2023 మోడల్ కొత్త వెర్నాను విడుదల చేసిన హ్యుందాయ్.. టాప్ సెడాన్ లకు సవాల్..
సరికొత్త 2023 హ్యుందాయ్ వెర్నాను భారతీయ మార్కెట్‌లో ఆ సంస్థ విడుదల చేసింది. 2006లో తొలిసారిగా భారతదేశంలో ప్రారంభించబడిన వెర్నా, అధునాతన ఆరవ జనరేషన్ మోడల్ లో టర్బో పెట్రోల్ ఇంజన్, ADAS టెక్నాలజీ వంటి అధునాతన డ్రైవర్-సహాయక వ్యవస్థలు వంటి ఫీచర్లు ఈ కారులో ఉన్నాయి. ఇంకా ఈ కారుకు సంబంధించి మరిన్ని వివరాలు మీకోసం..
వెర్నా మొదటిసారిగా 2006లో భారతదేశంలో ప్రారంభించబడింది. తొలిసారిగా చెన్నై ప్లాంట్ ద్వారా తమ ఉత్పత్తులను దేశంలో మొదలు పెట్టింది. అప్పటి నుంచి దాదాపు 4.5 లక్షల కస్టమర్లను సంపాదించింది. అలానే విదేశాలకు కూడా ఈ కార్లను ఎగుమతి చేసింది. గత 17 సంవత్సరాలుగా, ఇది భారతీయ మార్కెట్లో పేరొందిన సెడాన్ గా గుర్తింపును పొందింది.

పూర్తిగా రీడిజైన్ లో అందుబాటులోకి..
సబ్-కాంపాక్ట్, మధ్య-పరిమాణ SUV ఆప్షన్లలో ఈ కారు అందుబాటులో ఉండనుంది. కొత్త హ్యుందాయ్ వెర్నాను సంస్థ పూర్తిగా రీడిజైన్ చేసింది. LED హెడ్‌ల్యాంప్‌ల పైన ఆకర్షణీయమైన LED స్ట్రిప్‌ను ఏర్పాటు చేసింది. అలానే పారామెట్రిక్ జ్యువెల్ ఫ్రంట్ గ్రిల్ కూడా మోడల్‌కు పూర్తిగా కొత్తదనాన్ని తీసుకురానుంది. వెనుక వైపున, టెయిల్ ల్యాంప్‌ల మధ్య కనెక్ట్ చేయబడిన LED లైట్ బార్ ఉంటుంది. ఇది చూపరులను ఆకట్టుకుంటుంది.
ఈ సరికొత్త వెర్నా ఇప్పుడు ఏడు సింగిల్ టోన్ బాహ్య కలర్లతో పాటు రెండు డ్యూయల్-టోన్ రంగులతో వైట్ ప్లస్ బ్లాక్, రెడ్ ప్లస్ బ్లాక్ లో అందించబడుతుంది. వెనుక స్కిడ్ ప్లేట్, బూట్ స్పాయిలర్, బాడీ సైడ్ మోల్డింగ్ ఉపకరణాలుగా అందుబాటులోకి వచ్చాయి.

12 భాషలు సపోర్ట్ చేసేలా..
క్యాబిన్ ఇన్ఫోటైన్‌మెంట్, డ్రైవర్ సమాచారం కోసం భారీ పనోరమిక్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 12 భాషలకు మద్దతుతో 10.25-అంగుళాల HD ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, TFT MIDతో డిజిటల్ క్లస్టర్ కర్వ్ తో ఉంది. రెండు డ్యాష్‌బోర్డ్ కలర్ ఆప్షన్‌లు ఇందులో ఉన్నాయి. బ్లాక్ ప్లస్ రెడ్ (టర్బో వేరియంట్‌లో), బ్లాక్ ప్లస్ బీజ్ అనే రెండు కలర్ ఆప్షన్‌లు ఉన్నాయి.
కొత్త హ్యుందాయ్ వెర్నా మొదటి-ఇన్-సెగ్మెంట్ వెంటిలేటెడ్, హీటెడ్ ఫ్రంట్ సీట్లు, ఎనిమిది-స్పీకర్ బోస్ సౌండ్ సిస్టమ్‌ను కూడా పొందుతుంది. వెర్నా ఫీచర్ లిస్ట్‌లో ఫ్రంట్ హీటెడ్, వెంటిలేటెడ్ సీట్లు, 64-లైట్ యాంబియంట్ లైటింగ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, లెదర్ ర్యాప్డ్ స్టీరింగ్ వీల్, పవర్ డ్రైవర్ సీట్, లెదర్ సీట్ల వంటివి ఉన్నాయి.

పవర్ ఫుల్ ఇంజన్..
కొత్త హ్యుందాయ్ వెర్నా 1.5-లీటర్ టర్బో GDi పెట్రోల్ ఇంజన్ తో పనిచేస్తుంది. ఇది 157 bhp వద్ద 250 Nm టార్క్‌ను అందిస్తుంది. ఈ ఇంజన్ ముఖ్యంగా ఉత్తేజకరమైన డ్రైవ్ కోసం వెతుకుతున్న వారి కోసం ఉంచబడుతుంది. ఈ కారు 8.1 సెకన్లలో 0 నుండి 100 కిమీ వేగాన్ని అందుకుంటుంది. నేచరల్ ఆస్పిరేటెడ్ 1.5-లీటర్ పెట్రోల్ మోటారుతో ఈ కారు రానుంది. ఇందులో డీజిల్ ఆప్షన్ లేదు.
భద్రతా పరంగా భారతదేశంలోనే ADAS ఫీచర్లను కచ్చితంగా అందిస్తున్న మూడవ మోడల్ గా హ్యుందాయ్ ఉంది. ADAS, భద్రత ప్రమాణాలుగా ఉన్న లేన్ ఫాలోయింగ్ అసిస్ట్, ఫార్వర్డ్ కొలిజన్-ఎవాయిడెన్స్ అసిస్ట్, సేఫ్ ఎగ్జిట్ వార్నింగ్, ఇలా అనేక ఇతర సదుపాయాలు ఈ కార్లలో ఉన్నాయి. వెర్నా కారులో మొత్తం ఆరు ఎయిర్‌బ్యాగ్‌ల రానున్నాయి. సకాలంలో ఇవి తెరచకోనున్నాయి.
కొత్త వెర్నా మారుతి సుజుకి సియాజ్, స్కోడా స్లావియా, ఫోక్స్‌వ్యాగన్ వర్టస్, హోండా సిటీ వంటి వాటితో ఈ కారు పోటి పడనుంది. మిడ్-సైజ్ సెడాన్ సెగ్మెంట్‌లో ఈ కార్లు తమ సత్తాను చాటనున్నాయి. దీనికి సంబంధించి బేస్ వేరియంట్ కోసం 10.89 లక్షల ప్రారంభ ధరతో ప్రారంభం అవుతుండగా.. టాప్ వేరియంట్ 17.37(ఎక్స్-షోరూమ్)గా ఉండనుంది..


Click it and Unblock the Notifications








