Tata Harrier: సూపర్‌ మైలేజ్‌తో వచ్చేస్తున్న టాటా హారియర్‌ ఫేస్‌లిఫ్ట్‌.. ఇక ప్రత్యర్థి కంపెనీలకు గట్టి పోటీ.!!

దేశీయ మార్కెట్లో ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ ఇటీవల 2023 టాటా హారియర్ SUVని ఆవిష్కరించింది. త్వరలో ఈ కారు విడుదల కానుంది. ఈ క్రమంలో కొత్త టాటా హారియర్‌ ఫేస్‌లిఫ్ట్‌(Tata Harrier Facelift) బుకింగ్‌లు ప్రారంభం కాగా కొనుగోలు చేయాలనుకునేవారు ఆన్‌లైన్‌ లేదా అధీకృత డీలర్‌షిప్‌ను సంప్రదించవచ్చు.

కాగా 2023 టాటా హారియర్ SUV ఫేస్‌లిఫ్ట్(2023 Tata Harrier Facelift SUV) అదే 2.0 లీటర్, టర్బోచార్జ్డ్, 4 సిలిండర్, డీజిల్ ఇంజిన్‌తో పనిచేస్తుందని టాటా మోటార్స్‌ వెల్లడించింది. ఇంకా ఈ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది.

2023-Tata-Harrier-Facelift

అయితే ప్రీ-ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో అదే పవర్‌ట్రెయిన్ సెటప్ ఉన్నప్పటికీ, కొత్త హారియర్ ఫేస్‌లిఫ్ట్ మైలేజ్ విషయంలో మాత్రం కస్టమర్లు సంతృప్తి చెందవచ్చు. దీనికి సంబంధించి ఆసక్తికర సమాచారం విడుదలైంది. మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో ఉన్న టాటా హారియర్ ఫేస్‌లిఫ్ట్ SUV లీటరుకు 16.8 కి.మీ మైలేజ్‌ని అందిస్తుంది. ఇది దాని ముందున్న వెర్షన్‌తో పోలిస్తే 0.45 కిమీ మైలేజ్‌ని ఎక్కువ అందిస్తుంది.

కొత్త 2023 టాటా(Tata Motors) హారియర్ SUV ఫేస్‌లిఫ్ట్‌లో కొన్ని డిజైన్‌ మార్పులు, ఫీచర్లు అప్‌డేట్‌ అయ్యాయని చెప్పవచ్చు. టాటా హారియర్‌లో మోడిఫైడ్‌ ఫ్రంట్ ఫాసియాను కలిగి ఉండటం ప్రత్యేకత. ఇందులో కొత్త గ్రిల్, సొగసైన ఇండికేటర్లు, ఇంకా Nexon EV వంటి నిలువుగా మౌంటెడ్ స్ప్లిట్ LED హెడ్‌ల్యాంప్‌లు మరియు LED లైట్ బార్ చుట్టూ సొగసైన కొత్త LED డేటైమ్ రన్నింగ్ లైట్లు ఉన్నాయి.

2023-Tata-Harrier-Facelift

ఇంకా కొత్త టాటా హారియర్‌ ఫేస్‌లిఫ్ట్‌ SUV వెనుక భాగంలో కనెక్ట్ చేయబడిన LED టెయిల్ ల్యాంప్ సెటప్‌ను కలిగి ఉంది. టాటా హారియర్ బ్యాడ్జ్ కోసం ఫాంట్‌ను సవరించారు. ఇందులో టెయిల్ ల్యాంప్‌లను కూడా ఆకర్షణీయంగా మార్చారు. సవరించిన బంపర్‌తో పాటు స్కిడ్ ప్లేట్‌ను కూడా పొందుతుంది.

కొత్త టాటా హారియర్ SUV లేయర్డ్ డిజైన్‌లతో అప్‌డేటెడ్‌ డాష్‌బోర్డ్‌ను కలిగి ఉంది. టాటా హారియర్‌ ఫేస్‌లిఫ్ట్‌ క్యాబిన్‌ను పరిశీలిస్తే వివిధ రంగులతో ఆకర్షణీయంగా వస్తుంది. ఇందులో ఇల్యూమినేటెడ్ టాటా లోగోతో కొత్త 4-స్పోక్ స్టీరింగ్ వీల్‌తో వస్తుంది. మొత్తంగా ఎక్స్‌టీరియర్‌ను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.

2023-Tata-Harrier-Facelift

ఇక కొత్త టాటా హారియర్‌ ఫేస్‌లిఫ్ట్‌ ఫీచర్లను పరిశీలిస్తే ఈ కొత్త SUV లోపలి భాగంలో అనేక ఫీచర్లు ఉన్నాయి. పెద్ద 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ మరియు డాష్‌బోర్డ్ అంతటా యాంబియంట్ లైటింగ్ స్ట్రిప్‌ను కలిగి ఉంది.

ఇంకా టాటా హారియర్ ఫేస్‌లిఫ్ట్ డిస్‌ప్లేతో డ్రైవ్ మోడ్‌ల కోసం కొత్త డయల్‌ని కలిగి ఉంది. అదనంగా డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేసేలా ఫ్రంట్ సీట్లు, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, క్రూయిజ్ కంట్రోల్ ఇంకా పనోరమిక్ సన్‌రూఫ్‌తో వస్తుంది.

2023-Tata-Harrier-Facelift

టాటా హారియర్‌ ఫేస్‌లిఫ్ట్‌ 2023 లో సేఫ్టీ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 7 ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS, 360 డిగ్రీ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), అప్‌డేటెడ్‌ ADAS టెక్ ఉన్నాయి. అయితే ఇందులో అదనంగా ADAS అనుకూల క్రూయిజ్ కంట్రోల్‌ను కలిగి ఉంది. ఈ SUVని కస్టమర్లు రూ. 25,000 టోకెన్ మొత్తాన్ని చెల్లించి బుకింగ్ చేసుకోవచ్చు.

2023-Tata-Harrier-Facelift

More from DriveSpark

Article Published On: Tuesday, October 10, 2023, 9:50 [IST]
English summary
2023 tata harrier suv facelift mileage revealed ahead of launch here are the full details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+