2023 Tata Safari Review video 2023 అదిరిపోయే ఫీచర్లు, అప్‌డేట్లతో వస్తున్న టాటా సఫారీ ఫుల్‌ రివ్యూ వీడియో

ప్రముఖ స్వదేశీ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్‌ దాదాపు రెండున్నరేళ్ల తర్వాత తన టాటా సఫారీ కారును అప్‌డేట్ చేసింది. ఇందులో కొత్త టెక్నాలజీ ఫీచర్లతో పాటు ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్‌లో చాలా మార్పులను చేసింది. అందుకు సంబంధించిన పూర్తి వివరాలను మా డ్రైవ్‌స్పార్క్‌ టీమ్‌ చేసిన రివ్యూ వీడియో ద్వారా మీకు అందిస్తున్నాం.

కొత్త టాటా సఫారీలో డిజైన్‌ విషయానికి వస్తే ఎక్స్‌టీరియర్‌ మిడ్‌- సైకిల్‌ ఫేస్‌లిఫ్ట్‌ మాదిరిగా మార్పులు చేశారు. అప్‌డేటెడ్‌ కొత్త పారామెట్రిక్‌ గ్రిల్‌తో పాటు ఎగువ భాగంలో స్పోర్ట్స్‌ బాడ్‌- కలర్‌ ఇన్వర్టులు, టాటా బ్యాడ్జ్‌, దిగువ భాగంలో రాడార్‌ సెన్సార్‌తో పాటు బ్లాక్‌ ఇన్‌స్టర్‌లు, ముందు భాగంలో సిల్వర్‌ బాష్‌ ప్లేట్‌పైన ఎయిర్‌ ఇన్‌టేక్‌ ఉన్నాయి.

కొత్త 2023 టాటా సఫారీ ఇంటీరియర్‌ను అధునాతమైన టెక్నాలజీతో పాటు క్యాబిన్‌ను అత్యంత విశాలంగా తీర్చిదిద్దారు. పెద్ద 12.3-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లేతో పాటు 360-డిగ్రీ కెమెరా ఉంది. ఇది కొత్త డ్యాష్‌బోర్డ్ వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీకి సపోర్ట్‌గా ఉంటుంది. డ్యాష్‌బోర్డ్‌లో పెద్ద 10.25-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లేను ఆకర్షణీయంగా రూపొందించారు. నావిగేషన్‌తో సహా ప్రయాణంలో మీకు కావాల్సిన మొత్తం సమాచారాన్ని దీని ద్వారా పొందవచ్చు.

2023-Tata-Safari

స్టెల్లాంటిస్-సోర్స్డ్ 2.0-లీటర్ క్రియోటెక్, టర్బోచార్జ్డ్ ఇన్‌లైన్, ఫోర్-పాట్ డీజిల్‌ను కొత్త టాటా సఫారీ ఇంజిన్లో అమర్చారు. డీజిల్ ఇంజిన్ 3,750 rpm వద్ద 168bhp, 1,750 మరియు 2,500rpm మధ్య 350 Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా హ్యుందాయ్ నుంచి తీసుకున్న 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్‌తో జత చేశారు. ఇందులో మూడు డ్రైవింగ్‌ మోడ్‌లు ఉన్నాయి. ఎకో, సిటీ, స్పోర్ట్ మోడ్‌ ఆప్షన్లు.

More from DriveSpark

Article Published On: Sunday, October 15, 2023, 17:15 [IST]
English summary
2023 tata safari suv design features engine performance full review video
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+