అట్టహాసంగా ప్రారంభమైన 2023 ఆటో ఎక్స్‌పో.. చూసేవారికి కన్నుల పండుగే

సుదీర్ఘ విరామం తరువాత ఎట్టకేలకు '2023 ఆటో ఎక్స్‌పో' ప్రారంభమైపోయింది. కరోనా మహమ్మారి తరువాత ఎంతో అట్టహాసంగా జరుగుతున్న ఈ ఆటో ఎక్స్‌పోకి ప్రపంచంలోని చాలా దేశాల కంపెనీలు రానున్నాయి. అయితే ఈ '2023 ఆటో ఎక్స్‌పో' లో విడుదలయ్యే మరియు ఆవిష్కరించబడే వాహనాలను గురించి తెలియజేయడానికి మా బృందం కూడా అక్కడికి చేరుకుంది.

చాలా మంచి ఆటో మోటీవ్ ఔత్సాహికులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే 16 వ ఆటో ఎక్స్‌పోలో ఈ రోజు ఉదయమే ప్రపంచ ప్రసిద్దిగాంచిన కంపెనీలు తమ ఈవెంట్ [ప్రారంభించనున్నాయి. ఇందులో దాదాపు 15 దేశాలకు చెందిన 800 కంపెనీలు పాల్గొనననున్నట్లు ఇప్పటికే తెలిసింది. ఇందులో టాటా మోటార్స్, మారుతి సుజుకి, ఎంజి మోటార్ వంటి కంపెనీలు పాల్గొని తమ ఆధునిక ఉత్పత్తులను ఆవిష్కరించనున్నాయి మరియు విడుదల చేయనున్నాయి.

అట్టహాసంగా ప్రారంభమైన 2023 ఆటో ఎక్స్‌పో

ఈ రోజు నుంచి ప్రారంభమయ్యే 16 వ ఎడిషన్ ఆటో ఎక్స్‌పో మోటార్ షో గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్‌పో మార్ట్‌లో జరగనుంది. అయితే ఈ రోజు మరియు రేపు (జనవరి 11 వ మరియు 12 వ తేదీలు) మీడియా కోసం కేటాయించబడతాయి. కావున ఇందులో అడుగు పెట్టే దాదాపు అన్ని వాహనాలను గురించి మా డ్రైవ్‌స్పార్క్ బృందం ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటుంది.

చాలా రోజుల తరువాత జరుగుతున్న 2023 ఆటో ఎక్స్‌పోలో ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, పోలాండ్, దక్షిణ కొరియా మరియు యూకే వంటి దేశాలు పాల్గొననున్నాయి. ఈ దేశాలన్నింటికి మన దేశం వేదికగా మారనుంది. కావున ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పెద్ద కంపెనీలు సైతం తమ ఉట్పత్తులను ఈ ఆటో ఎక్స్‌పో ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించనున్నాయి. అంతే కాకుండా చిన్న కంపెనీలు కూడా ఈ వేదిక ద్వారా తమ ఉత్పత్తులను పరిచయం చేయనున్నాయి.

మూడు సంవత్సరాల తరువాత జరుగుతున్న ఈ ఆటో ఎక్స్‌పోకి కొన్ని ప్రధాన కంపెనీలు దూరంగా ఉండటం గమనార్హం. ఈ ఆటో ఎక్స్‌పో ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థలైన హీరో మోటోకార్ప్, హోండా మోటార్సైకిల్, టీవీఎస్ మోటార్స్, బజాజ్ ఆటో, రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీలు పాల్గొనలేదు. ఈ సమాచారం ఇప్పటికే ద్రువీకరించడమైంది. అంతే కాకుండా చైనా వాహనా తయారీ సంస్థలు కూడా ఈ ఆటో ఎక్స్‌పోకి దూరంగా ఉన్నాయి.

2023 ఆటో ఎక్స్‌పోలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దాదాపు 40 కి పైగా దేశాల నుంచి వ్యాపారవేత్తలు, ప్రభుత్వ అధికారులు, మీడియాతో సహా దాదాపు ఒక లక్ష మందికి పైగా సందర్శకులు పాల్గొనే అవకాశం ఉందని నిర్వాహకుల అంచనా. ఈ సారి జరగనున్న ఈ ఆటో ఎక్స్‌పోలో ఎక్కువ భాగం ఎలక్ట్రిక్ వాహనాలే కనిపించనున్నాయి. కావున 2023 ఆటో ఎక్స్‌పోలో ఎలక్ట్రిక్ మొబిలిటీ, ఎడిఎఎస్, బయోఫ్యూయెల్ టెక్నాలజీలు మొదలైనవన్నీ కూడా ఇక్కడ ప్రతి బింబిస్తాయి.

కరోనా మహమ్మారి తరువాత ప్రారంభమవుతున్న ఈ ఆటో ఎక్స్‌పోలో చాలా ఆధునిక వాహనాలు అడుగుపెట్టే అవకాశం ఉంటుంది. కావున ఈ ఆటో ఎక్స్‌పో ఎంతో అట్టహాసంగా మరియు ఆడంబరంగా ప్రారంభం కానుంది. ఇందులో ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే అనేక ఉత్పత్తులను కూడా చూడవచ్చు. ఇప్పటికే మేము ఆటో ఎక్స్‌పో వేదిక గురించి మరియు ఇతరత్రా వివరాలను గురించి ఇది విరక్తి కథనాల్లో తెలియజేశాము.

2023 ఆటో ఎక్స్‌పోలో అద్భుతమైన మరియు అధునాతన మోడల్స్ ఆవిష్కరించడతాయి మరియు విడుదలవుతాయి. ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించబడే/విడుదలయ్యే వాహనాలను గురించి అప్డేటెడ్ సమాచారం ఎప్పటికప్పుడు తెలియజేయడానికి మా డ్రైవ్‌స్పార్క్ బృందం సిద్ధంగా ఉంది. 2023 ఆటో ఎక్స్‌పోలో విడుదలయ్యే మరియు ఆవిష్కరించబడే వాహనాలను గురించి తెలుసుకోవడానికి ఈ లింకుపై క్లిక్ చేయండి. మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి మా అధికారిక సోషల్ మీడియా పేజీలను అనుసరిస్తూ మీకు కావాల్సిన సమాచారం పొందండి.

More from DriveSpark

Article Published On: Wednesday, January 11, 2023, 8:51 [IST]
English summary
2023 auto expo starts today follow drivespark telugu for latest news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+