టాటా హారియర్‌ ఫేస్‌లిఫ్ట్‌ డెలివరీలు ప్రారంభం.. సేఫ్టీ పరంగా ది బెస్ట్‌ కారు, ఫుల్‌ ఖుషీలో కస్టమర్లు.!!

భారత మార్కెట్లో టాటా మోటార్స్‌ కార్లకు మంచి ఆదరణ ఉంది. ఇటీవల ఈ సంస్థ అప్‌డేటెడ్‌ టాటా హారియర్ SUV ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. నేటి(నవంబర్‌ 8) నుంచి టాటా హారియర్ డెలివరీలు ప్రారంభమయ్యాయి. శక్తివంతమైన SUV గా Harrier గుర్తింపు పొందడంతో.. ఈ కారును చాలా మంది బెస్ట్‌ ఆప్షన్‌గా భావిస్తున్నారు.

కొత్త టాటా హారియర్ SUV వేరియంట్‌లను బట్టి రూ. 15.49 లక్షల నుండి రూ. 26.44 లక్షల వరకు ధరలు ఉన్నాయి. ఇవన్నీ ఎక్స్ షోరూమ్‌ ధరలు. కస్టమర్లు టాటా షోరూమ్ లేదా ఆన్‌లైన్ పోర్టల్‌ను సందర్శించి ఈ కారును బుక్‌ చేసుకోవచ్చు. దీనికి ముందుగా రూ.25,000 చెల్లించాల్సి ఉంటుంది.

Tata-Harrier-Facelift

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న వివిధ డీలర్‌షిప్‌లలో అప్‌డేట్ చేయబడిన టాటా హారియర్ డెలివరీలు ప్రారంభమయ్యాయి. టాటా హారియర్‌ను అందుకున్న కస్టమర్లు సంతోషంగా ఉన్నారని తెలుస్తోంది. కాగా పాత మోడల్‌తో పోలిస్తే, కొత్త టాటా హారియర్‌ ఎస్‌యూవీ డిజైన్‌లో చాలా మార్పులను చేశారు. ప్రధానంగా కొత్త గ్రిల్, స్ప్లిట్ హెడ్‌లైట్లు. గ్రిల్ పైన ఫుల్‌ వైడ్‌ LED లైట్ బార్‌ను అమర్చారు.

ఇంకా టాటా హారియర్‌ వేరియంట్‌ ప్రకారం 18, 19 అంగుళాల అల్లాయ్ వీల్స్ అందుబాటులో ఉన్నాయి. కాగా కారు వెనుక భాగాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. కొత్త అప్‌డేటెడ్‌ టాటా హారియర్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో వేరియంట్‌లను బట్టి ఫీచర్లు ఉంటాయి. ముఖ్యంగా 10.25 అంగుళాల లేదా 12.3 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్ సిస్టమ్ ఉంటుంది.

Tata-Harrier-Facelift

LED యాంబియంట్ లైటింగ్, 10.25-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, కొత్త 4-స్పోక్ స్టీరింగ్ వీల్‌ను కలిగి ఉంది. డ్యూయల్‌-జోన్ క్లైమేట్ కంట్రోల్, 360-డిగ్రీ కెమెరా, సన్‌రూఫ్‌ మరిన్ని ప్రత్యేకతలు. ఇక పవర్‌ట్రెయిన్ విషయానికొస్తే.. హారియర్‌ 6-స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఇది 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. 170 hp శక్తిని, 350 Nm గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది.

టాటా హారియర్‌ ఫేస్‌లిఫ్టెడ్‌లో ఎకో, సిటీ మరియు స్పోర్ట్స్ ఇలా మూడు డ్రైవింగ్ మోడ్ ఆప్షన్‌లు ఇచ్చారు. కలర్స్‌ విషయానికొస్తే ఇందులో లూనార్ వైట్, పెబుల్ గ్రే, సన్‌లైట్ ఎల్లో, కోరల్ రెడ్‌తో సహా 6 ఆకర్షణీయమైన రంగులు అందుబాటులో ఉన్నాయి. ఇక మార్కెట్లో హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, MG హెక్టర్, జీప్ కంపాస్ నుంచి కొత్త టాటా హారియర్ SUV బలమైన పోటీని కలిగి ఉంది.

సేఫ్టీ ఫీచర్ల పరంగా చూసుకుంటే.. టాటా హారియర్ అత్యుత్తమంగా ఉంది. గ్లోబల్‌ NCAP క్రాష్‌ టెస్ట్‌లో అడల్ట్ ప్రొటెక్షన్ విభాగంలో 34కి 33.05 స్కోర్‌ను సాధించింది. 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందింది. ఇంకా ఇందులో 7 ఎయిర్‌బ్యాగ్‌లు, ADAS, హిల్-హోల్డ్ కంట్రోల్, 3-పాయింట్ సీట్ బెల్ట్ రిమైండర్ వంటి అధునాతన సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

కాగా దీపావళికి ముందే కొత్త టాటా హారియర్‌ ఎస్‌యూవీ డెలివరీలు ప్రారంభం కావడంతో కస్టమర్లు ఫుల్‌ ఖుషీలో ఉన్నారు. అత్యాధునిక ఫీచర్లు, సేఫ్టీ ఫీచర్లతో విడుదలైన ఈ కారు.. డిజైన్‌ పరంగానూ విపరీతంగా ఆకట్టుకుంటోంది. రాబోయే రోజుల్లో ఈ కారుకు మరింత డిమాండ్ పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

More from DriveSpark

Article Published On: Wednesday, November 8, 2023, 21:10 [IST]
English summary
2023 tata harrier facelift deliveries start in india price design features and performan here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+