కొత్త 2022 Maruti Suzuki Baleno లో ఏ వేరియంట్ కొంటే బెస్ట్? ఎందుకు?

మారుతి సుజుకి ఇండియా (Maruti Suzuki India) తమ నెక్సా (Nexa) డీలర్‌షిప్ కేంద్రాల ద్వారా విక్రయిస్తున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ బాలెనో (Baleno) లో కంపెనీ ఓ కొత్త అప్‌డేటెడ్ 2022 మోడల్ ను మార్కెట్లో ప్రవేశపెట్టిన సంగతి తెలిసినదే. కొత్త 202 బాలెనో ట్రిమ్ లలో పరిచయం చేయబడింది. వీటిలో సిగ్మా, డెల్టా, జెటా మరియు ఆల్ఫా ట్రిమ్‌లు ఉన్నాయి. మరి ఈ నాలుగింటిలో ఏ వేరియంట్ కొంటే బెస్ట్ అనేది ఈ కథనంలో చూద్దాం రండి.

కొత్త 2022 Maruti Suzuki Baleno లో ఏ వేరియంట్ కొంటే బెస్ట్? ఎందుకు?

మారుతి సుజుకి తమ కొత్త 2022 మోడల్ బాలెనో కారును కేవలం రూ. 6.35 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరకే విడుదల చేసింది. ఇందులో టాప్-స్పెక్ వేరియంట్ ధర రూ. 9.49 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంటుంది. సరికొత్త లుక్ అండ్ ఫీల్ మరియు అప్‌గ్రేడెడ్ ఫీచర్లతో కంపెనీ ఈ కారును మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కొత్త మోడల్ ద్వారా బాలెనోలో కోల్పోయిన మార్కెట్ వాటాను తిరిగి పొందాలని కంపెనీ యోచిస్తోంది.

కొత్త 2022 Maruti Suzuki Baleno లో ఏ వేరియంట్ కొంటే బెస్ట్? ఎందుకు?

కొత్త 2022 మోడల్ బాలెనో ఒక పెట్రోల్ ఇంజన్ మరియు రెండు గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది. బాలెనో ధర పరంగా బాగానే ఉన్నప్పటికీ, ఈ నాలుగు వేరియంట్‌లలో ఏది ఎక్కువ డబ్బుకి తగిన విలువను కలిగి ఉంటుందనేది ఈ కథనంలో తెలుసుకుందాం రండి. డిజైన్ మరియు లుక్స్ పరంగా, అన్ని వేరియంట్లు కూడా ఒకేలా ఉంటాయి. అయితే, వాటిలో లభించే ఫీచర్లే మారుతూ ఉంటాయి.

కొత్త 2022 Maruti Suzuki Baleno లో ఏ వేరియంట్ కొంటే బెస్ట్? ఎందుకు?

ప్రతి వేరియంట్‌లో కొన్ని అదనపు ఫీచర్లను కంపెనీ ఆఫర్ చేస్తుంది. మరి ఇందులో మీకు ఏ వేరియంట్ అనుకూలంగా ఉంటుంది? ఈ ప్రశ్నకు మేము ఇచ్చే సమాధానం మారుతి సుజుకి బాలెనో జెటా ట్రిమ్. ఇది వరకు చెప్పుకున్నట్లుగా కొత్త 2022 మారుతి సుజుకి బాలెనో మొత్తం నాలుగు ట్రిమ్‌లలో అందుబాటులో ఉంటుంది, ఇందులో జెటా ట్రిమ్ అనేది టాప్-ఎండ్ వేరియంట్ కు దిగువన ఉంటుంది.

కొత్త 2022 Maruti Suzuki Baleno లో ఏ వేరియంట్ కొంటే బెస్ట్? ఎందుకు?

బాలెనో జెటా ట్రిమ్ లో కస్టమర్లకు కావల్సిన అన్ని ఫీచర్లు లభిస్తాయి. కంపెనీ కొత్త 2022 మారుతి బాలెనో యొక్క జెటా ట్రిమ్‌ను రెండు వేరియంట్‌లలో పరిచయం చేసింది, ఇందులో ఒకటి మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్ తో లభిస్తుంది మరియు రెండవది AGS (ఆటో గేర్ షిఫ్ట్) ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ తో లభిస్తుంది. బాలెనో జెటా మాన్యువల్ వేరియంట్ ధర రూ. 8.09 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంటే, AGS ఆటోమేటిక్ వేరియంట్ ధర రూ. 8.59 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంటుంది.

కొత్త 2022 Maruti Suzuki Baleno లో ఏ వేరియంట్ కొంటే బెస్ట్? ఎందుకు?

2022 బాలెనె జెటా వేరియంట్‌లలో లభించే ఫీచర్లు ఏవి?:

కొత్త 2022 మారుతి సుజుకి బాలెనో యొక్క Zeta వేరియంట్‌లో అందుబాటులో ఉన్న ఫీచర్ల విషయానికి వస్తే, కంపెనీ ఇందులో ఆటో హెడ్‌ల్యాంప్స్, ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, 16 ఇంచ్ అల్లాయ్ వీల్స్, క్రోమ్ డోర్ హ్యాండిల్స్, రియర్ ఏసి వెంట్స్, రియర్ ఫాస్ట్ ఛార్జింగ్ యూఎస్‌బి పోర్ట్, ఎత్తు సర్దుబాటు చేయగల డ్రైవర్ సీట్, పుష్-బటన్ స్టార్ట్/స్టాప్‌తో కూడిన కీలెస్ ఎంట్రీ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.

కొత్త 2022 Maruti Suzuki Baleno లో ఏ వేరియంట్ కొంటే బెస్ట్? ఎందుకు?

అంతేకాకుండా, ఈ కారులో టెలిస్కోపిక్ స్టీరింగ్ వీల్, వాయిస్ అసిస్టెంట్, సుజుకి కనెక్ట్ సిస్టమ్, ఓటిఏ అప్‌డేట్, 2 ట్వీటర్లు, ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేయగల మరియు మడచగల సైడ్ మిర్రర్లు, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లేతో కూడిన 7 ఇంచ్ స్మార్ట్‌ప్లే ప్రో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు 4 స్పీకర్లతో కూడిన ఆడియో సిస్టమ్, వెనుక వైపు వాషర్ తో కూడిన వైపర్ వంటి ఫీచర్లు కూడా ఈ వేరియంట్‌లో లభిస్తాయి.

కొత్త 2022 Maruti Suzuki Baleno లో ఏ వేరియంట్ కొంటే బెస్ట్? ఎందుకు?

కొత్త 2022 మారుతి బాలెనో యొక్క జెటా వేరియంట్‌లు ESP (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్) ఫీచర్ ను కలిగి ఉంటుంది, ఇది రోడ్డుపై మంచి కంట్రోల్ ను అందిస్తుంది. ఇంకా ఇందులో స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, పార్సెల్ షెల్ఫ్ మరియు ఏజిఎస్ వేరియంట్‌ల కోసం హిల్-స్టార్ట్ అసిస్ట్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. అంతేకాకుండా, ఎమ్‌ఐడి కలర్ డిస్‌ప్లే, రియర్ అడ్జస్టబుల్ హెడ్‌రెస్ట్ మరియు సెంటర్ స్లైడింగ్ ఆర్మ్‌రెస్ట్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

కొత్త 2022 Maruti Suzuki Baleno లో ఏ వేరియంట్ కొంటే బెస్ట్? ఎందుకు?

అధిక లగేజ్ రూమ్ కోసం వెనుక వైపు 60:40 నిష్పత్తిలో మడచగలిగే రియర్ సీట్, ఫ్రంట్ ఫుట్‌వెల్ ల్యాంప్స్ వంటి కంఫర్ట్ ఫీచర్లతో పాటుగా రివర్స్ కెమెరా మరియు 6 ఎయిర్‌బ్యాగ్‌ల వంటి సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి. దీన్నిబట్టి చూస్తుంటే, బాలెనో జెటా వేరియంట్‌లో మీ రోజువారీ అవసరాలకు అవసరమైన అనేక ఫీచర్లు ఉన్నాయని తెలుస్తోంది. టాప్-ఎండ్ ఆల్ఫా వేరియంట్‌కి మరియు జెటా వేరియంట్‌కి మధ్య తేడా ఏంటంటే, ఆల్ఫా వేరియంట్ లో 360-డిగ్రీ కెమెరా మరియు హెడ్స్-అప్ డిస్‌ప్లే ఫీచర్ లభిస్తుంది.

కొత్త 2022 Maruti Suzuki Baleno లో ఏ వేరియంట్ కొంటే బెస్ట్? ఎందుకు?

వాస్తవానికి, ఈ రెండు ఫీచర్లు మంచివే అయినప్పటికీ, వీటి అవసరంగా ఉండదని చెప్పొచ్చు. ఒకవేళ, మీ బడ్జెట్ అనుమతిస్తే, మీరు తప్పకుండా ఆల్ఫా వేరియంట్‌ ని కొనుగోలు చేయవచ్చు. బాలెనో కారులోని అన్ని వేరియంట్లు కూడా K12N అని పిలువబడే అదే మునుపటి 1.2-లీటర్ న్యాచురల్ పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉంటాయి. ఈ ఇంజన్ 89 బిహెచ్‌పి పవర్ ను మరియు 113 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ మరియు AMT గేర్‌బాక్స్‌తో జత చేయబడింది. ఇది మ్యాన్యువల్ గేర్‌బాక్స్ తో 22.35 kmpl మైలేజీని మరియు AMTలో 22.94 kmpl మైలేజీని అందిస్తుంది.

Article Published On: Friday, February 25, 2022, 16:31 [IST]
English summary
Which is the best variant to buy in new 2022 maruti suzuki baleno details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+