లగ్జరీ కార్లకు కలిసొచ్చిన 2023 సంవత్సరం.. 100 శాతం వృద్ధితో టాప్‌ ప్లేస్‌, EV రంగంలోనూ అదే దూకుడు

ఆటోమొబైల్ పరిశ్రమకు 2023 సంవత్సరం బంపర్ ఇయర్‌గా మారిందనడంలో సందేహం లేదు. కారణం ఈ ఏడాది కార్ల విక్రయాలు గణనీయంగా పెరిగాయి. ఈ క్రమంలో ఈ ఏడాది సాధారణ కార్లతో పాటు లగ్జరీ కార్లకు కూడా విపరీతంగా డిమాండ్ పెరిగింది. ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు సైతం గతేడాదితో పోలిస్తే 50 శాతం పెరిగినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.

భారత మార్కెట్లో మారుతి సుజుకి తర్వాత అతి పెద్ద సంఖ్యలో కార్లను విక్రయిస్తున్న మరో సంస్థ హ్యుందాయ్‌ మోటార్స్‌. ఈ రెండు కంపెనీలు తక్కువ ధరకే కార్లను విక్రయిస్తుండగా.. మరోవైపు లగ్జరీ కార్లకు కూడా ఈ ఏడాది డిమాండ్‌ బాగా పెరిగింది. ఈ సంవత్సరం BMW, Mercedes-Benz మరియు Audi అమ్మకాల వృద్ధి రెండింతలు పెరిగినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.

BMW-3-Series

అయితే తక్కువ ధర కలిగిన కార్ల తయారీదారులు మరియు లగ్జరీ కార్ల తయారీదారులు ఒకే ఫార్ములాతో పనిచేస్తున్నారు. అదే ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసే దిశగా అడుగులు వేయడం. ప్రస్తుతం భారతదేశంలో టాటా టియాగో EV, MG కామెట్ EV, Audi Q8, BMW i7 వంటి కార్లు ఎలక్ట్రిక్ వెర్షన్‌లో బాగా సేల్‌ అవుతున్నాయు. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు కూడా అదే స్థాయిలో అమ్ముడవుతున్నాయి.

2023 లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల సెగ్మెంట్‌లో అనేక కొత్త టూ వీలర్లు లాంచ్‌ అయ్యాయి. ప్రధానంగా TVS X, Ultra Violet 77 మరియు అనేక ఇతర వాహనాలు విడుదలయ్యాయి. ఈ అమ్మకాల జోరు 2024లో కొనసాగుతుందా.?? దీన్ని కొనసాగించడానికి వాహన తయారీదారులు ఏమి చేయాలి? ఈ ట్రెండ్‌కి కారణం ఏమిటనే దానిపై పూర్తి సమాచారం ఈ కథనంలో..

2022-MG-ZS-EV

కరోనా మహమ్మారి ముగిసిన తర్వాత లగ్జరీ వాహనాల(2023 Car Sales Report) విభాగం అభివృద్ధి దిశగా దూసుకెళ్తోంది. 2023 సంవత్సరంలో రెట్టింపు లక్ష్య వృద్ధిని పొందింది. 2024లో కూడా ఇదే అభివృద్ధి కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 2024లో, 2023 కంటే ఎక్కువ అమ్మకాలు నమోదయ్యే సూచనలు ఉన్నాయి. వాహన తయారీదారులు 2020లో విభిన్న సాంకేతికతలతో కూడిన వివిధ రకాల వాహనాలను విడుదల చేసే యోచనలో ఉన్నారు.

భారత మార్కెట్లో ఆటో మేకర్లు కొత్త ఉత్పత్తులను ప్రవేశపెడితే ఆటోమేటిక్‌గా విక్రయాల్లో కూడా వృద్ధి కనపడుతుంది. ఈ కారణంగానే 2024 లో కూడా అద్భుతమైన సేల్స్‌ను పొందవచ్చని తయారీదారులు భావిస్తున్నారు. అదే సమయంలో, ఎలక్ట్రిక్ వాహనాల విభాగం కూడా 2023లో మంచి సేల్స్‌ను నమోదు చేసుకోగా.. గత 11 నెలల్లో 50 శాతం వృద్ధిని సాధించింది.

Mercedes-Benz-C-Class

భారత మార్కెట్లో 2 వీలర్, 3 వీలర్, ప్యాసింజర్ కార్, కమర్షియల్ మరియు బస్సులు అన్ని విభాగాల్లో ఆశాజనకమైన వృద్ధిని కొనసాగిస్తున్నాయి. కొత్త సంవత్సరంలో ప్రధానమంత్రి ఇ-బస్ పథకం కింద ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేసేందుకు కేంద్రం ఆసక్తిగా ఉంది. ఈ క్రమంలో వచ్చే ఏడాది సుమారు 10,000 బస్సులు అందుబాటులోకి వస్తాయి.

దేశవ్యాప్తంగా 169 నగరాల్లో ఈ బస్సులు సేవలందించనున్నాయి. ఈ ఎలక్ట్రిక్‌ బస్సులను ప్రభుత్వ, ప్రైవేట్‌తో కలిసి నడపేలా ప్రణాళికలకు సిద్ధం చేస్తున్నారు. ఇదంతా ఓ వైపు అయితే.. మరోవైపు లగ్జరీ కార్ల అమ్మకాలు అనూహ్యమైన వృద్ధిని సాధించినట్లుగా నివేదికలు సూచిస్తున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి దాదాపు 100 శాతం వృద్ధిని నమోదు చేసుకునేలా ఉన్నాయి.

Mahindra-XUV400

ఆడి కార్ల విషయానికొస్తే.. ఇది మొదటి 9 నెలల్లోనే 88 శాతం అమ్మకాల వృద్ధిని నమోదు చేసుకుంది. విలాసవంతమైన వాహనాల అధిక విక్రయాలు ద్వారా భారతదేశంలో ప్రజల ఆదాయం పెరిగినట్లుగా తెలుస్తోంది. ఈ కారణంగా ఈ ఏడాదిలో లగ్జరీ కార్లు విపరీతంగా అమ్ముడయ్యాయి. ప్రధానంగా ఆడి క్యూ3 స్పోర్ట్‌బ్యాక్ మరియు క్యూ8 స్పోర్ట్స్ ఇట్రాన్ బాగా సేల్‌ అవుతున్నాయి.

తరువాత, బ్యాటరీ మార్పిడి సాంకేతికత ద్వారా 2024లో ఎలక్ట్రిక్ వాహనాల ప్రపంచంలో భారీ వృద్ధిని కనబరిచే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వ విధాన మద్దతుతో, చాలా కంపెనీలు బ్యాటరీ మార్పిడి టెక్నాలజీతో వాహనాలను అభివృద్ధి చేయాలని చూస్తున్నాయి. దీని ద్వారా ఎలక్ట్రిక్ వాహనాల ప్రపంచంలో భారీ మార్పులు రానున్నాయి.

Tata-Nexon-EV

మొత్తంమీద, అధిక సంఖ్యలో కార్లను విక్రయించే హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్ ఈ 2023 అమ్మకాల ఆధారంగా 2024లో అమ్మకాల్లో క్షీణతను ఎదుర్కొనే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ సెగ్మెంట్‌లోని కార్ల అమ్మకపు ధర ఎక్కువగా ఉండటంతో, కస్టమర్లు వీటికి దూరంగా ఉంటున్నారు. దీంతో ఈ విభాగంలో భారీ క్షీణత ఏర్పడటం ద్వారా ప్రజలు ఎక్కువగా SUV విభాగానికే ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Saturday, December 30, 2023, 14:16 [IST]
English summary
2023 sales report luxury cars demands double and 50 percent growth in ev sector
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+