మార్కెట్లోకి అనేక ఆటోమేటిక్ కార్లు ఉన్నప్పటికీ, చాలా మంది మాన్యువల్ కార్లనే ఎందుకు ఇష్టపడుతున్నారు?

అమెరికా వంటి అగ్ర దేశాలలో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కలిగిన కార్లదే పైచేయి. అక్కడ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ కలిగిన కార్లు చాలా అరుదుగా కనిపిస్తాయి. అంతేకాదు, అలాంటి మ్యాన్యువల్ గేర్‌బాక్స్ కలిగిన కార్లను నడిపే వ్యక్తులను కూడా అక్కడి వారు చాలా విచిత్రంగా చూస్తారు. అయితే, మనదేశంలో పరిస్థితి ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఇటీవలి కాలంలో భారతదేశంలో అనేక ఆటోమేటిక్ కార్లు వచ్చినప్పటికీ, ప్రజలు మాత్రం మ్యాన్యువల్ కార్లనే కొనేందుకు ఆసక్తి చూపుతుంటారు. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. అవేంటో, ఈ కథనంలో చూద్దాం రండి.

మార్కెట్లోకి అనేక ఆటోమేటిక్ కార్లు ఉన్నప్పటికీ, చాలా మంది మాన్యువల్ కార్లనే ఎందుకు ఇష్టపడుతున్నారు?

1. డ్రైవింగ్ పై పూర్తి నియంత్రణ

మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ను ఉపయోగించడం వెనుక అనేక కారణాలు ఉన్నాయి, వాటిలో మొదటిది మరియు ప్రధానమైనది డ్రైవింగ్ పై పూర్తి నియంత్రణ. మీరు డ్రైవింగ్‌పై పూర్తి నియంత్రణను కలిగి ఉండాలంటే మాన్యువల్ కారు సరైన ఎంపిక. ఇది అన్ని అనుబంధిత అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత గేర్‌లను ఎప్పుడు మార్చాలో మీరే నిర్ణయించుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. ఆటోమేటిక్ గేర్‌బాక్స్ విషయంలో మీరు నడిపే వేగాన్ని మరియు డ్రైవింగ్ పరిస్థితులను బట్టి గేర్లు వాటంతట అవే మారుతూ ఉంటాయి.

మార్కెట్లోకి అనేక ఆటోమేటిక్ కార్లు ఉన్నప్పటికీ, చాలా మంది మాన్యువల్ కార్లనే ఎందుకు ఇష్టపడుతున్నారు?

2. తక్కువ మెయింటినెన్స్ ఖర్చు

సాధారణంగా, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో కూడిన కార్లకు తరచుగా ఆయిల్ మరియు ఫిల్టర్ లను మారుస్తూ ఉండాలి. ఆటోమేటిక్ కార్ల సాధారణ ఉపయోగం సమయంలో, అధిక ద్రవ ఆపరేటింగ్ ఉష్ణోగ్రతలు కూడా ఆయిల్ త్వరగా ఆవిరవడానికి కారణమవుతాయి. అయితే, మాన్యువల్ కార్ల విషయంలో అలా జరగదు కాబట్టి, వాటిలో తరచూ లూబ్రికెంట్స్ మార్పిడి అవసరం ఉండదు. ఫలితంగా, మ్యాన్యువల్ కార్ల యొక్క మెయింటినెన్స్ ఖర్చు కూడా తగ్గుతుంది.

మార్కెట్లోకి అనేక ఆటోమేటిక్ కార్లు ఉన్నప్పటికీ, చాలా మంది మాన్యువల్ కార్లనే ఎందుకు ఇష్టపడుతున్నారు?

3. చక్రాలకు మరింత శక్తి

ఆటోమేటిక్ కార్ల విషయానికొస్తే, వాటిలోని ఇంజన్ ఆయిల్ పంప్‌ను నడపడం మరియు టార్క్ కోల్పోవడం వల్ల ఇంజన్ కొంత శక్తిని కోల్పోతుంది. ఫలితంగా, ఇంజన్ నుండి చక్రాలకు పంపిణీ కావల్సిన శక్తి కూడా తగ్గుతుంది. అయితే, మ్యాన్యువల్ కార్లలో దీనికి విరుద్ధంగా జరుగుతుంది. మాన్యువల్ ట్రాన్స్మిషన్ మధ్యలో శక్తిని కోల్పోకుండా, ఇంజన్ నుండి ఉత్పత్తయ్యే మొత్తం శక్తిని చక్రాలకు పంపుతుంది.

మార్కెట్లోకి అనేక ఆటోమేటిక్ కార్లు ఉన్నప్పటికీ, చాలా మంది మాన్యువల్ కార్లనే ఎందుకు ఇష్టపడుతున్నారు?

4. మ్యాన్యువల్ కారు నడపడం ఓ ఆర్ట్

ప్రస్తుతం, భారత మార్కెట్లో లభిస్తున్న దాదాపు అన్ని కార్లలో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అనేది ఓ ఆప్షనల్ డ్రైవ్‌ట్రైన్ గా అందుబాటులో ఉంటోంది. నిజానికి, మ్యాన్యువల్ కార్లతో పోలిస్తే, ఆటోమేటిక్ కార్లను నడపడం చాలా సులభం, ఎవరైనా ఆటోమేటిక్ కారును సులభంగా నడపవచ్చు. ఈ కార్లలో ఎడమ కాలితో అస్సలు పని ఉండదు, కుడి కాలితో బ్రేక్ మరియు యాక్సిలరేటర్ పెడల్స్ ను మాత్రమే నొక్కాల్సి ఉంటుంది. అయితే, మ్యాన్యువల్ కార్లను డ్రైవ్ చేయడం అనేది కాస్తంత క్లిష్టమైన విషయం మరియు ఇదొక ఆర్ట్ అని కూడా చెప్పొచ్చు. మాన్యువల్ కార్లను నడిపే వ్యక్తులు ఉద్దేశపూర్వకంగానే వాటిని కొనుగోలు చేస్తారు. ఇదొక బెస్ట్ ఫన్ టూ డ్రైవ్ గేర్‌బాక్స్ అనొచ్చు.

మార్కెట్లోకి అనేక ఆటోమేటిక్ కార్లు ఉన్నప్పటికీ, చాలా మంది మాన్యువల్ కార్లనే ఎందుకు ఇష్టపడుతున్నారు?

5. మెరుగైన మైలేజ్

మీరు మైలేజ్ ఫిగర్స్ ని గమనించినట్లయితే, మ్యాన్యువల్ కార్లతో పోల్చినప్పుడు ఆటోమేటిక్ ఎల్లప్పుడూ తక్కువ మైలేజీనిస్తాయి. ఇందుకు చాలానే కారణాలు ఉన్నాయి. ఆటోమేటిక్ కార్లలో అనేక గేర్లు ఉంటాయి, ఇవి ఆటోమేటిక్ గా పనిచేయడం కోసం ఇంజన్ కొంత శక్తిని దీనికి కేటాయిస్తుంది. ఫలితంగా, కొంత ఇంధనం దీని కోసం ఉపయోగించబడుతుంది. మ్యాన్యువల్ కార్ల విషయంలో ఇలా ఉండదు. మ్యాన్యువల్ గేర్‌బాక్స్ పనిచేయడానికి నేరుగా ఇంజన్ శక్తి అవసరం ఉండదు. కాబట్టి, మ్యాన్యువల్ కార్లు ఎల్లప్పుడూ అధిక మైలేజీని అందిస్తాయి.

మార్కెట్లోకి అనేక ఆటోమేటిక్ కార్లు ఉన్నప్పటికీ, చాలా మంది మాన్యువల్ కార్లనే ఎందుకు ఇష్టపడుతున్నారు?

6. మరింత వేగవంతమైనవి

ఆటోమేటిక్ కార్లతో పోలిస్తే మ్యాన్యువల్ కార్లు కాస్తంత వేగవంతమైనవనే చెప్పొచ్చు. మాన్యువల్ కారును నడుపుతున్నప్పుడు, ఇంజన్ ఆర్‌పిఎమ్ మరియు టైర్ వేగం ఆధారంగా ఖచ్చితమైన సమయంలో వేగవంతం చేయడం సాధ్యపడుతుంది. ఇది యాక్సిలరేషన్ కోసం సరైన గేర్ మరియు టార్క్ కన్వర్టర్ స్లిప్‌ను గుర్తించడానికి ఆటోమేటిక్ వాహనం కోసం వేచి ఉండే వ్యవధిని నివారించడంలో సహాయపడుతుంది. కాబట్టి, మ్యాన్యువల్ కార్లు ఇంజన్ పనితీరు ఆధారంగా వేగంగా ప్రతిస్పందిస్తాయి.

మార్కెట్లోకి అనేక ఆటోమేటిక్ కార్లు ఉన్నప్పటికీ, చాలా మంది మాన్యువల్ కార్లనే ఎందుకు ఇష్టపడుతున్నారు?

7. కారుతో వ్యక్తిగత సంబంధం

మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ అనేది చాలా మందికి ఓ సెంటిమెంట్. మనదేశంలో ఆటోమేటిక్ కార్లు చాలా ఖరీదైనవిగా ఉన్న కాలంలో, ప్రతి ఒక్కరూ తమ మొదటి ప్రయాణాన్ని మ్యాన్యువల్ కారుతోనే ప్రారంభించి ఉంటారు. కాబట్టి, మీరు కారుతో ఈ బంధాన్ని తిరస్కరించలేరు. గేర్‌లను మాన్యువల్‌గా మార్చడం అంటే మీ కారు ఇంజన్ పరిస్థితిని మీరు అర్థం చేసుకొని, దానికి అనుగుణంగా తగిన గేర్ ను ఎంచుకోవడమే. కానీ ఆటోమేటిక్ కారు విషయంలో అలా కాదు, ఇక్కడ ఇంజన్ పరిస్థిని మీ కారే ఆర్థం చేసుకొని, మీ ప్రమేయం లేకుండానే తగిన గేరును ఎంచుకుంటుంది.

మార్కెట్లోకి అనేక ఆటోమేటిక్ కార్లు ఉన్నప్పటికీ, చాలా మంది మాన్యువల్ కార్లనే ఎందుకు ఇష్టపడుతున్నారు?

8. సరసమైన ధర

భారతదేశంలో కారు కొనుగోలు చేసేటప్పుడు, చాలా మంది ప్రజలు ధరకు అధిక ప్రాముఖ్యత ఇస్తారు. మీరు మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ కార్ల ధరను పరిశీలిస్తే, ఇవి ఆటోమేటిక్ కార్ల కంటే చాలా పొదుపుగా ఉంటాయి. ప్రస్తుతం, మార్కెట్లో లభిస్తున్న ఏదైనా బడ్జెట్ కారు యొక్క మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్ల ధరలను పరిశీలిస్తే, వాటి మధ్య సుమారు లక్ష రూపాయల వ్యత్యాసం ఉంటుంది. ప్రైస్ సెన్సిటివ్ మార్కెట్ అయిన మనదేశంలో ఈ వ్యత్యాసం చాలా పెద్దదే అని చెప్పాలి. ఇంతకీ మీకు మ్యాన్యువల్ కారు ఇష్టమా లేక ఆటోమేటిక్ కారు ఇష్టమా?

More from DriveSpark

Article Published On: Tuesday, July 12, 2022, 15:23 [IST]
English summary
Why manual transmission cars are so popular in india top 8 reasons
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+