2023 Tata Harrier Facelift సరికొత్త అప్‌డేట్‌లతో వస్తున్న టాటా హారియర్‌ ఫేస్‌లిఫ్ట్‌.. ఫుల్‌ రివ్యూ వీడియో

ప్రముఖ స్వదేశీ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ ఇటీవల 2023 టాటా హారియర్ SUVని ఆవిష్కరించింది. కొత్త Tata Harrier SUV మిడ్-సైకిల్ ఫేస్‌లిఫ్ట్‌తో ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్‌లో అధునాతన మార్పులను పొందింది. ఈ కొత్త హారియర్ SUV డ్రైవింగ్ అనుభవంపై పూర్తి రివ్యూను ఈ వీడియోలో అందిస్తున్నాం.

ఇక కొత్త 2023 టాటా హారియర్‌ డిజైన్‌ను పరిశీలిస్తే ఇది Curvv కాన్సెప్ట్‌ డిజైన్‌కు అప్‌డేట్‌ అయినట్లుగా కనిపిస్తుంది. మునుపటి వెర్షన్‌తో పోలిస్తే ముందు, వెనుక భాగంలో చాలా మార్పులు చేశారు. ఫ్రంట్ ఎండ్ మరింత నిటారుగా కనిపించడంతో పాటు బానెట్‌పై LED DRL రన్ అవుతుంది. కొత్త 2023 టాటా హారియర్‌లో 17, 18, 19 అంగుళాల అల్లాయ్ వీల్స్ ఆప్షన్స్‌ ఉన్నాయి. వేరియంట్‌ను బట్టి వీల్స్‌ సైజ్‌ ఉంటాయి.

ఇక కొత్త టాటా హారియర్‌ ఫేస్‌లిఫ్ట్‌ ఇంటీరియర్‌లో చాలా మార్పులు చేశారు. ఎక్స్‌టీరియర్‌ కలర్‌కు మ్యాచ్‌ అయ్యేలా కొత్త డ్యాష్ బోర్డ్‌, గ్రాబ్ హ్యాండిల్‌లు, సెంటర్ కన్సోల్ స్పోర్ట్‌ను అదే కలర్‌తో ఫినిషింగ్‌ చేశారు. మల్టీ-లేయర్ డాష్ దాని మధ్యలో 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, 10-స్పీకర్ JBL సరౌండ్ సౌండ్ సిస్టమ్‌తో జత చేయబడింది. వైర్‌లెస్ Apple CarPlay మరియు Android Auto కనెక్టివిటీని అందిస్తుంది.

2023-Tata-Harrier-Facelift-SUV

ఇంకా టాటా హారియర్‌ ఫేస్‌లిఫ్ట్‌లో సేఫ్టీ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో మునుపటి వెర్షన్ మాదిరిగానే ప్రత్యేక RED డార్క్ ఎడిషన్‌లో 11 ఫీచర్లతో ADAS సిస్టమ్‌లను కలిగి ఉండటం మరో ప్రత్యేకత. ఇంకా గరిష్ఠంగా 7 ఎయిర్‌బ్యాగ్‌లు, ఆటో హెడ్‌ల్యాంప్‌లు, రెయిన్ సెన్సింగ్ వైపర్‌లు, ఎయిర్ ప్యూరిఫైయర్, ఫ్రంట్, రియర్ పార్కింగ్ సెన్సార్‌లు, 360-డిగ్రీ యాంగిల్‌ కెమెరా, ABS విత్ EBD, ESP వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Saturday, October 14, 2023, 13:04 [IST]
English summary
2023 tata harrier facelift suv features design specs and performance full review video
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+