కొత్త మారుతి సుజుకి స్విఫ్ట్‌లోని ADAS ఫీచర్లు చూశారా.. భారత్‌లో ఇలాంటి కారు తప్పక ఉండాల్సిందే.!!
ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి నుంచి కొత్త స్విఫ్ట్ 2024(Maruti Suzuki Swift 2024) ఈ సంవత్సరం ప్రారంభంలో జపాన్ మొబిలిటీ షోలో ప్రదర్శించారు. అత్యాధునిక సేఫ్టీ ఫీచర్లతో పాటు అధునాతన డ్రైవర్ సహాయ వ్యవస్థ(ADAS)ల శ్రేణితో రూపొందించారు. ఈ క్రమంలో కొత్త మారుతి సుజుకి స్విఫ్ట్‌లోని ADAS ఫీచర్లేంటో చూద్దాం..
2024 మారుతి సుజుకి స్విఫ్ట్ డ్యూయల్-సెన్సార్ బ్రేక్ సపోర్ట్(Dual Sensor Brake Support) ఫీచర్‌తో అమర్చబడి ఉంటుంది. ఈ ఫీచర్ కెమెరా, లేజర్ సహాయంతో ఇతర వాహనాలు, పాదచారులను గుర్తిస్తుంది. దీంతో ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంది. డ్యూయల్ సెన్సార్ బ్రేక్ సపోర్ట్ ఫీచర్.. డ్రైవర్‌కు హెచ్చరికలను పంపడం, బ్రేకింగ్‌లో సహాయం చేయడం ఇంకా అవసరమైనప్పుడు ఆటోమేటిక్‌గా బ్రేక్‌లు వర్తించేలా చేస్తుంది.

ఇంకా కొత్త మారుతి సుజుకి స్విఫ్ట్ కారులో మరో ADAS ఫీచర్.. అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్(Adaptive Cruise Control). ఈ ఫీచర్ ద్వారా కారు వేగాన్ని నియంత్రిస్తూ ముందు వెనుకా వచ్చే వాహనాల మధ్య సురక్షితమైన దూరాన్ని మెయింటైన్ చేస్తుంది. టర్నింగ్‌లు తీసుకునేటప్పుడు, లేన్‌లను మార్చేటప్పుడు డ్రైవర్ ఫ్రెండ్లీగా ఈ సెన్సార్ ఆన్ అవుతుంది.
కొత్త మారుతి సుజుకి స్విఫ్ట్‌లో డ్రైవర్ మానిటరింగ్ సిస్టమ్(Driver Monitoring System) కూడా చూడవచ్చు. ఇందులో ఒక కెమెరా, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో ఉంటుంది. ఇది డ్రైవర్ ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్, కంటి కదలికలు, డ్రైవర్ ఎటువైపు చూస్తున్నాడనేది నిశితంగా పరిశీలిస్తుంది. డ్రైవింగ్‌లో డ్రైవర్ అలసటగా ఉన్నా, ఏకాగ్రత లేనట్లుగా ఉన్నా.. హెచ్చరికలు జారీ చేస్తుంది.

2024 మారుతి సుజుకి స్విఫ్ట్‌లో హెడ్‌లైట్ కంట్రోల్ సిస్టమ్(Headlight Control System)ను కూడా ఇన్‌స్టాల్ చేశారు. డ్రైవర్‌కు విజిబిలిటీ పెంచడం కోసం హై మరియు లో బీమ్‌లను ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తుంది. మోనోక్యులర్ కెమెరా మరియు మిల్లీమీటర్ వేవ్ రాడార్ ద్వారా ఈ సిస్టమ్ పనిచేస్తుంది.
దీంతో పాటు, 2024 సుజుకి స్విఫ్ట్ SUV లో లేన్-కీప్ ఫంక్షన్(Lane Keep Function)ను కూడా కలిగి ఉందనే చెప్పొచ్చు. ఈ ఫీచర్ డ్రైవింగ్ చేసేటప్పుడు.. ఓ లేన్‌ను మెయింటైన్ చేసేలా ఆటోమేటిక్‌గా స్టీరింగ్‌ను సర్దుబాటు చేస్తుంది. అవసరమైన సందర్భాల్లో డ్రైవర్‌కు స్టీరింగ్ సర్దుబాటులో సహాయం చేస్తుంది.

కొత్త మారుతి సుజుకి స్విఫ్ట్ ADAS ఫీచర్లలో మరో ముఖ్యమైన ఫీచర్... కారు రోడ్ సైన్ రికగ్నిషన్ సిస్టమ్(Road Sign Recognition System). ఇది ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌లో పలు సంకేతాల ద్వారా డ్రైవర్‌ను హెచ్చరిస్తుంది. నో-ఎంట్రీ వార్నింగ్, రెడ్ లైట్ హెచ్చరికలపై డ్రైవర్‌ను అలర్ట్ చేస్తుంది.
వీటితో పాటు బ్లైండ్ స్పాట్ మానిటర్(Blind Spot Monitor), రియర్ క్రాస్-ట్రాఫిక్ అలర్ట్(Rear Cross Traffic Alert), స్టార్ట్ నోటిఫికేషన్ సౌండ్, 360-డిగ్రీ కెమెరా సిస్టమ్, గేర్ షిఫ్ట్ లోపాల కారణంగా ఇంజిన్ అవుట్‌పుట్‌ని తగ్గించే ఫంక్షన్‌లు వంటి ఇతర సేఫ్టీ సపోర్ట్ ఫీచర్‌లు కొత్త మారుతి సుజుకి స్విఫ్ట్ కారులో ఉన్నాయి.

కాగా రానున్న సంవత్సరంలో మారుతి సుజుకి 2024 స్విఫ్ట్‌ను భారత్‌లోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ ADAS ఫీచర్లు భారత్‌లో రానున్న మారుతి స్విఫ్ట్ కొత్త కారులో ఉంటాయో లేదో సంస్థ ధ్రువీకరించలేదు. కొత్త మోడల్ ధర రూ. 5.99 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమై.. వేరియంట్ ప్రకారం ధర ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
కొత్త మారుతి సుజుకి స్విఫ్ట్ హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్, టాటా పంచ్ వంటి మోడళ్లతో పోటీ పడుతుందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన జపాన్ మొబిలిటీ షోలో 2024 సుజుకి స్విఫ్ట్‌ను ఆవిష్కరించారు. ఇందులో ADAS ఫీచర్లను ప్రదర్శించారు. అయితే ఈ ఫీచర్లు ఇండియా స్పెక్ స్విఫ్ట్ కారులో ఉంటాయా అనే దానిపై స్పష్టత లేదు.



Click it and Unblock the Notifications








