వీడియో: విడుదలైన రోజే ప్రమాదం.. దెబ్బతిన్న ముందుభాగం, ఈ కారు ఎంత వరకు సేఫ్..?
హ్యుందాయ్ ఇండియా ఇటీవల భారత మార్కెట్లోకి సరికొత్త 2023 వెర్నాను విడుదల చేసింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ వెర్నా ఇప్పటికే దేశవ్యాప్తంగా అన్ని షోరూమ్‌లలో ఈ కారు కొనుగోలుకు అందుబాటులో ఉంది. దీనికి సంబంధించిన టెస్ట్ డ్రైవ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. విడుదలైన మొదటి రోజే ఈ సరికొత్త సెడాన్ కు మొదటి ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కారు డ్యామేజీ తీవ్రత గురించి ఇక్కడ తెలుసుకుందాం.
హ్యుందాయ్ వెర్నా యు-టర్న్ తీసుకుంటుండగా రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్‌పై ఇద్దరు యువకులు వేగంగా వచ్చి కారును ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో బుల్లెట్ నడుపుతున్న ఇద్దరు కుర్రాళ్లు కారు ముందు భాగంలో పడిపోయారు. వీరు ప్రయాణిస్తున్న బుల్లెట్ గంటకు 80 కి.మీ వేగంతో వచ్చి కారకున ఢీకొట్టినట్లు స్థానికులు చెప్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో వెర్నా అక్కడే నిలిచిపోయింది.

అత్యాధుని భద్రతా ఫీచర్లు..
హై-స్పీడ్ లో బుల్లెట్ కారును ఢీకొట్టడంతో కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. కారుకి ముందు ఉన్న బంపర్ ఊడిపోయి రోడ్డుపై పడింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ ముందు భాగంలోని బెంట్ ఛాసిస్ భారీగా దెబ్బతింది. బైక్‌పై వెళ్తున్న యువకులకు తీవ్రగాయాలయ్యాయి. ప్రమాద సమయంలో వారు హెల్మెట్ ధరించలేదు. చికిత్స నిమిత్తం స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. కారులో ప్రయాణించే వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.
సరికొత్త హ్యుందాయ్ వెర్నాలో 30 స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లతో తీసుకువచ్చింది. పూర్తి భద్రతా ప్రమాణాలతో ఈ కారును సంస్థ తయారు చేసింది. ADAS టెక్నాలజీతో పాటు ప్రామాణిక భద్రతా ఫీచర్లు ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ప్రయాణికులందరికీ మూడు-పాయింట్ సీట్ బెల్ట్‌లు, సీట్ బెల్ట్ రిమైండర్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

హ్యుందాయ్ బ్లూలింక్ ఫీచర్..
అలానే ఇందులో స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్, ఇంపాక్ట్ సెన్సింగ్ ఆటో డోర్ అన్‌లాక్, ABS, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్, హెడ్‌ల్యాంప్ ఎస్కార్ట్ ఫంక్షన్, ఆటోమేటిక్ వంటి ఫీచర్లు ఉన్నాయి. హెడ్‌ల్యాంప్‌లు, ISOFIX మౌంట్‌లు, వెనుక పార్కింగ్ సెన్సార్లు వంటి మరెన్నో అద్భుతమైన ఫీచర్లను సంస్థ జోడించింది.
ఈ కారులో హై-ఎండ్ వేరియంట్‌లలో ESC, హిల్ స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్, అన్ని డిస్క్ బ్రేక్‌లు, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, కార్నరింగ్ ల్యాంప్స్ తో పాటు హ్యుందాయ్ బ్లూలింక్ ఫీచర్ స్మార్ట్‌సెన్స్ ను కూడా అందిస్తుంది.

యాక్సిడెంట్ అలర్ట్స్..
ADAS ఫీచర్లోని అత్యాధునిక ఆప్షన్స్ ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్, ఫార్వర్డ్ కొలిషన్-అవాయిడెన్స్ అసిస్ట్, లేన్ కీపింగ్ అసిస్ట్, డ్రైవర్ అటెన్షన్ వార్నింగ్, సేఫ్ ఎగ్జిట్ వార్నింగ్, స్మార్ట్ క్రూయిజ్ కంట్రోల్, హై బీమ్ అసిస్ట్, లీడింగ్ వెహికల్ డిపార్చర్ అలర్ట్, రియర్ క్రాస్-ట్రాఫిక్ హెచ్చరిక వంటి మరెన్నో నూతన ఫీచర్లతో ఈ కారు అందుబాటులో ఉంది.

ఈ కారు రెండు పెట్రోల్ ఆప్షన్లలో వస్తుంది. కొత్త హ్యుందాయ్ వెర్నా 1.5-లీటర్ టర్బో GDi పెట్రోల్ ఇంజన్ తో పనిచేస్తుంది. అలానే నేచరల్ ఆస్పిరేటెడ్ 1.5-లీటర్ పెట్రోల్ మోటారుతో ఈ కారు రానుంది. ఇందులో డీజిల్ ఆప్షన్ లేదు. ఇది 157 bhp వద్ద 250 Nm టార్క్‌ను అందిస్తుంది. ఈ కారు 8.1 సెకన్లలో 0 నుండి 100 కిమీ వేగాన్ని అందుకుంటుంది.


Click it and Unblock the Notifications








