2023 Mercedes GLC Benz మెర్సిడెస్‌ బెంజ్ GLC ఫుల్‌ రివ్యూ వీడియో

కొత్త మెర్సిడెస్ GLC ఒక ఆకర్షణీయమైన స్పోర్టీ SUV. దాని ఆకర్షణీయమైన డిజైన్, సాంకేతికత మరియు విలాసవంతమైన క్యాబిన్ లక్షణాలతో, ఇది మరింత మంది వినియోగదారులను ఆకర్షించే ఆకర్షణీయమైన లగ్జరీగా చెప్పవచ్చు. ఈ కొత్త Mercedes GLC SUV ప్రీమియర్ వినియోగదారులకు గొప్ప ఎంపిక. ఈ అధనాతన లగ్జరీ కారు డిజైన్‌, ఫీచర్లు, పనితీరును మీకు ఫుల్‌ రివ్యూ వీడియో ద్వారా అందిస్తున్నాం.

ఇంటీరియర్‌: కొత్త 2023 GLC క్యాబిన్‌లోకి అడుగు పెట్టినట్లయితే మరో లోకంలోకి వెళ్తామనడంలో ఆశ్చర్యం లేదు. విలాసవంతమైన సౌకర్యాలతో ప్రయాణికులకు కొత్త అనుభూతిని ఇస్తుంది. క్యాబిన్‌ మునుపటి తరం మాదిరిగా కాకుండా కొత్త C క్లాస్‌ను పోలి ఉంటుంది. ఒక్కసారి ఆ సీట్లలో కూర్చున్నట్లయితే మీరు మైమరిచిపోవడం ఖాయం. విశాలమైన సన్‌రూఫ్‌తో పాటు అందులో ఉపయోగించిన మెటీరియల్‌ మీకు మరిచిపోలేని అనుభూతిని ఇస్తుంది.

ఫీచర్లు: ఇంకా కొత్త మెర్సిడెస్‌ GLC SUV అనేక భద్రతా ఫీచర్లను కలిగి ఉంది. ఇందులో సేఫ్టీ గేర్‌లో ఏడు ఎయిర్‌ బ్యాగ్‌లు, యాక్టివ్‌ పార్కింగ్‌ అసిస్ట్‌, 360 డిగ్రీ కెమెరా, కారు టు ఎక్స్‌ కమ్యూనికేషన్‌ ఇంకా అనేక అధునాతన భద్రతా ఫీచర్లను కలిగి ఉంది. SUV అటెన్షన్‌ అసిస్ట్‌, యాక్టివ్‌ బ్రేక్‌ అసిస్ట్‌. బ్లైండ్‌ స్పాట్‌ అసిస్ట్‌, యాక్టివ్‌ బ్రేక్‌ అసిస్ట్‌ ఇంకా యాక్టివ్‌ లేన్‌ కీపింగ్‌ అసిస్ట్‌ వంటి కొన్ని ADAS ఫీచర్లను కలిగి ఉంది.

2023-Mercedes-GLC

ఇంజిన్: 2023 మెర్సిడెస్ GLC రెండు టర్బోచార్జ్డ్ ఇంజన్ ఎంపికలతో (పెట్రోల్ మరియు డీజిల్) తో భారత్‌లోకి మెర్సెడెస్‌ సంస్థ తీసుకువస్తుంది. రెండూ 2.0-లీటర్ల డిస్‌ప్లేస్ మరియు మైల్డ్-హైబ్రిడ్ సిస్టమ్, 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో రానుంది. దీంతోపాటు పవర్‌ఫుల్‌ ఫోర్-వీల్-డ్రైవ్‌తో వస్తాయి. GLC 220d 4Matic 1,993cc టర్బోచార్జ్డ్ ఫోర్-పాట్ డీజిల్ ఇంజిన్‌ను ఉపయోగిస్తుంది. ఇది 194.4bhp మరియు 440Nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది 19.47km/l మైలేజీని అందిస్తుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, August 8, 2023, 12:16 [IST]
English summary
2023 mercedes glc benz suv car full review video
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+