Year Ending Discounts ఈ ప్రముఖ బ్రాండ్ల CNG కార్లపై అదిరిపోయే ఆఫర్లు.. ఒక్కో మోడల్‌పై భారీ తగ్గింపులు.!!

కారు కొనాలంటే పండుగ సీజన్‌ తర్వాత మంచి టైమ్ ఏదంటే ఇయర్‌ ఎండింగ్‌.. అదే డిసెంబర్‌ నెల. కంపెనీలు తమ వద్ద మిగిలి ఉన్న స్టాక్‌లను విక్రయించడానికి ఇంకా అమ్మకాలను పెంచుకోవడానికి వార్షిక ముగింపు ఆఫర్‌లను ఇచ్చేది ఈ నెలలోనే.. అయితే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతుండటంతో చాలా మంది కొత్త కార్లను కొనడానికి ఆసక్తి చూపించరు.

భారత మార్కెట్లో ICE వాహనాలకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్‌ వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. కానీ సాంప్రదాయ కార్ల ధరలో వీటిని కొనుగోలు చేయలేరు. అలాంటి వారి కోసం సీఎన్‌జీ కార్లు బెస్ట్‌ ఆప్షన్‌. పెట్రోల్, డీజిల్ వాహనాలతో పోలిస్తే, సీఎన్‌జీ వాహనాలు అత్యధిక మైలేజ్‌ను ఇస్తాయి.

Maruti-Celerio

ఈ నేపథ్యంలో మారుతీ సుజుకి, హ్యుందాయ్, టాటా మోటార్స్ మరియు టయోటా వంటి కార్ల తయారీదారులు తమ CNG టెక్నాలజీ కార్లపై మంచి తగ్గింపులను ఈ డిసెంబర్‌ నెలలో అందిస్తున్నారు. మీరు కొత్త కారును కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లయితే, ఈ నెలలో కొనుగోలు చేయడానికి ఉత్తమమైన CNG మోడల్స్ వివరాలు ఇక్కడ అందిస్తున్నాం.

భారత మార్కెట్లో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి.. అత్యధిక సంఖ్యలో CNG కార్లను తయారుచేసి విక్రయిస్తోంది. అత్యంత డిమాండ్ ఉన్న స్విఫ్ట్‌(Maruti Suzuki Swift)ను ఈ నెలలో రూ.25,000 నగదు తగ్గింపుతో సొంతం చేసుకోవచ్చు.

Maruti-S-Presso

అంతేకాకుండా సెలెరియో(Celerio), S-ప్రెస్సో(S Presso) CNG వేరియంట్‌లపై రూ. 30,000 వరకు నగదు తగ్గింపుతో పాటు రూ. 20,000 ఎక్స్‌ఛేంజ్‌ బోనస్ కూడా పొందవచ్చు. కుటుంబ కారుగా ప్రసిద్ధి చెందిన వ్యాగన్ఆర్(WagonR) CNGపై డిసెంబర్‌లో రూ. 25,000 నగదు తగ్గింపును ప్రకటించింది. ఇంకా కస్టమర్లకు రూ. 20,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా పొందవచ్చు.

ప్రముఖ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ బాలెనో(Baleno) CNG పై ఇయర్‌ ఎండింగ్‌ ఆఫర్‌ కింద రూ. 25,000 నగదు తగ్గింపును పొందవచ్చు. దీనితో పాటు రూ. 10,000 ఎక్స్‌ఛేంజ్‌ బోనస్ లేదా రూ. 15,000 స్క్రాపేజ్ ప్రయోజనం మరియు రూ. 2,000 కార్పొరేట్ తగ్గింపును సంస్థ అందిస్తోంది.

Maruti-WagonR

దక్షిణ కొరియాకు చెందిన హ్యుందాయ్ సీఎన్‌జీ కార్లపై ఆకర్షణీయమైన ఇయర్‌ ఎండింగ్‌ ఆఫర్లను అందిస్తోంది. ఈ నెలలో Grand i10 Nios CNGపై రూ. 35,000 వరకు నగదు తగ్గింపును ప్రకటించింది. కొనుగోలుదారులు రూ. 10,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌గా మరియు రూ. 3,000 కార్పొరేట్ డిస్కౌంట్‌ను పొందవచ్చు. మొత్తంగా రూ. 48,000 వరకు ఆదా చేసుకోవచ్చు.

హ్యుందాయ్ నుంచి మరో CNG కారు ఆరా(Aura)పై కూడా ఆకర్షణీయమైన తగ్గింపు ప్రయోజనాలు ఉన్నాయి. ఈ నెలలో ఆరా కొనుగోలుపై రూ. 33,000 వరకు ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో రూ. 20,000 నగదు తగ్గింపు, రూ.10,000 ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు రూ.3,000 వరకు కార్పొరేట్ తగ్గింపును సంస్థ అందిస్తోంది.

ప్రముఖ దేశీయ బ్రాండ్‌ టాటా మోటార్స్ ఈ క్యాలెండర్ సంవత్సరంలో ఆల్ట్రోజ్ సీఎన్‌జీ మరియు పంచ్ సీఎన్‌జీతో సహా భారీ కొత్త మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ నెలలో Altroz ​​CNGపై రూ. 25,000 వరకు తగ్గింపు ఆఫర్లను పొందవచ్చు. వీటిలో రూ. 10,000, నగదు తగ్గింపు రూ., రూ. 10,000 ఎక్స్‌ఛేంజ్‌ బోనస్ మరియు రూ. 5,000 కార్పొరేట్ తగ్గింపు ఉన్నాయి.

Altroz-Baleno

టియాగో(Tiago) CNG ట్విన్-సిలిండర్ వెర్షన్‌ను కొనుగోలు చేసే వారు రూ. 50,000 వరకు తగ్గింపు ప్రయోజనాలు పొందవచ్చు. వీటిలో రూ. 30,000 నగదు తగ్గింపు, రూ. 15,000 ఎక్స్చేంజ్ బోనస్, రూ. 5,000 కార్పొరేట్ తగ్గింపు ఉన్నాయి. Tigor CNG వేరియంట్‌పై ఇవే రకమైన ఆఫర్లు ఉన్నాయి.

ఇక టయోటా మోటార్స్‌ కూడా ఈ నెలలో తగ్గింపు ప్రయోజనాలను అందిస్తోంది. మారుతి సుజుకి భాగస్వామ్యంతో విడుదలైన గ్లాన్జా ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ CNG వేరియంట్‌లపై ఇయర్‌ ఎండింగ్‌ ఆఫర్‌ ఉంది. రూ. 20,000 నగదు తగ్గింపు, రూ. 20,000 ఎక్స్‌ఛేంజ్‌ బోనస్ ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Tuesday, December 19, 2023, 17:42 [IST]
English summary
2023 year ending offers on cng cars from maruti hyundai tata and toyota companies
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+