కొత్త 2022 మారుతి సుజుకి ఎక్స్ఎల్6 (Maruti Suzuki XL6) ఎమ్‌పివిలో కొత్తగా ఏముంటుంది..?

భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ (Maruti Suzuki India Limited), దేశీయ మార్కెట్లో విక్రయిస్తున్న ఎక్స్ఎల్6 ఎమ్‌పివిలో కంపెనీ ఓ కొత్త అప్‌గ్రేడెడ్ వెర్షన్ ను మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. సమాచారం ప్రకారం, ఈ కొత్త 2022 మారుతి సుజుకి ఎక్స్ఎల్6 (2022 Maruti Suzuki XL6) ఫేస్‌లిఫ్ట్ మోడల్ ఈ ఏడాది ఏప్రిల్ చివరి నాటికి భారతదేశంలో విడుదలయ్యే అవకాశం ఉంది. మరి ఈ కొత్త మోడల్ లో కొత్తగా లభించబోయే ఫీచర్లు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

కొత్త 2022 మారుతి సుజుకి ఎక్స్ఎల్6 (Maruti Suzuki XL6) ఎమ్‌పివిలో కొత్తగా ఏముంటుంది..?

2022 Maruti Suzuki XL6 : డిజైన్

ఎక్స్ఎల్6 ఎమ్‌పివిలో మారుతి సుజుకి కొద్దిపాటి కాస్మెటిక్ అప్‌గ్రేడ్స్ మాత్రమే చేసే అవకాశం ఉంది. కాబట్టి, ఓవరాల్ డిజైన్ సిల్హౌట్ లో మాత్రం ఎలాంటి మార్పు ఉండబోదని తెలుస్తోంది. అయితే, రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ బంపర్, రియర్ బంపర్ కొత్త మరియు అల్లాయ్ వీల్స్ వంటి మార్పులను ఇందులో ఆశించవచ్చు. రీడిజైన్ చేసిన కొత్త ఫ్రంట్ గ్రిల్ మరియు ఫ్రంట్ బంపర్‌తో ఇది ముందు వైపు నుండి రిఫ్రెష్డ్ లుక్ ని కలిగి ఉంటుంది. ఇక ఇంటీరియర్ డిజైన్ ఫీచర్లలో రిఫ్రెష్డ్ లుక్ కోసం కొత్త క్యాబిన్ కలర్ స్కీమ్ మరియు ప్రీమియం ఫీల్‌ని ఇచ్చే అప్‌హోలెస్ట్రీ వంటి వాటిని ఆశించవచ్చు.

కొత్త 2022 మారుతి సుజుకి ఎక్స్ఎల్6 (Maruti Suzuki XL6) ఎమ్‌పివిలో కొత్తగా ఏముంటుంది..?

2022 Maruti Suzuki XL6 : ఫీచర్లు

ప్రస్తుతం, మార్కెట్లో లభిస్తున్న మారుతి సుజుకి ఎక్స్ఎల్6 మోడల్ కంపెనీ ఆటోమేటి క్లైమేట్ కంట్రోల్, మూడు వరుసలలో ఏసి వెంట్లు, Apple CarPlay మరియు Android Auto కనెక్టివిటీతో కూడిన 8 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, రూఫ్ రెయిల్స్, వన్-టచ్ రిక్లైన్ మరియు మధ్య వరుసలో ప్రయాణీకుల కోసం కెప్టెన్ సీట్లు వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. అయితే, ప్రస్తుత ఆధునిక కార్లలో లభిస్తున్న నేటి ప్రమాణాల ప్రకారం ఇది ఫీచర్ల పరంగా కాస్తంత వెనుకబడి ఉందనే చెప్పాలి.

కొత్త 2022 మారుతి సుజుకి ఎక్స్ఎల్6 (Maruti Suzuki XL6) ఎమ్‌పివిలో కొత్తగా ఏముంటుంది..?

ఈ నేపథ్యంలో, కొత్తగా రాబోయే 2022 మోడల్ మారుతి సుజుకి ఎక్స్ఎల్6 ఎమ్‌పివిలో కంపెనీ కొన్ని మోడ్రన్ ఫీచర్లను అందించే అవకాశం ఉంది. మారుతి సుజుకి ఇటీవలే మార్కెట్లో విడుదల చేసిన తమ సరికొత్త 2022 బాలెనో కారులో ఆఫర్ చేసిన కొన్ని ఫీచర్లను ఈ కొత్త ఎక్స్ఎల్6 లో కూడా జోడించే అవకాశం ఉంది. ఇందులో పెద్ద 9 ఇంచ్ సుజుకి SmartPlay Pro+ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్, 360-డిగ్రీ సరౌండ్-వ్యూ కెమెరా వంటి మరికొన్ని అదనపు ఫీచర్లను ఇందులో ఆశించవచ్చు.

కొత్త 2022 మారుతి సుజుకి ఎక్స్ఎల్6 (Maruti Suzuki XL6) ఎమ్‌పివిలో కొత్తగా ఏముంటుంది..?

2022 Maruti Suzuki XL6 : సేఫ్టీ

సేఫ్టీ విషయానికి వస్తే, మారుతి సుజుకి తమ ప్రీమియం ఎమ్‌పివిని మరింత సురక్షితంగా మార్చేందుకు ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లను స్టాండర్డ్‌గా అందించవచ్చని సమాచారం. వీటితో పాటుగా ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ తో కూడిన యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఐఎస్ఓ ఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్స్ వంటి కొన్ని స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లను కూడా ఆఫర్ చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా, కంపెనీ ఇందులో లేన్-కీపింగ్ అసిస్ట్, బ్లైండ్-స్పాట్ అలర్ట్, పార్కింగ్ అసిస్టెన్స్ వంటి మరికొన్ని అధునాతన సేఫ్టీ ఫీచర్లను కూడా అందించవచ్చు.

కొత్త 2022 మారుతి సుజుకి ఎక్స్ఎల్6 (Maruti Suzuki XL6) ఎమ్‌పివిలో కొత్తగా ఏముంటుంది..?

2022 Maruti Suzuki XL6 : ఇంజన్ మరియు గేర్‌బాక్స్

కొత్త ఎక్స్ఎల్6 కేవలం ఫేస్‌లిఫ్ట్ మోడల్ కావడంతో కంపెనీ ఇందులో ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులను చేసే అవకాశం లేదు. కొత్త మారుతి సుజుకి ఎక్స్ఎల్6 యొక్క 2022 మోడల్ లో అదే మునుపటి 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 105 బిహెచ్‌పి శక్తిని మరియు 138 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో తేలికపాటి హైబ్రిడ్ టెక్నాలజీని కూడా ఉపయోగించారు. మారుతి సుజుకి ఎర్టిగా ఎమ్‌పివిలో కూడా ఇదే రకం ఇంజన్ ఉంటుంది.

కొత్త 2022 మారుతి సుజుకి ఎక్స్ఎల్6 (Maruti Suzuki XL6) ఎమ్‌పివిలో కొత్తగా ఏముంటుంది..?

అయితే, ఈ ఇంజన్ ను మరింత ఇంధన సమర్థవంతమైన వెర్షన్ గా మార్చేందుకు కంపెనీ దీనిని రీట్యూన్ చేయవచ్చని సమాచారం. గేర్‌బాక్స్ ఆప్షన్ లో కూడా మార్పులు ఉంటాయని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న 4-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ స్థానంలో మరింత ఆధునికమైన మరియు అధునాతనమైన 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అందుబాటులోకి వస్తుందని సమాచారం. ఇది మునుపటి కన్నా మరింత మెరుగైన మైలేజీని అందించడమే కాకుండా మరింత మెరుగైన మరియు సున్నితమైన డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది.

కొత్త 2022 మారుతి సుజుకి ఎక్స్ఎల్6 (Maruti Suzuki XL6) ఎమ్‌పివిలో కొత్తగా ఏముంటుంది..?

ఇప్పటి వరకూ విక్రయించబడిన మారుతి సుజుకి ఎక్స్ఎల్6 కారులోని 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ 5 స్పీడ్ మాన్యువల్ మరియు 4 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభించేది. ఇది మాన్యువల్ గేర్‌బాక్స్ వెర్షన్ లీటరుకు 19.01 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుండగా, ఆటోమేటిక్ వెర్షన్ లీటరుకు 17.99 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుందని సర్టిఫై చేయబడింది. అప్‌డేటెడ్ మోడల్ లోని పెద్ద ఇంజన్ పెరిగిన సామర్థ్యంతో పాటుగా, ప్రస్తుత మోడల్ కంటే కొంచెం ఎక్కువ శక్తిని మరియు టార్క్‌ను ఉత్పత్తి చేయగలదని భావిస్తున్నారు.

కొత్త 2022 మారుతి సుజుకి ఎక్స్ఎల్6 (Maruti Suzuki XL6) ఎమ్‌పివిలో కొత్తగా ఏముంటుంది..?

2022 Maruti Suzuki XL6 : ధర

కొత్త 2022 మోడల్ మారుతి సుజుకి ఎక్స్ఎల్6 కారులో చేయబోయే మార్పులు మరియు అప్‌గ్రేడ్స్ కారణంగా దాని ధర కూడా స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది. అయినప్పటికీ, కంపెనీ ఈ కారును ప్రీమియం ఎమ్‌పివి విభాగంలో అగ్రెసివ్ ధరతో ప్రవేశపెట్టవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం, మారుతి సుజుకి ఎక్స్ఎల్6 అవుట్‌గోయింగ్ వెర్షన్ ధర రూ. 10.14 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా) నుండి రూ. 12.02 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా) వరకు ఉంది. కొత్త మోడల్ ధరలో సుమారు రూ.10,000 మేర ధరల పెరుదలను ఆశించవచ్చు.

More from DriveSpark

Article Published On: Monday, April 4, 2022, 10:16 [IST]
English summary
What to expect in new 2022 maruti suzuki xl6 mpv facelift
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+