సాలిడ్‌ స్టేట్‌ బ్యాటరీ అభివృద్ధి దిశగా టయోటా.. 10 నిమిషాల ఛార్జింగ్‌.. 1200 కి.మీ వరకు రేంజ్‌..!

ప్రముఖ కార్ల తయారీ సంస్థ టయోటా ఎలక్ట్రిక్‌ వాహనాల కోసం సాలిడ్‌ స్టేట్‌ బ్యాటరీలను తయారు చేస్తోంది. ఈ బ్యాటరీలతో ధర, పరిమాణం సగానికి తగ్గుతుందని తెలుస్తోంది. ఈ బ్యాటరీల అభివృద్ధి కీలక దశలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ సాలిడ్‌ స్టేట్‌ బ్యాటరీలు (solid state battery technology) అందుబాటులోకి వస్తే ధరలు సుమారు 50 శాతం వరకు తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ బ్యాటరీల ఉత్పత్తి 2027 లేదా 2028 నాటికి ప్రారంభం అవుతుందని టయోటా తెలిపింది. ఫైనాన్షియల్ టైమ్స్‌ ఈ నివేదికను వెల్లడించింది.

Toyota solid state battery technology

10 నిమిషాల్లోనే ఛార్జింగ్ : గత వారం టయోటా సం‌స్థ ఈ బ్యాటరీల అభివృద్ధిని తర్వాత దశకు తీసుకెళ్లడంలో భాగంగా జపాన్‌కు చెందిన ప్రముఖ చమురు కంపెనీ Idemitsu తో ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇది విజయవంతం అయితే ప్రస్తుతం ఉన్న బ్యాటరీల రేంజ్‌ను 1200 కి.మీ వరకు రెట్టింపు చేయగలవని తెలుస్తోంది. మరియు ఛార్జింగ్ సమయం కూడా 10 నిమిషాలు అంతకంటే తక్కువ సమయానికి తగ్గనుందని సమాచారం.

సాలిట్‌ స్టేట్‌ బ్యాటరీ అంటే ఏంటి : ఈ సాలి‌డ్‌ స్టేట్‌ బ్యాటరీలు ఘన స్థితి కాథోడ్‌, యానోడ్‌ మరియు ఘన ఎలక్ట్రోలైట్‌తో తయారు చేస్తారు. లిక్విడ్‌ ఎలక్ట్రోలైట్‌ను ఉపయోగించే లిథియం అయాన్ బ్యాటరీల నుంచి ఈ సాలిట్‌ స్టే్ట్‌ బ్యాటరీలు భిన్నంగా ఉంటాయి. ప్రస్తుతం ఉన్న లిథియం అయాన్ (Li-ion) బ్యాటరీలు లీకేజీ సహా ఇతర నష్టాలను కలిగిస్తాయి. కొన్నిసార్లు మంటలు చెలరేగే అవకాశం ఉంటుంది.

సాలిడ్ స్టేట్ బ్యాటరీల యుగం ఆసన్నమైంది : ప్రస్తుతం టయోటా నేతృత్వంలో పరిశోధన దశలో ఉన్న ఘన ఎలక్ట్రోలైట్‌తో కూడిన సాలిడ్‌ స్టేట్‌ బ్యాటరీల్లో ఇటువంటి సమస్యలు ఉండవు. వాటి కంటే మరింత స్థిరత్వాన్ని కలిగి ఉంటాయి. మరింత మెరుగైన భద్రతను కలిగి ఉంటుందని తెలుస్తోంది. సాలిడ్ స్టేట్ బ్యాటరీల యుగం ఆసన్నమైందని Idemitsu సీఈవో కిటో వెల్లడించారు.

చాలా కీలకం : అయితే సాలిడ్ స్టేట్‌ బ్యాటరీల ఒప్పందం టయోటాకు (Toyota solid state battery technology) చాలా కీలకమైనదని తెలుస్తోంది. ఈ బ్యాటరీ పరిశోధన, అభివృద్ధిని వేగవంతం చేయాలని భావిస్తోంది. అయితే సాలిడ్‌ స్టేట్‌ బ్యాటరీల తయారీపై నిస్సాన్‌, ఫోర్డ్‌ వంటి సంస్థలు పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే ఇందులో టయోటా ఇందులో ముందంజలో ఉంది. టయోటా ఒప్పందం చేస్తుకున్న Idemitsu సంస్థ 2021 నుంచి సాలిడ్‌ స్టేట్‌ బ్యాటరీల కోసం ప్రాథమిక సాంకేతికతను అభివృద్ధి చేస్తోంది. అయితే ఈ బ్యాటరీల ఉత్పత్తి 2027 లేదా 28 నాటికి ప్రారంభం అవుతుందని టయోటా తెలిపింది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from DriveSpark

Article Published On: Tuesday, October 24, 2023, 18:11 [IST]
English summary
1200 km range with 10 minutes of charging with toyota solid state battery technology
Read more on: #టయోటా #toyota
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+