Upcoming SUV's త్వరలో విడుదల కానున్న ది బెస్ట్ SUV కార్లు..
ప్రస్తుతం దేశంలో ఆటోమొబైల్ రంగంలో అత్యంత ప్రజాదరణ పొందిన విభాగం SUVలు. వినియోగదారుల అభిరుచులకణుగుణంగా ప్రతి నిత్యం కొత్త మోడల్ మార్కెట్‌లోకి విడుదల అవుతూనే ఉంది. మీరు కొత్త కారుని కొనుగోలు చేయాలనుకుంటే.. దేశంలో త్వరలో విడుదల కానున్న అన్ని SUVల జాబితా మీ కోసం..
మారుతి సుజుకి జిమ్నీ: మారుతి సుజుకి యొక్క లైఫ్ స్టైల్ ఆఫ్-రోడర్ జిమ్నీ చాలా కాలంగా ఎదురుచూస్తున్న మొదటి మరియు ప్రధానమైన SUV. ఐదు డోర్ల జిమ్నీ వచ్చే నెల జూన్‌లో అధికారికంగా ప్రారంభించబడుతుంది. జిమ్నీ మారుతి సుజుకి యొక్క సరికొత్త ల్యాడర్-ఆన్-ఫ్రేమ్ SUVగా ఉంది. ఆల్‌గ్రిప్ ఫోర్-వీల్-డ్రైవ్ సిస్టమ్ ప్రామాణిక ఫీచర్ దీని ప్రత్యేకత.

జీటా మరియు ఆల్ఫా వేరియంట్లలో జిమ్నీ అందుబాటులోకి రానుంది.. ఇది 1.5-లీటర్ నాలుగు-సిలిండర్ నేచురల్-ఆస్పిరేటెడ్ K15B పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉంటుంది. గరిష్ఠంగా 105 PS పవర్ అవుట్‌పుట్ వగద్ద 138 Nm వద్ద గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ మరియు 4-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లతో వస్తుంది.
హోండా ఎలివేట్ : జపనీస్ ఆటోమోటివ్ దిగ్గజం హోండా నుంచి మిడ్-సైజ్ SUV సెగ్మెంట్‌లో హోండా ఎలివేచ్ సరికొత్తగా ప్రవేశించనుంది. ఈ కొత్త SUV జూన్‌లో రానుంది. హోండా ఎలివేట్ 121 PS వద్ద 150 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో రానుంది. ధరల పరంగా, హోండా ఈ మోడల్‌ను రూ. 12 -19 లక్షల రేంజ్‌లో విడుదల కానుందని అంచనా.

హ్యుందాయ్ ఎక్స్‌టర్ : జూలై నెలలో హ్యుందాయ్ యొక్క సరికొత్త మరియు అత్యంత సరసమైన SUV ఎక్స్‌టర్ మార్కెట్‌లోకి రానుంది. ఈ కొత్త మైక్రో SUV దేశంలో టాటా యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన మైక్రో-SUV, పంచ్‌కు పోటీగా ఉంటుంది. దీని ధర రూ. 6-10 లక్షల వరకూ ఉంటుంది. Exter 1.2L కప్పా పెట్రోల్ ఇంజిన్‌తో అందించబడుతుంది.
అదేవిధంగా CNGతో 1.2L Bi-ఫ్యూయల్ కప్పా పెట్రోల్‌తో హ్యుందాయ్ ఎక్స్‌టర్ అందించబడుతుంది. పెట్రోల్ ఇంజిన్ గరిష్ఠంగా 83 PS పవర్ వద్ద 113.8 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. మరోవైపు, CNG వేరియంట్ 95.2 Nm టార్క్ మరియు 69 PS గరిష్ట అవుట్‌పుట్‌ను ఉత్పత్తి చేయగలదు.

కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ : ఎక్స్‌టర్‌తో పాటు, దక్షిణ కొరియా ఆటోమేకర్ కియా యొక్క సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ కూడా జూలై నెలలో రానుంది. పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే, 115 హార్స్‌పవర్ మరియు 144 ఎన్ఎమ్‌లతో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్, అలాగే 116 హార్స్‌పవర్ మరియు 250 ఎన్ఎమ్‌లతో 1.5-లీటర్ టర్బో-డీజిల్ ఇంజిన్ అందుబాటులో ఉండనుంది.
సిట్రోయెన్ C3 ఎయిర్‌క్రాస్ : ఈ ఎస్‌యూవీని ఆగస్టులో, ఫ్రెంచ్ వాహన తయారీ సంస్థ సిట్రోయెన్ తన సరికొత్త SUV, C3 ఎయిర్‌క్రాస్‌ను విడుదల చేయనుంది. సరికొత్త C3 ఎయిర్‌క్రాస్ SUV దాని 4.3 మీటర్ల పొడవు కారణంగా విశాలమైన క్యాబిన్‌ను కలిగి ఉండటం ప్రత్యేకత.

సిట్రోయెన్ సీ3 5-సీట్ మరియు 5+2-సీట్ ప్యాకేజీలలో అందుబాటులోకి రానుంది. C3 ఎయిర్‌క్రాస్ 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌తో మాత్రమే వస్తుంది, ఇది గరిష్ఠంగా 110hp వద్ద 190 Nm టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. గేర్‌బాక్స్ విధులు ఆరు-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ద్వారా నిర్వహించబడతాయి.
టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ : టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్, దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన సబ్-కాంపాక్ట్ SUV, ఈ ఏడాది ఆగస్టులో విడుదల కానుంది. ఈ SUV అనేక బాహ్య మరియు ఇంటీరియర్ డిజైన్ అప్‌గ్రేడ్‌లను కలిగి ఉంటుంది. నవీకరించబడిన టాటా నెక్సాన్ కొత్త 1.2-లీటర్ మూడు-సిలిండర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌ను అందుకోగలదు.

గతంలో ఆటో ఎక్స్‌పో 2023లో టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ ప్రదర్శించబడింది. కొత్త ఇంజిన్ గరిష్ఠంగా 125 bhp వద్ద 225 Nm పవర్ అవుట్‌పుట్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5 bhp మరియు ప్రస్తుత ఇంజిన్ పనితీరు సంఖ్యల కంటే 55 Nm ఎక్కువ.
హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ : దక్షిణ కొరియా ఆటోమోటివ్ దిగ్గజం హ్యుందాయ్ మోటార్ ఇండియా నుండి క్రెటా ఫేస్‌లిఫ్ట్ సెప్టెంబర్‌లో మార్కెట్‌లోకి రానుంది. క్రెటా చాలా వరకు అవుట్‌గోయింగ్ పవర్‌ట్రెయిన్‌లను కలిగి ఉండనుంది. SUV ముందు భాగంలో పూర్తిగా కొత్త బాహ్య డిజైన్‌ను కలిగి ఉంటుంది.

టాటా హారియర్ ఫేస్‌లిఫ్ట్ : ఈ ఏడాది అక్టోబర్‌లో, టాటా మోటార్స్ తన అత్యంత ప్రజాదరణ పొందిన మిడ్-సైజ్ SUV, హారియర్ యొక్క కొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను విడుదల చేయనుంది. అదే 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో పవర్ చేయబడుతుందని సంస్థ పేర్కొంది. 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ల ఎంపికతో లభిస్తుంది. అయితే, అవుట్‌గోయింగ్ పవర్‌ట్రెయిన్‌లకు అదనంగా కొత్త టర్బో పెట్రోల్ మోటారును కూడా అందించే అవకాశం ఉంది.
టాటా సఫారి ఫేస్‌లిఫ్ట్ ఈ సరికొత్త సఫారి అక్టోబరులో విడుదల కానుంది. అనేక కొత్త ఫీచర్లు మరియు మెరుగుపరచబడిన ADASలతో రానుంది. రాబోయే టాటా సఫారి ఫేస్‌లిఫ్ట్ కొత్త 1.5-లీటర్, 4-సిలిండర్, టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉండనుంది. 168bhp వద్ద 280Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

అదనంగా 2.0- లీటర్ కైరోటెక్ డీజిల్ ఇంజన్, 170 PS మరియు 350 Nm శక్తిని ఉత్పత్తి చేస్తుంది మరియు 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి, ఈ పవర్‌ప్లాంట్‌తో పాటు కంపెనీ ఫ్లాగ్‌షిప్ SUVతో అందుబాటులో ఉండే అవకాశం ఉంది.
కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ : డిసెంబర్‌లో, కియా ఇండియా తన సబ్-కాంపాక్ట్ SUV సోనెట్ యొక్క ఫేస్‌లిఫ్ట్‌ను విడుదల చేసే అవకాశం ఉంది. ఇది కొత్త బాహ్య ఇంటీరియర్ డిజైన్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. పవర్‌ట్రెయిన్ ఎంపికలు మారకుండా ఉండే అవకాశం ఉంది. ఇది హ్యుందాయ్ వెన్యూ, టాటా నెక్సాన్, మారుతి సుజుకి బ్రెజ్జా మరియు ఇతర కంపెనీలతో పోటీపడనుంది.



Click it and Unblock the Notifications








