ప్రపంచంలో టాప్ 10 బెస్ట్ కార్ తయారీ సంస్థలు, ఇవే.. మీకు తెలుసా..?
సాధారణంగా ఏ రంగంలో అయినా పోటీ అనేది సర్వ సాధారణంగా ఉంటుంది. అయితే ఆటోమొబైల్ రంగంలో ఇది మరి కాస్త ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఉత్పత్తి మరియు ఆదాయం పొందటంలో ఎవరికీ వారు పోటీగానే ఉంటారు. ఆటోమొబైల్ రంగంలో ప్రధాన తయారీదారులుగా యూరోపియన్, అమెరికన్, జపనీస్, కొరియన్ మరియు చైనీస్ దేశాలు అగ్ర స్థానంలో ఉన్నాయి.
ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ లో ప్రపంచ ఆటోమొబైల్ పరిశ్రమలో అగ్ర స్థానంలో ఉన్న టాప్ 10 కంపెనీలను గురించి మరింత సమాచారం తెలుసుకుందాం.

పిఎస్ఏ గ్రూప్ (PSA Group):
పిఎస్ఏ గ్రూప్ అనేది ఫ్రెంచ్ దేశానికి చెందిన బహుళజాతి కార్ల తయారీ సంస్థ. ఈ సంస్థ యొక్క చట్టపరమైన పేరు ప్యుగోట్ ఎస్ఏ. దీని ఉత్పత్తి విషయానికి వస్తే, ఇది 3.5 మిలియన్ల వరకు ఉంటుందని సమాచారం. అదే విధంగా ఈ కంపెనీ యొక్క ఆదాయం విషయానికి వస్తే, పిఎస్ఏ గ్రూప్ ఆదాయం 74.731 బిలియన్ యూరోలు అని తెలిసింది.

రెనాల్ట్ (Renault):
అత్యంత ప్రసిద్ధి చెందిన కార్ తయారీ సంస్థ రెనాల్ట్ (Renault) కంపెనీ కూడా ఫ్రెంచ్ దేశానికి చెందినదే. రెనాల్ట్ (Renault) కంపెనీ యూరోపియన్ మార్కెట్‌పై ఎక్కువ దృష్టి కేంద్రీకరించింది. ఈ కారణంగానే కంపెనీ ఎక్కువ సంఖ్యలో చిన్నవాహనాలను యూరోపియన్ మార్కెట్‌లో విడుదల చేస్తోంది.
రెనాల్ట్ (Renault) కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, కంపెనీ యొక్క నికర ఆదాయం అక్షరాలా 3.75 బిలియన్ యూరోలు అని స్పష్టంగా తెలిసింది.

ఫియట్-క్రిస్లర్ ఆటోమొబైల్స్ (Fiat-Chrysler Automobiles):
క్రిస్లర్ ఆటోమొబైల్స్ 2009 లో దివాళా తీసిన తరువాత, ఇటలీకి చెందిన చిన్న కార్ల తయారీ సంస్థ ఫియట్ కంపెనీ దీనిని స్వాధీనం చేసుకుంది. ఈ విధంగా స్వాధీనం చేసుకున్న తరువాత 2020 జనవరిలో కంపెనీ తన కొత్త పేరు స్టెలాంటిస్‌ని ప్రకటించింది. అయిథేబె ఇప్పుడు ఫియట్-క్రిస్లర్ ఆటోమొబైల్స్ ఉత్పత్తి పరిమాణం 4.6 మిలియన్ల వరకు ఉంది.

హోండా (Honda):
జపాన్ కి చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ హోండా కార్స్ ప్రపంచ దేశాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన సంస్థగా అవతరించింది. ఈ కంపెనీ 1959 నుండి ప్రపంచంలోనే అతిపెద్ద ఆటోమొబైల్ తయారీదారుగా కీర్తి గడిస్తూనే ఉంది. ఇప్పటివరకు హోండా కంపెనీ 400 మిలియన్ మోటార్ సైకిళ్లను మరియు 5.2 మిలియన్ కార్లను ఉత్పత్తి చేసింది. హోండా కార్స్ యొక్క ఆదాయం 15.36 ట్రిలియన్ యూరోల వరకు ఉంటుంది.

నిస్సాన్ (Nissan):
నిస్సాన్ కంపెనీ కూడా జపాన్ ఆధారిత కంపెనీ. ఇది రెనాల్ట్-నిస్సాన్-మిత్సుబిషి అలయన్స్‌లో ఇది ఒక భాగంగా ఉంటుంది. నిస్సాన్ కంపెనీ యొక్క ఉత్పత్తి 5.7 మిలియన్లు. అదే సమయంలో నిస్సాన్ కంపెనీ యొక్క నికర ఆదాయం మొత్తం 9.878 ట్రిలియన్ యూరోలు.

ఫోర్డ్ మోటార్స్ (Ford Motors):
అగ్ర రాజ్యమైన అమెరికన్ కార్ల తయారీ సంస్థ ఫోర్డ్ మోటార్స్ (Ford Motors) ప్రపంచంలో అత్యంత అదరణపొందుతున్న కంపెనీలలో ఒకటి. 2009 లో ప్రపంచ ఆర్థిక సంక్షోభం సమయంలో ప్రభుత్వం బెయిల్ అవుట్ చేయని కొన్ని కంపెనీలలో ఇది ఒకటిగా ఉంది. ఫోర్డ్ మోటార్స్ (Ford Motors) యొక్క ఉత్పత్తి 6.3 మిలియన్లు కాగా, నికర ఆదాయం 12 బిలియన్ డాలర్లు.

జనరల్ మోటార్స్ (General Motors):
జనరల్ మోటార్స్ కంపెనీ కూడా అమెరికాకు చెందిన ఆటోమొబైల్ కంపెనీ. జనరల్ మోటార్స్ యునైటెడ్ స్టేట్స్‌లో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ. దీని మార్కెట్ మొత్తం ఉత్తర అమెరికాలో కేంద్రీకృతమై ఉంది. జనరల్ మోటార్స్ అనేక పికప్ ట్రక్కులు మరియు SUVలను ఉత్పత్తి చేయడానికి ఇదే కారణం. జనరల్ మోటార్స్ యొక్క ఉత్పత్తి 6.8 మిలియన్లు.

హ్యుందాయ్ మోటార్/ కియా (Hyundai Motor/ Kia):
ప్రముఖ వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ దక్షిణ కొరియాకి చెందిన సంస్థ. దీని ఆదాయం సుమారుగా 224.1 బిలియన్ డాలర్లు. హ్యుందాయ్ మరియు కియా కలిసి ప్రపంచంలోని అత్యంత విలువైన కార్ల తయారీదారులలో ఆరు మరియు ఏడవ స్థానంలో ఉన్నాయి. హ్యుందాయ్ మోటార్ / కియా యొక్క ఉత్పత్తి 7.2 మిలియన్లు.

ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్ (Volkswagen Group):
జర్మనీకి చెందిన మరొక వాహన తయారీదారు ఫోక్స్‌వ్యాగన్. ఫోక్స్‌వ్యాగన్ కంపెనీ యొక్క ఆదాయం 2,45,600 డాలర్లు. ఇది మూడవ అత్యంత విలువైన కార్‌మేకర్‌గా నిలిచింది. ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్ యొక్క ఉత్పత్తి 10.3 మిలియన్లు. ఈ కంపెనీ ఇప్పుడు భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన కంపెనీ కూడా.

టయోటా (Toyota):
జపనీస్ కార్ల తయారీ సంస్థ టయోటా (Toyota) కూడా మంచి అమంకల్తో అత్యంత ప్రజాదరణ పొందుతున్న ప్రధాన కంపెనీలలో ఒకటి. ఈ కంపెనీ భారతీయ మార్కెట్లో తన ఉనికిని విస్తరిస్తూనే ఉంది. సాధారణంగా టయోటా కంపెనీ నమ్మదగిన మరియు అధిక నాణ్యత గల కార్ల తయారీకి ప్రసిద్ధి చెందింది. ఇది టెస్లా తర్వాత రెండవ అత్యంత విలువైన కార్ కంపెనీ. టయోటా కిర్లోస్కర్ ఉత్పత్తి 10.4 మిలియన్లు.


Click it and Unblock the Notifications








