ప్రారంభించింది. ఈ కారు కోసం రాబోయే డిమాండ్‌ను ముందుగానే ఊహించిన ఈ జర్మన్ కార్ కంపెనీ, వర్త్యుస్ కారును మార్కెట్లో విడుదల చేసే నాటికి తగినంత స్టాక్‌ను కలిగి ఉండాలని ప్లాన్ చేస్తోంది. ఇలా చేయడం వలన డిమాండుకు తగిన సప్లయ్‌ని కలిగి ఉండాలని కంపెనీ చూస్తోంది.

ఫోక్స్‌వ్యాగన్ వర్త్యుస్ (volkswagen-virtus) సెడాన్ కావాలా..? అయితే జూన్ 9 వరకూ ఆగాల్సిందే..!

ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్ నుండి తాజాగా మార్కెట్లోకి రాబోతున్న ఈ లేటెస్ట్ మిడ్-సైజ్ సెడాన్, ప్రస్తుతం కంపెనీ విక్రయిస్తున్న వెంటో సెడాన్ స్థానాన్ని రీప్లేస్ చేయనుంది. ఇది చెక్ రిపబ్లిక్ కార్ బ్రాండ్ స్కోడా ఇటీవల మార్కెట్లో విడుదల చేసిన స్లావియా (Skoda Slavia) సెడాన్ ప్లాట్‌ఫామ్‌ను పంచుకుంటుంది. కాబట్టి, ఈ రెండు కార్లలో (స్లావియా మరియు వర్త్యుస్) అనేక భాగాలు మరియు పరికరాలు ఒకేలా ఉండనున్నాయి. ఫోక్స్‌వ్యాగన్ వర్త్యుస్ సెడాన్ ఉత్పత్తిలో కంపెనీ 95 శాతం స్థానికీకరణను పాటించనుంది.

ఫోక్స్‌వ్యాగన్ వర్త్యుస్ (volkswagen-virtus) సెడాన్ కావాలా..? అయితే జూన్ 9 వరకూ ఆగాల్సిందే..!

ఫోక్స్‌వ్యాగన్ ఈ కారు తయారీలో ఉపయోగించే భాగాలలో 95 శాతం వాటిని స్థానికంగా భారతీయ విక్రేతల నుండే సేకరించనుంది. ఫలితంగా, వర్త్యుస్ సెడాన్ ధర కూడా అగ్రెసివ్ గా ఉంటుందని భావిస్తున్నారు. కంపెనీ ఈ కారును రెండు ట్రిమ్‌లలో వివిధ వేరియంట్లలో విడుదల చేసే అవకాశం ఉంటుంది. ఇందులో డైనమిక్ లైన్ మరియు జిటి లైన్ అనే ట్రిమ్స్ ఉంటాయని సమాచారం. ఫోక్స్‌వ్యాగన్ వర్త్యుస్ సెడాన్ ను స్కోడా-ఫోక్స్‌వ్యాగన్ కంపెనీలు సంయుక్తంగా నిర్వహిస్తున్న MQB A0 IN ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించనున్నారు.

ఫోక్స్‌వ్యాగన్ వర్త్యుస్ (volkswagen-virtus) సెడాన్ కావాలా..? అయితే జూన్ 9 వరకూ ఆగాల్సిందే..!

ఫోక్స్‌వ్యాగన్ మరియు స్కోడా సంస్థలు కలిసి భారత మార్కెట్ కోసం ప్లాన్ చేసిన ఇండియా 2.0 ప్రాజెక్ట్ లో భాగంగా వస్తున్న నాల్గవ మోడల్ ఈ వర్త్యుస్ సెడాన్. స్లావియా మరియు వర్త్యుస్ సెడాన్లు రెండూ ఒకే ప్లాట్‌ఫామ్ పై తయారైన నేపథ్యంలో, ఇవి రెండూ కూడా కుషాక్ మరియు టైగన్ ఎస్‌యూవీల మాదిరిగానే ఒకేరకమైన ఇంజన్ ఆప్షన్స్, పరికరాలు మరియు ఫీచర్లు కలిగి ఉండనున్నాయి. కంపెనీ తమ వర్త్యుస్ సెడాన్ ను 1.0 లీటర్ మరియు 1.5 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌లతో విడుదల చేయనుంది.

ఫోక్స్‌వ్యాగన్ వర్త్యుస్ (volkswagen-virtus) సెడాన్ కావాలా..? అయితే జూన్ 9 వరకూ ఆగాల్సిందే..!

ఇందులోని 1.0-లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 113 బిహెచ్‌పి శక్తిని మరియు 178 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది. ఇకపోతే, ఇందులోని రెండవ ఇంజన్ ఆప్షన్ అయిన 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్, గరిష్టంగా 148 బిహెచ్‌పి శక్తిని మరియు 250 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా 7-స్పీడ్ DSG ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభ్యం కానుంది.

ఫోక్స్‌వ్యాగన్ వర్త్యుస్ (volkswagen-virtus) సెడాన్ కావాలా..? అయితే జూన్ 9 వరకూ ఆగాల్సిందే..!

ఫోక్స్‌వ్యాగన్ వర్త్యుస్ సెడాన్‌ను కంపెనీ మొత్తం 6 కలర్ ఆప్షన్లలో తీసుకురానుంది. దీని డిజైన్‌ను గమనిస్తే, ముందు భాగంలో డ్యూయల్-స్లాట్ గ్రిల్‌తో , ఎల్ఈడి డిఆర్ఎల్ లతో కూడిన రెండు ప్రొజెక్టర్ హెడ్‌లైట్‌లు, పెద్ద ఎయిర్ డ్యామ్, సైడ్ ప్రొఫైల్ డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్, వెనుక వైపు షార్క్ ఫిన్ యాంటెన్నా, క్రోమ్ ఇన్సర్ట్‌లతో కూడిన డోర్ హ్యాండిల్స్, బ్లాక్ సైడ్ మిర్రర్స్ మరియు ఎల్ఈడి టెయిల్ లైట్ వంటి డిజైన్ ఎలిమెంట్స్‌తో ఇది చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

ఫోక్స్‌వ్యాగన్ వర్త్యుస్ (volkswagen-virtus) సెడాన్ కావాలా..? అయితే జూన్ 9 వరకూ ఆగాల్సిందే..!

ఫోక్స్‌వ్యాగన్ వర్త్యుస్ సెడాన్ 2,651 మిమీ పొడవైన వీల్‌బేస్ ను కలిగి ఉండి, విశాలమైన క్యాబిన్ స్పేస్‌ను అందించనుంది మరియు ఇందులో 521 లీటర్ల పెద్ద బూట్ స్పేస్‌ కూడా ఉంటుంది. ఈ కారులో లభించే ప్రధాన ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో 10 ఇంచ్ టచ్‌స్క్రీన్, 8 ఇంచ్ ఫుల్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ కనెక్టింగ్ టెక్నాలజీ, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్, సన్‌రూఫ్, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ ఏసి, రియర్ ఏసి వెంట్‌లు, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఆటోమేటిక్ హెడ్‌లైట్లు, కీలెస్ ఎంట్రీ, రెయిన్ సెన్సింగ్ వైపర్‌లు, ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్‌లు మరియు 8-స్పీకర్లతో కూడిన సౌండ్ సిస్టమ్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఫోక్స్‌వ్యాగన్ వర్త్యుస్ (volkswagen-virtus) సెడాన్ కావాలా..? అయితే జూన్ 9 వరకూ ఆగాల్సిందే..!

సేఫ్టీ విషయానికి వస్తే, కొత్త ఫోక్స్‌వ్యాగన్ వర్త్యుస్ సెడాన్‌లో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ సిస్టమ్, మల్టీ-కొలిషన్ బ్రేక్‌లు, రియర్ పార్కింగ్ కెమెరా, ఐఎస్ఓఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఏబిఎస్ విత్ ఈబిడి, ఫ్రంట్ మరియు రియర్ పార్కింగ్ సెన్సార్లు మొదలైన వాటితో పాటుగా మరికొన్ని అధునాతన సేఫ్టీ ఫీచర్లు కూడా ఉండనున్నాయి. ఈ కారుకి సంబంధించిన మరిన్ని లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ని గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Volkswagen virtus sedan india launch scheduled on 9th june 2022 details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X