ఖరీదైన ఎలక్ట్రిక్ SUV 'ఎక్స్‌సి40 రీచార్జ్' డెలివరీలను ప్రారంభించిన వోల్వో.. ఇక కంపెనీకి అన్నీ మంచి రోజులే

భారతీయ మార్కెట్లో 'వోల్వో' (Volvo) కంపెనీ ఇటీవల విడుదల చేసిన తన కొత్త 'ఎక్స్‌సి40 రీచార్జ్' (XC40 Recharge) ఎలక్ట్రిక్ కార్ డెలివరీలను ఎట్టకేలకు ప్రారంభించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ చూద్దాం.

వోల్వో కంపెనీ తన మొదటి 'ఎక్స్‌సి40 రీచార్జ్' (XC40 Recharge) ఎలక్ట్రిక్ కారుని గుజరాత్ కి చెందిన 'అజయ్ మొకారియా' కి డెలివరీ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వెల్లడయ్యాయి.

ఎక్స్‌సి40 రీచార్జ్ డెలివరీలను ప్రారంభించిన వోల్వో

కంపెనీ యొక్క ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు వోల్వో కార్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ 'జ్యోతి మల్హోత్రా' స్వయంగా డెలివరీ చేశారు. కంపెనీ గత కొన్ని రోజుల ముందు తన కొత్త SUV ఎక్స్‌సి40 రీచార్జ్ ను బెంగుళూరు రూరల్ సమీపంలోని హోస్కోట్‌ వోల్వో కార్ ఇండియా యొక్క తయారీ కేంద్రం నుండి విడుదల చేసింది. కాగా ఇప్పుడు డెలివరీలను కూడా ప్రారభించింది, అయితే మిగిలిన కస్టమర్లకు కూడా డెలివరీలు త్వరితగతిన జరిగే అవకాశం ఉంది.

వోల్వో XC40 రీఛార్జ్ భారతదేశంలోని మొట్టమొదటి స్థానికంగా అసెంబుల్ చేయబడిన లగ్జరీ ఎలక్ట్రిక్ SUV. ఇది రూ. 55.90 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా) ధర వద్ద అందుబాటులో ఉంది. ఈ ఆధునిక ఎలక్ట్రిక్ కారు ఒక ఫుల్ ఛార్జ్‌పై 418 కిలోమీటర్ల రేంజ్‌ అందిస్తుందని కంపెనీ ఇప్పటికే తెలిపింది.

ఎక్స్‌సి40 రీచార్జ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని కాంపాక్ట్ మాడ్యులర్ ఆర్కిటెక్చర్ ప్లాట్‌ఫామ్‌పై నిర్మించడం జరిగింది. కావున మంచి డిజైన్ మరియు ఆధునిక ఫీచర్స్ పొందుతుంది. ఇది చూడటానికి దాదాపుగా పెట్రోల్/డీజిల్ మోడళ్ల మాదిరిగానే కనిపిస్తుంది. కానీ ఇది ఎలక్ట్రిక్ SUV కావున కొన్ని అప్డేటెడ్ ఫీచర్స్ పొందుతుంది. కావున ఇందులో పెద్ద వోల్వో బ్యాడ్జ్, వైట్-ఫినిష్డ్ గ్రిల్, ఆటోమేటిక్ ఎల్ఈడి హెడ్‌లైట్లు, బ్లాక్ స్టోన్ రూఫ్ మరియు డోర్ మిర్రర్స్, రూఫ్ రైల్స్ మరియు 19 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ వంటివి ఉన్నాయి.

ఇంటీరియర్ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 9 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. ఇందులో ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం 12.3 ఇంచ్ టిఎఫ్‌టి డిస్‌ప్లే, టూ-జోన్ క్లైమేట్ కంట్రోల్, పవర్-ఆపరేటెడ్ టెయిల్‌గేట్, పవర్డ్ అండ్ వెంటిలేటెడ్ సీట్స్, వోల్వో కార్స్ సర్వీసెస్ యాప్, గూగుల్ ఆటోమోటివ్ సర్వీసెస్, 13-స్పీకర్ హార్మాన్ కార్డాన్ ఆడియో సిస్టమ్, వైర్‌లెస్ మొబైల్ ఛార్జర్, మౌంటెడ్ కంట్రోల్స్‌తో కూడిన స్టీరింగ్ వీల్ మొదలైనవి ఉన్నాయి.

వోల్వో ఎక్స్‌సి40 రీచార్జ్ డెలివరీ సందర్భంగా వోల్వో కార్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ 'జ్యోతి మల్హోత్రా'.. భారతదేశంలో అసెంబుల్ చేయబడిన ఈ ఎలక్ట్రిక్ డెలివరీలు ప్రారంభం కావడం చాలా సంతోషంగా ఉంది, 2030 నాటికి ఆల్-ఎలక్ట్రిక్ కార్ కంపెనీగా మారటానికి ఇది కంపెనీకి ఒక గొప్ప ముందడుగు అవుతుంది. కంపెనీ విడుదల చేసిన ఈ ఎలక్ట్రిక్ SUV మంచి ఆదరణ పొందుతోంది అన్నారు.

వోల్వో కంపెనీ తన ఎక్స్‌సి40 రీచార్జ్ కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించిన కేవలం 2 గంటల్లో 150 కంటే ఎక్కువ బుకింగ్స్ వచ్చాయని, ఇప్పటికే ఈ ఎలక్ట్రిక్ కారు కోసం కంపెనీ 500 బుకింగ్స్ పొందిందని కూడా ఈ సందర్భంగా జ్యోతి మల్హోత్రా అన్నారు. 2022 చివరి నాటికి కనీసం 100 కార్లను డెలివరీ చేయడానికి తగిన ఏర్పాటు చేసుకుంటోందని కూడా ఈ సందర్భంగా తెలిపారు. అంటే మిగిలిన బుకింగ్స్ 2023 ప్రారంభంలో డెలివరీ అయ్యే అవకాశం ఉంది.

వోల్వో ఎక్స్‌సి40 రీఛార్జ్ రెండు ఎలక్ట్రిక్ మోటార్‌లను పొందుతుంది. ఇందులో రెండు 150 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటార్లు ఇరువైపులా అమర్చబడి ఉంటాయి. ఇవి రెండూ కలిసి గరిష్టంగా 402 బిహెచ్‌పి పవర్ మరియు 660 ఎన్ఎమ్ టార్క్‌ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ రెండు ఎలక్ట్రిక్ మోటార్లు 78 kWh లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో పనిచేస్తాయి. ఇది కేవలం 4.9 సెకన్లలో గంటకు 0-100 కిమీ వరకు వేగవతం అవుతుంది. దీని గరిష్ట వేగం గంటకు 180 కిమీ వరకు వరకు ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Friday, November 11, 2022, 10:14 [IST]
English summary
Volvo electric suv xc40 recharge deliveries begin in india details
Read more on: #వోల్వో #volvo
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+