మారుతి Nexa బ్రాండ్ నుండి మొట్టమొదటి CNG కారు వస్తోంది.. అదేంటో తెలుసా..?

భారతదేశపు నెంబర్ వన్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా (Maruti Suzuki India) గడచిన నెలలో తమ సరికొత్త 2022 బాలెనో (2022 Baleno) ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ను మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసినదే. కాగా, తాజా సమాచారం ప్రకారం, కంపెనీ ఇప్పుడు ఇందులో ఓ కొత్త సిఎన్‌జి వేరియంట్‌ను కూడా విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. బాలెనో సిఎన్‌జి (Baleno CNG) మారుతి నెక్సా (Maruti Nexa) బ్రాండ్ నుండి వస్తున్న మొట్టమొదటి సిఎన్‌జి కారు కానుంది.

మారుతి Nexa బ్రాండ్ నుండి మొట్టమొదటి CNG కారు వస్తోంది.. అదేంటో తెలుసా..?

మారుతి అరెనా (Maruti Arena) బ్రాండ్ నుండి కంపెనీ ఇప్పటికే 7 సిఎన్‌జి కార్లను విక్రయిస్తోంది. వీటిలో ఆల్టో, ఎస్-ప్రెస్సో, వ్యాగన్ఆర్, సెలెరియో, ఎర్టిగా, ఈకో మోడళ్లు ఉన్నాయి. ఇవి కాకుండా వాణిజ్య ప్రయోజనం కోసం కంపెనీ విక్రయిస్తున్న సూపర్ క్యారీ లైట్ కమర్షియల్ వెహికల్ మరియు మారుతి సుజుకి టూర్-ఎస్ (టాక్సీ వెర్షన్ డిజైర్) లలో కూడా సిఎన్‌జి వెర్షన్లు అందుబాటులో ఉన్నాయి. మారుతి సుజుకి తన నెక్సా షోరూమ్‌ల ద్వారా ఇగ్నిస్, బాలెనో, సియాజ్ మరియు ఎక్స్ఎల్6 కార్లను విక్రయిస్తోంది.

మారుతి Nexa బ్రాండ్ నుండి మొట్టమొదటి CNG కారు వస్తోంది.. అదేంటో తెలుసా..?

నెక్సా షోరూమ్‌ల ద్వారా అమ్ముడయ్యే ఈ నాలుగు మోడళ్లు కూడా ప్రస్తుతం కేవలం పెట్రోల్ ఇంజన్ తో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ, ఇందులో ముందుగా బాలెనో సిఎన్‌జి మార్కెట్లోకి వస్తే, అదే మొట్టమొదటి నెక్సా బ్రాండ్ సిఎన్‌జి కారు అవుతుంది. మారుతి సుజుకి బాలెనో యొక్క CNG మోడల్ త్వరలో విక్రయానికి రానుంది. ఈ సిఎన్‌జి వెర్షన్ బాలెనో ప్రస్తుతం, మార్కెట్లో అమ్ముడవుతున్న 2022 బాలెనో కారులో ఉపయోగిస్తున్న అదే 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ ను కలిగి ఉంటుంది.

మారుతి Nexa బ్రాండ్ నుండి మొట్టమొదటి CNG కారు వస్తోంది.. అదేంటో తెలుసా..?

పూర్తి పెట్రోల్ వెర్షన్‌లోని ఈ 1.2 లీటర్ ఇంజన్ 6,000 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 90 బిహెచ్‌పి పవర్ ను మరియు 4,400 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 113 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5 స్పీడ్ మాన్యువల్ మరియు 5 స్పీడ్ ఏఎమ్‌టి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది. అయితే, సిఎన్‌జి వెర్షన్ బాలెనో విషయానికి వచ్చేసరికి, ఈ ఇంజన్ పవర్, టార్క్ గణాంలు భారీగా తగ్గే అవకాశం ఉంది. అంతేకాకుండా, బాలెనో సిఎన్‌జి కేవలం 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభ్యం కానుంది.

మారుతి Nexa బ్రాండ్ నుండి మొట్టమొదటి CNG కారు వస్తోంది.. అదేంటో తెలుసా..?

కొత్త బాలెనో సిఎన్‌జి మోడల్‌లో కేవలం యాంత్రికపరమైన మార్పులు మాత్రమే చేయబడుతాయని భావిస్తున్నారు. కాబట్టి, దాని ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్లలో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. అంటే, ఇది చూడటానికి కొత్తగా మార్కెట్లో వచ్చిన 2022 బాలెనో మాదిరిగానే ఉంటుంది. కాకపోతే, వెనుక భాగంలో ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సిఎన్‌జి కిట్‌ను అమర్చిన కారణంగా, కంపెనీ దాని సస్పెన్షన్ సెటప్ మరియు బ్రేకింగ్ సెటప్ ను కొద్దిగా ట్యూన్ చేసే అవకాశం ఉంది. ఎక్స్టీరియర్‌పై సిఎన్‌జి బ్యాడ్జింగ్ ఉంటుంది.

మారుతి Nexa బ్రాండ్ నుండి మొట్టమొదటి CNG కారు వస్తోంది.. అదేంటో తెలుసా..?

బాలెనో సిఎన్‌జిలో ఫీచర్ల విషయంలో కూడా ఎలాంటి మార్పులు ఉండబోవని తెలుస్తోంది. కొత్త 2022 మారుతి సుజుకి బాలెనో కారులో ఆటో హెడ్‌ల్యాంప్స్, ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, 16 ఇంచ్ అల్లాయ్ వీల్స్, క్రోమ్ డోర్ హ్యాండిల్స్, రియర్ ఏసి వెంట్స్, రియర్ ఫాస్ట్ ఛార్జింగ్ యూఎస్‌బి పోర్ట్, ఎత్తు సర్దుబాటు చేయగల డ్రైవర్ సీట్, పుష్-బటన్ స్టార్ట్/స్టాప్‌తో కూడిన కీలెస్ ఎంట్రీ, టెలిస్కోపిక్ స్టీరింగ్ వీల్, 2 ట్వీటర్లు, ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేయగల మరియు మడచగల సైడ్ మిర్రర్లు మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

మారుతి Nexa బ్రాండ్ నుండి మొట్టమొదటి CNG కారు వస్తోంది.. అదేంటో తెలుసా..?

అంతేకాకుండా, ఇందులో ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, వాయిస్ అసిస్టెంట్, సుజుకి కనెక్ట్ సిస్టమ్, ఓటిఏ అప్‌డేట్స్‌తో కూడిన 7 ఇంచ్ స్మార్ట్‌ప్లే ప్రో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు 4 స్పీకర్లతో కూడిన ఆడియో సిస్టమ్, వెనుక వైపు వాషర్ తో కూడిన వైపర్, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, పార్సెల్ షెల్ఫ్ మరియు ఏజిఎస్ వేరియంట్‌ల కోసం హిల్-స్టార్ట్ అసిస్ట్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇంకా ఇందులో ఎమ్‌ఐడి కలర్ డిస్‌ప్లే, రియర్ అడ్జస్టబుల్ హెడ్‌రెస్ట్ మరియు సెంటర్ స్లైడింగ్ ఆర్మ్‌రెస్ట్ వంటి ఫీచర్లు కూడా లభిస్తాయి.

మారుతి Nexa బ్రాండ్ నుండి మొట్టమొదటి CNG కారు వస్తోంది.. అదేంటో తెలుసా..?

సేఫ్టీ విషయానికి వస్తే, కొత్త 2022 మారుతి సుజుకి బాలెనో కారులో రివర్స్ కెమెరా, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ మరియు హెడ్స్-అప్ డిస్‌ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇక చివిరగా మైలేజ్ విషయానికి వస్తే, ఇందులోని 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ వేరియంట్ లీటరుకు 22.35 కిలోమీటర్ల మైలేజీని మైలేజీని మరియు 5-స్పీడ్ ఏఎమ్‌టి గేర్‌బాక్స్ వేరియంట్ లీటరుకు 22.94 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుందని సర్టిఫై చేయబడింది. కాగా, సిఎన్‌జి కిట్‌తో రాబోయే బాలెనో కేజీకి 30 కిలోమీటర్లకు పైగా మైలేజీని ఇవ్వవచ్చని అంచనా.

మారుతి Nexa బ్రాండ్ నుండి మొట్టమొదటి CNG కారు వస్తోంది.. అదేంటో తెలుసా..?

కొత్త అప్‌డేటెడ్ 2022 మోడల్ మారుతి బాలెనో సిగ్మా, డెల్టా, జెటా మరియు ఆల్ఫా అనే నాలుగు ట్రిమ్‌లలో విభిన్న వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. మార్కెట్లో ఈ కొత్త మోడల్ ధరలు రూ. 6.35 లక్షల నుండి ప్రారంభం అవుతాయి. ఇందులో టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ. 9.49 లక్షల (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్) వరకూ ఉంటుంది. సరికొత్త లుక్ అండ్ ఫీల్ మరియు అప్‌గ్రేడెడ్ ఫీచర్లతో కంపెనీ ఈ కారును మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కొత్త మోడల్‌తో పాటుగా ఇందులో సిఎన్‌జి ఆప్షన్ ను కూడా పరిచయం చేయడం ద్వారా కంపెనీ బాలెనోలో కోల్పోయిన మార్కెట్ వాటాను తిరిగి పొందాలని చూస్తోంది.

Article Published On: Thursday, March 17, 2022, 16:30 [IST]
English summary
What we know about baleno cng the first ever cng car from maruti suzuki nexa brand
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+