ప్రస్తుతం బెస్ట్ మైలేజీనిచ్చే టాప్ 5 కార్లు ఇవే..! వీటిలో మీ ఫేవరేట్ కారు ఏది..?

ఇటీవలి కాలంలో భారతదేశంలో ఇంధన ధరలు భారీగా పెరిగాయి. అంతర్జాతీయంగా పెరిగిన ముడి చమురు ధరలు కావచ్చు లేదా వివిధ రాష్ట్రాలు ఇంధనంపై విధిస్తున్న పన్నులు కావచ్చు కారణం ఏదేమైనప్పటికీ, పెట్రోల్ మరియు డీజిల్ ఇంధనాలు ఇప్పుడు సామాన్యుడు కొనలేని స్థితికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో వాహనాలను (ప్రత్యేకించి కార్లను) బయటకు తీయాలంటేనే ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి. పెరిగిన ఇంధన ధరలతో మైలేజ్ ఇప్పుడు ప్రధాన సమస్యగా మారింది. మరి ఈ కథనంలో టాప్ 5 బెస్ట్ మైలేజీనిచ్చే కార్లు ఏంటో చూద్దాం రండి.

ప్రస్తుతం బెస్ట్ మైలేజీనిచ్చే టాప్ 5 కార్లు ఇవే..! వీటిలో మీ ఫేవరేట్ కారు ఏది..?

1. హోండా సిటీ ఇ:హెచ్ఈవీ (27 కెఎంపిఎల్) - హైబ్రిడ్ వేరియంట్

జపనీస్ కార్ బ్రాండ్ హోండా ఇటీవలే తమ సిటీ సెడాన్ లో ఓ హైబ్రిడ్ వేరియంట్ ను మార్కెట్లో విడుదల చేసింది. హోండా సిటీ ఇ:హెచ్ఈవీ పేరుతో వచ్చిన హైబ్రిడ్ కారు, పెట్రోల్ మరియు బ్యాటరీ పవర్ ను కలిగి ఉంటుంది. ఇది ఈ విభాగంలోనే మొదటి హైబ్రిడ్ సెడాన్. ఈ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌ కారణంగా ఇది లీటరుకు 27 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. హోండా సిటీ ఇ:హెచ్ఈవి కారులో 1.5-లీటర్ నేచురల్-ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ మాత్రమే 98 bhp శక్తని ఉత్పత్తి చేస్తుంది. కాగా, ఇందులో అమర్చిన రెండు ఎలక్ట్రిక్ మోటార్ల ద్వారా ఈ శక్తి గరిష్టంగా 126 bhp లకు చేరుకుంటుంది మరియు ఇది 253Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.

ప్రస్తుతం బెస్ట్ మైలేజీనిచ్చే టాప్ 5 కార్లు ఇవే..! వీటిలో మీ ఫేవరేట్ కారు ఏది..?

హోండా సిటీ ఇ:హెచ్ఈవి కారులో లభించే ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన పెద్ద 8 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, సరౌండ్ సౌండ్ స్పీకర్ సిస్టమ్, పూర్తి ఎల్ఈడి హెడ్‌ల్యాంప్‌లు, క్లైమేట్ కంట్రోల్, 7 ఇంచ్ ఫుల్ కలర్ టిఎఫ్‌టి ఇన్స్ట్రుమెంట్ డిస్‌ప్లే, వాక్ అవే ఆటో లాక్ మరియు లేటెస్ట్ కార్ కనెక్టింగ్ టెక్నాలజీ వంటి ఫీచర్లు మరెన్నో ఉన్నాయి.

ప్రస్తుతం బెస్ట్ మైలేజీనిచ్చే టాప్ 5 కార్లు ఇవే..! వీటిలో మీ ఫేవరేట్ కారు ఏది..?

సేఫ్టీ ఫీచర్ల విషయానికి వస్తే, హోండా సిటీ ఇ:హెచ్ఈవి కారులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఈబిడితో కూడిన ఏబిఎస్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఆటో బ్రేక్ హోల్డ్, లేన్ వాచ్ కెమెరా, ఆటో హై బీమ్ అసిస్ట్, ఎమర్జెన్సీ బ్రేకింగ్, రోడ్ డిపార్చర్ మిటిగేషన్ (RDM), ఎజైల్ హ్యాండ్లింగ్ అసిస్ట్, టైర్ ప్రెజర్ మోనిటరింగ్ సిస్టమ్ (TPMS), అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్-కీపింగ్ అసిస్ట్ మరియు మల్టీ-యాంగిల్ రియర్‌వ్యూ కెమెరా మొదలైనవి ఉన్నాయి.

ప్రస్తుతం బెస్ట్ మైలేజీనిచ్చే టాప్ 5 కార్లు ఇవే..! వీటిలో మీ ఫేవరేట్ కారు ఏది..?

2. హ్యుందాయ్ ఆరా (25.40 కెఎంపిఎల్) - డీజిల్ వేరియంట్

కొరియన్ కార్ కంపెనీ హ్యుందాయ్ దేశీయ విపణిలో విక్రయిస్తున్న ఆరా కాంపాక్ట్ సెడాన్ ఈ జాబితాలో రెండవ స్థానంలో ఉంటుంది. హ్యుందాయ్ ఆరా డీజిల్ వేరియంట్ లీటరుకు 25.50 కిమీ సర్టిఫైడ్ మైలేజీని అందిస్తుంది. ఈ కారులో 1.2 లీటర్ డీజిల్ ఇంజన్ ఉంటుంది, ఈ ఇంజన్ 73.75 బిహెచ్‌పి పవర్ మరియు 190 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ఏఎమ్‌టి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ తో జతచేయబడి ఉంటుంది.

ప్రస్తుతం బెస్ట్ మైలేజీనిచ్చే టాప్ 5 కార్లు ఇవే..! వీటిలో మీ ఫేవరేట్ కారు ఏది..?

హ్యుందాయ్ ఆరాలో లభించే ఫీచర్లను గమనిస్తే, ఇందులో యాపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన పెద్ద 8 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్, MIDతో కూడిన 5.3 ఇంచ్ డిజిటల్ స్పీడోమీటర్, క్రూయిజ్ కంట్రోల్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, కూల్డ్ గ్లోవ్ బాక్స్ వంటి మరెన్నో ఫీచర్లు ఉన్నాయి. సేఫ్టీ విషయానికి వస్తే, ఇందులో 2 ఎయిర్‌బ్యాగ్‌లు, ABS, EBD, ISOFIX చైల్డ్ సీట్ యాంకర్లు, రియర్ పార్కింగ్ సెన్సార్‌లు, రియర్‌ వ్యూ కెమెరా, డే అండ్ నైట్ ఇన్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్ మరియు సెంట్రల్ లాకింగ్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

ప్రస్తుతం బెస్ట్ మైలేజీనిచ్చే టాప్ 5 కార్లు ఇవే..! వీటిలో మీ ఫేవరేట్ కారు ఏది..?

3. హ్యుందాయ్ ఐ20 (25.2 కెఎంపిఎల్) - డీజిల్ వేరియంట్

హ్యుందాయ్ అందిస్తున్న మరొక బెస్ట్ మైలేజ్ కారు, ఐ20. ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగంలో లభిస్తున్న హ్యుందాయ్ ఐ20 యొక్క 1.5 లీటర్ డీజిల్ వెర్షన్ లీటరుకు 25.2 కిమీ సర్టిఫైడ్ మైలేజీని అందిస్తుంది. ఈ డీజిల్ ఇంజన్ గరిష్టంగా 98.63 బిహెచ్‌పి శక్తిని మరియు 240ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అన్ని హ్యుందాయ్ కార్ల మాదిరిగానే, హ్యుందాయ్ i20 కూడా సుదీర్ఘమైన ఫీచర్ల జాబితాతో వస్తుంది.

ప్రస్తుతం బెస్ట్ మైలేజీనిచ్చే టాప్ 5 కార్లు ఇవే..! వీటిలో మీ ఫేవరేట్ కారు ఏది..?

ఈ కారులో యాపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన పెద్ద 10 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్, పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ డిస్‌ప్లే, క్రూయిజ్ కంట్రోల్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, సన్‌రూఫ్, రియర్ ఏసి వెంట్‌లు, అలాగే సేఫ్టీ విషయానికి వస్తే 6-ఎయిర్‌బ్యాగ్‌లు, ABS, EBD, ISOFIX చైల్డ్ సీట్ యాంకర్లు, రియర్ పార్కింగ్ సెన్సార్లు, రియర్‌వ్యూ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) మరియు హిల్ స్టార్ట్ అసిస్ట్ వంటి ఫీచర్లు చాలానే ఉన్నాయి.

ప్రస్తుతం బెస్ట్ మైలేజీనిచ్చే టాప్ 5 కార్లు ఇవే..! వీటిలో మీ ఫేవరేట్ కారు ఏది..?

4. టాటా ఆల్ట్రోజ్ (25.11 కెఎంపిఎల్) - డీజిల్ వేరియంట్

హ్యుందాయ్ ఐ20కి పోటీగా మరియు ప్రత్యామ్నాయంగా లభిస్తున్న మరొక ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ టాటా ఆల్ట్రోజ్. ఇది సేఫ్టీ రేటింగ్‌లో 5 స్టార్లను దక్కించుకొని, ఈ విభాగంలోనే అత్యంత సురక్షితమైన కారుగా ఉంది. టాటా ఆల్ట్రోజ్ కారులో 1.5-లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్ ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 88.78 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది మరియు ARAI సర్టిఫై చేసిన దాని ప్రకారం లీటరుకు 25.11 కిమీ మైలేజీని అందిస్తుంది.

ప్రస్తుతం బెస్ట్ మైలేజీనిచ్చే టాప్ 5 కార్లు ఇవే..! వీటిలో మీ ఫేవరేట్ కారు ఏది..?

ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ లో లభించే ఫీచర్లను గమనిస్తే, ఇందులో ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, ఆటో హెడ్‌లైట్లు, రెయిన్ సెన్సింగ్ వైపర్‌లు, కూల్డ్ గ్లోవ్ బాక్స్, క్లైమేట్ కంట్రోల్, 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, రియర్ ఏసి వెంట్స్, యాంబియంట్ లైటింగ్ వంటి అనేక ఫీచర్లను కలిగి ఉంది. సేఫ్టీ విషయానికి వస్తే, ఇందులో డ్యూయెల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ABS, EBD, బ్రేక్ స్వే కంట్రోల్ (BSC), రియర్‌వ్యూ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) మరియు రియర్ పార్కింగ్ సెన్సార్లు మొదలైనవి ఉన్నాయి.

ప్రస్తుతం బెస్ట్ మైలేజీనిచ్చే టాప్ 5 కార్లు ఇవే..! వీటిలో మీ ఫేవరేట్ కారు ఏది..?

5. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ (25.1 కెఎంపిఎల్) - డీజిల్ వేరియంట్

హ్యుందాయ్ అందిస్తున్న గ్రాండ్ ఐ10 నియోస్ ఓ మంచి అర్బన్ హ్యాచ్‌బ్యాక్ మరియు నేటి యువతకు ఇది చక్కగా సూట్ అవుతుంది. మొదటిసారిగా కారు కొనుగోలు చేసేవారు, బడ్జెట్‌లో మంచి హ్యాచ్‌బ్యాక్‌ను కొనాలనుకునే వారు ఐ10 నియోస్‌ను ఎంచుకోవచ్చు. ఇందులోని 1.2-లీటర్ డీజిల్ ఇంజన్‌తో కూడిన వేరియంట్ ARAI ధృవీకరించబడిన 25.1 కెఎంపిఎల్ మైలేజీని అందిస్తుంది. ఇది విభాగంలోనే అత్యధిక మైలేజీనిచ్చే కారుగా ఉంటుంది. ఇదే ఇంజన్ హ్యుందాయ్ ఆరాలో కూడా కనిపిస్తుంది.

ప్రస్తుతం బెస్ట్ మైలేజీనిచ్చే టాప్ 5 కార్లు ఇవే..! వీటిలో మీ ఫేవరేట్ కారు ఏది..?

ఫీచర్ల విషయానికి వస్తే, కంపెనీ ఈ చిన్న కారులో యాపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన పెద్ద 8 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్, MIDతో కూడిన 5.3 ఇంచ్ డిజిటల్ స్పీడోమీటర్, క్రూయిజ్ కంట్రోల్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, కూల్డ్ గ్లోవ్ బాక్స్ వంటి మరెన్నో ఫీచర్లను కలిగి ఉంది. ఇక సేఫ్టీ పరంగా చూస్తే, ఇందులో 2 ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS, ISOFIX చైల్డ్ సీట్ యాంకర్లు, రియర్ పార్కింగ్ సెన్సార్‌లు మరియు కెమెరా, డే అండ్ నైట్ ఇన్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్ మరియు సెంట్రల్ లాకింగ్ వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది.

Most Read Articles

English summary
Worried about high fuel prices here is the list of top 5 most fuel efficient cars in india
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X