ఆధునిక అప్‌డేట్స్‌తో ఆవిష్కరించబడిన '2023 హ్యుందాయ్ ఆరా ఫేస్‌లిఫ్ట్'.. పూర్తి వివరాలు

ఎట్టకేలకు హ్యుందాయ్ కంపెనీ తన 2023 ఆరా ఫేస్‌లిఫ్ట్ సెడాన్‌ను దేశీయ మార్కెట్లో అధికారికంగా ఆవిష్కరించింది. కంపెనీ ఇప్పుడు ఈ సెడాన్ కోసం బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. ఈ కొత్త 2023 ఆరా ఫేస్‌లిఫ్ట్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.. రండి.

హ్యుందాయ్ కంపెనీ తన 'ఆరా' ను 2020 జనవరిలో ప్రవేశపెట్టిన తరువాత కొత్త టెక్నాలజీ మరియు ఆధునిక అప్డేట్స్ తో తీసుకురావడం ఇదే మొదటి సారి. ఈ అప్డేటెడ్ హ్యుందాయ్ ఆరా సెడాన్ త్వరలో జరగనున్న 2023 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించబడుతుంది. అంతకంటే ముందు ఈ సెడాన్ కొనాలనే కస్టమర్లు రూ. 11,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ధరలు కూడా త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంటుంది.

మరిన్ని హంగులతో ఆవిష్కరించబడిన హ్యుందాయ్ ఆరా ఫేస్‌లిఫ్ట్

2023 హ్యుందాయ్ ఆరా ఫేస్‌లిఫ్ట్ మంచి డిజైన్ పొందుతుంది. ఇందులో గమనించదగిన అతి పెద్ద అప్‌డేట్ దాని ఫ్రంట్-ఎండ్ డిజైన్. ఇందులో రెండు భాగాలుగా విభజించబడి ఉన్న గ్రిల్ చూడవచ్చు. గ్రిల్ మరియు బానెట్ మధ్య బ్రాండ్ లోగో ఉంటుంది. దిగువ భాగంలో ఉన్న బంపర్ కూడా విశాలంగా ఉంటుంది. ఇది మునుపటి మోడల్ కంటే కూడా విస్తృతంగా ఉన్నట్లు మనకు స్పష్టంగా తెలుస్తోంది.

2023 ఆరా ఫేస్‌లిఫ్ట్ యొక్క బంపర్ అంచులలో కొత్త ఇన్వర్టెడ్ ఎల్ ఆకారపు LED డేటైమ్ రన్నింగ్ ల్యాంప్స్ ఉన్నాయి. అయితే ఈ సెడాన్ లో ఫాగ్ ల్యాంప్‌లు లేదు. ఫ్రంట్ బంపర్‌ మునుపటికంటే కూడా చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. సైడ్ ప్రొఫైల్ లో ఎటువంటి అప్డేట్స్ లేదు. కావున అల్లాయ్ వీల్స్ దాని మునుపటి మోడల్ మాదిరిగానే ఉన్నాయి. వెనుక భాగంలో బూట్-లిడ్ స్పాయిలర్ ఉంది. మిగిలిన మొత్తం దాని మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటుంది.

మరిన్ని హంగులతో ఆవిష్కరించబడిన హ్యుందాయ్ ఆరా ఫేస్‌లిఫ్ట్

కొత్త అప్డేటెడ్ హ్యుందాయ్ ఆరా ఫేస్‌లిఫ్ట్ ఇంటీరియర్ క్యాబిన్ మునుపటి మోడల్ మాదిరిగా ఉన్నప్పటికీ, సీట్లు కొత్త అపోల్స్ట్రే కలిగి, లెదర్ తో చుట్టబడిన స్టీరింగ్ వీల్ మరియు ఫుట్‌వెల్ ప్రాంతానికి కొత్త లైటింగ్‌ ఉండటం చూడవచ్చు. అంతే కాకుండా ఇందులో 8 ఇంచెస్ టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ప్లే వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది.

పైన తెలిపిన ఇంటీరియర్ ఫీచర్స్ మాత్రమే కాకుండా హ్యుందాయ్ ఆరా ఫేస్‌లిఫ్ట్ లో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జర్‌, కొత్త టైప్ సి ఛార్జింగ్ పోర్ట్‌లు, రియర్ AC వెంట్‌లు ఉన్నాయి. ఇందులో 3.5 ఇంచెస్ డిజిటల్ డిస్‌ప్లే ఉంటుంది. ఇది వాహనం గురించి డ్రైవర్ కి చాలా సమాచారం అందిస్తుంది. మొట్ట మీద ఇంటీరియర్ డిజైన్ మరియు ఫీచర్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి.

మరిన్ని హంగులతో ఆవిష్కరించబడిన హ్యుందాయ్ ఆరా ఫేస్‌లిఫ్ట్

హ్యుందాయ్ ఆరా ఫేస్‌లిఫ్ట్ అదే 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌ పొందుతుంది. ఈ ఇంజిన్ 83 హెచ్‌పి పవర్ మరియు 113.8 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ లేదా AMT గేర్‌బాక్స్‌తో జతచేయబడుతుంది. అంతే కాకుండా ఇందులో 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌లో CNG ఆప్సన్ కూడా ఉంటుంది. ఇది 69 హెచ్‌పి పవర్ మరియు 95.2 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. అయితే ఇందులో కేవలం 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ మాత్రమే అందుబాటులో ఉంటుంది.

2023 హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ ఫేస్‌లిఫ్ట్ మల్టిపుల్ ఎయిర్ బ్యాగులు, ఏబీఎస్ విత్ ఈబిడి, ఎలక్ట్రినిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ అసిస్ట్ కంట్రోల్ వంటి సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది. కంపెనీ ఈ సెడాన్ యొక్క ధరలను వెల్లడించలేదు, అయితే ఇది రూ. 6.5 లక్షల నుంచి రూ. 9.5 లక్షల మధ్య విడుదలయ్యే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము. ఇది మార్కెట్లో టాటా టిగోర్, హోండా అమేజ్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, January 10, 2023, 13:28 [IST]
English summary
2023 hyundai aura facelift revealed and bookings details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+