గ్రాండ్ ఐ10 నియోస్‌ ఫేస్‌లిఫ్ట్ ఆవిష్కరించిన హ్యుందాయ్: బుకింగ్ ధర రూ. 11,000

గత కొన్ని రోజులుగా టెస్టింగ్ దశలో ఉన్న హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్‌ ఫేస్‌లిఫ్ట్ ఎట్టకేలకు మార్కెట్లో ఆవిష్కరించబడింది. కంపెనీ ఈ కొత్త ఫేస్‌లిఫ్టెడ్ గ్రాండ్ ఐ10 నియోస్‌ కోసం బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

గ్రాండ్ ఐ10 నియోస్‌ ఫేస్‌లిఫ్ట్ ఆవిష్కరించిన హ్యుందాయ్: బుకింగ్ ధర రూ. 11,000

దక్షిణ కొరియాకు చెందిన కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ తన కొత్త గ్రాండ్ ఐ10 నియోస్‌ ఫేస్‌లిఫ్ట్ కోసం రూ. 11,000 టోకెన్ మొత్తంతో బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. కావున ఆసక్తికలిగిన కొనుగోలుదారులు బుక్ చేసుకోవచ్చు. ఈ కారు రేపు ప్రారంభం కానున్న ఆటో ఎక్స్‌పో 2023లో ప్రదర్శించబడుతుంది. ఈ కొత్త ఫేస్‌లిఫ్ట్ అప్డేటెడ్ డిజైన్ కలిగి ఆధునిక భద్రతలతో పాటు ఆధునిక టెక్నాలజీ వంటి వాటిని కూడా పొందుతుంది.

గ్రాండ్ ఐ10 నియోస్‌ ఫేస్‌లిఫ్ట్ ఆవిష్కరించిన హ్యుందాయ్: బుకింగ్ ధర రూ. 11,000

2023 హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ ఫేస్‌లిఫ్ట్ అద్భుతమైన డిజైన్ పొందుతుంది. ఈ కారు యొక్క ముందు భాగంలో కొత్త ఫ్రంట్ బంపర్‌ గమనించవచ్చు. ఇది ఇందులో అతిపెద్ద మార్పు అనే చెప్పాలి. ఇక్కడ ఎక్కువ భాగం బ్లాక్ కలర్ లో పూర్తి చేయబడిన గ్రిల్ ఉంటుంది. దీనికి రెండువైప్పులా కొత్త ట్రై యారో ఆకారంలో ఉండే LED DRL లు సైడ్ ఇన్‌టేక్‌లతో కలిసి ఉంటాయి.

గ్రాండ్ ఐ10 నియోస్‌ ఫేస్‌లిఫ్ట్ ఆవిష్కరించిన హ్యుందాయ్: బుకింగ్ ధర రూ. 11,000

సైడ్ ప్రొఫైల్ లో 15 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. గ్రాండ్ i10 నియోస్ ఇప్పుడు కొత్త LED టెయిల్-లైట్లను కలిగి ఉంది. అంతే కాకుండా ఇది లైట్ బార్ ద్వారా కనెక్ట్ చేయబడి ఉంటుంది. మొత్తం మీద డిజైన్ చాలా అద్భుతంగా ఉంటుంది.

గ్రాండ్ ఐ10 నియోస్‌ ఫేస్‌లిఫ్ట్ ఆవిష్కరించిన హ్యుందాయ్: బుకింగ్ ధర రూ. 11,000

హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్‌ ఫేస్‌లిఫ్ట్ మొత్తం ఆరు కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి పోలార్ వైట్, టైటాన్ గ్రే, టైఫూన్ సిల్వర్, స్పార్క్ గ్రీన్, టీల్ బ్లూ మరియు ఫైరీ రెడ్ కలర్స్. వీటితో పాటు కంపెనీ దీనిని కొత్త డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్‌లలో కూడా తీసుకువచ్చింది. అవి బ్లాక్ రూఫ్‌తో స్పార్క్ గ్రీన్ మరియు బ్లాక్ రూఫ్‌తో పోలార్ వైట్. ఇవి కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.

గ్రాండ్ ఐ10 నియోస్‌ ఫేస్‌లిఫ్ట్ ఆవిష్కరించిన హ్యుందాయ్: బుకింగ్ ధర రూ. 11,000

2023 హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ ఫేస్‌లిఫ్ట్ యొక్క ఇంటీరియర్ మరియు ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులోని క్యాబిన్ దాదాపు దాని మునుపటి మోడల్ మాదిరిగా ఉన్నప్పటికీ సీట్ల కోసం కొత్త గ్రే అప్‌హోల్స్టరీ, లెదర్‌తో చుట్టబడిన స్టీరింగ్ వీల్, ఫుట్‌వెల్ కోసం కొత్త లైటింగ్ మరియు డోర్ హ్యాండిల్స్ లోపలి భాగంలో మెటల్ ఫినిషింగ్ వంటివి ఉన్నాయి.

గ్రాండ్ ఐ10 నియోస్‌ ఫేస్‌లిఫ్ట్ ఆవిష్కరించిన హ్యుందాయ్: బుకింగ్ ధర రూ. 11,000

2023 గ్రాండ్ i10 నియోస్ ఫేస్‌లిఫ్ట్ 8.0 ఇంచెస్ టచ్‌స్క్రీన్‌ కలిగి ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. అంతే కాకుండా ఇందులో రియర్ AC వెంట్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జర్‌, టైప్-సి USB పోర్ట్‌లు, క్రూయిజ్ కంట్రోల్ మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి అప్డేటెడ్ ఫీచర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.

గ్రాండ్ ఐ10 నియోస్‌ ఫేస్‌లిఫ్ట్ ఆవిష్కరించిన హ్యుందాయ్: బుకింగ్ ధర రూ. 11,000

2023 హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ ఫేస్‌లిఫ్ట్ అదే 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌ కలిగి 83 హెచ్‌పి పవర్ మరియు 113.8 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా AMT గేర్‌బాక్స్‌తో జతచేయబడుతుంది. అదే సమయంలో కంపెనీ 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌లో CNG కిట్‌ కూడా అందిస్తుంది. ఇది 69 హెచ్‌పి పవర్ మరియు 95.2 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది కేవలం 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.

గ్రాండ్ ఐ10 నియోస్‌ ఫేస్‌లిఫ్ట్ ఆవిష్కరించిన హ్యుందాయ్: బుకింగ్ ధర రూ. 11,000

ఇక చివరగా సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో నాలుగు ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ విత్ ఈబిడి వంటి వాటితో పాటు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ISOFIX ఎంకరేజ్‌లు మరియు డే/నైట్ రియర్ వ్యూ మిర్రర్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారుల యొక్క భద్రతను నిర్థారిస్తాయి. 2023 హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ ఫేస్‌లిఫ్ట్ దేశీయ మార్కెట్లో రూ. 6 లక్షల నుంచి రూ. 9 లక్షల మధ్య విడుదలయ్యే అవకాశం ఉంటుంది. ఇది టాటా టియాగో మరియు మారుతి సుజుకి స్విఫ్ట్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, January 10, 2023, 9:31 [IST]
English summary
2023 hyundai grand i10 nios facelift revealed bookings specs features and details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+