కారు ఇన్సూరెన్స్ చేస్తున్నారా.. అయితే ఈ కవరేజ్‌నే ఎంచుకోండి.. లేదంటే మీకు ఒక్క రూపాయి కూడా రాదు.!!
కొత్త కారు కొనుగోలు చేసేటప్పుడు కస్టమర్లు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం తప్పనిసరి. ఎందుకంటే ప్రమాదాలు, ఇతర సందర్భాల్లో ఇన్సూరెన్స్‌ను క్లెయిమ్ చేసుకోవడం ద్వారా కారు రిపేర్లకు అయ్యే ఖర్చు మొత్తాన్ని బీమా సంస్థ భరిస్తుంది. అయితే 95 శాతం కార్ల యజమానులు ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు జీరో డిప్రిషియేషన్ ఆప్షన్‌ను ఎంచుకుంటారు. అది ఎందుకంటే..
కొత్త కార్ల యజమానులు మాత్రమే కాదు, ఇప్పటికే ఉన్న పాలసీదారులు కూడా Zero Depreciation కవర్‌ను ఎంచుకుంటున్నారని అధ్యయనంలో తేలింది. దాదాపు 85 శాతం మంది కస్టమర్లు పాలసీ మూడేళ్ల వరకు ఈ కవరేజ్‌ను సెలెక్ట్ చేసుకుంటారని PolicyBazaar చేసిన అధ్యయనంలో వెల్లడైంది.

జీరో-డెప్ బీమా పాలసీలకు.. దేశంలోని దాదాపు 95 శాతం మంది కార్ల కొనుగోలుదారులు ఆసక్తి చూపుతున్నారని పాలసీబజార్ మోటార్ బిజినెస్ హెడ్ నితిన్ కుమార్ పేర్కొన్నారు. అసలు ఈ జీరో డిప్రిషియేషన్ పాలసీ కవర్ అంటే ఏంటి.. దీనివల్ల పాలసీదారులకు ఏం ప్రయోజనమంటే..
పాలసీదారు(Policy Holder) తన ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకున్నప్పుడు తగ్గింపులు లేకపోవడంతో జీరో డిప్రిసియేషన్ పాలసీల కింద వచ్చే క్లెయిమ్ మొత్తాలు.. సగటు క్లెయిమ్‌ల కంటే ఎక్కువగా ఉంటాయి. ఈ కారణంగానే కస్టమర్లు ఎక్కువగా ఈ ఆప్షన్‌ను ఎంచుకుంటున్నారు. కానీ ఈ పాలసీలో కొన్ని నిబంధనలు ఉంటాయి.. అవేంటంటే..

జీరో డిప్రిషియేషన్ కవర్ ఆప్షన్ లేని పాలసీల కింద పాలసీదారు రూ. 13,000 నుంచి రూ. 14,000 చెల్లించాల్సి ఉంటుంది. కానీ జీరో డిప్రిషియేషన్ కవర్ కింద ఆ క్లెయిమ్ మొత్తం రూ. 21,000 నుంచి రూ. 22,000 వరకు ఉంటుంది.
ఈ మొత్తం పెరిగినప్పటికీ.. కార్ల యజమానులు ఈ జీరో డిప్రిషియేషన్ కవర్ ఆప్షన్‌కే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని నితిన్ కుమార్ అన్నారు. సేఫ్టీ ఫీచర్ల దృష్ట్యా అత్యాధునిక కార్లను కొనుగోలు చేయడం ద్వారా.. ఈ పాలసీని తీసుకోవడానికి కస్టమర్లు వెనుకాడటం లేదు. ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునేటప్పుడు కారు డిప్రిషియేషన్ వ్యాల్యూ పరిగణనలోకి తీసుకుంటారు.

బీమా పాలసీని క్లెయిమ్ చేసుకునేటప్పుడు.. ముందుగా కారుకు జరిగిన నష్టాన్ని అంచనా వేస్తారు. ఆ తర్వాత పాలసీదారుకు చెల్లించాల్సిన మొత్తం క్లెయిమ్ నుంచి డిప్రిషియేషన్ వ్యాల్యూని మినహాయించి.. మిగతా మొత్తాన్ని చెల్లిస్తారు. అందుకే పాలసీదారులు ఎక్కువగా ఈ ఆప్షన్‌ను ఎంచుకుంటున్నారు. ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు జీరో డిప్రిషియేషన్‌కు యాడ్- ఆన్(Add On) ఆప్షన్ ఉంటుంది.
జీరో డెప్ కవర్‌ను బంపర్ టు బంపర్ కవర్ అని కూడా అంటారు. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న పాలసీదారులకు క్లెయిమ్ చేసుకునే సమయంలో ఎలాంటి తరుగుదల లేకుండా మొత్తం డబ్బు చెల్లిస్తారు. ఉదాహరణకు మీ కారు డ్యామేజ్ రిపేర్ ఖర్చు రూ. 10,000 అనుకుందాం. దానికి మీరు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తారు.

ఆ తర్వాత బీమాదారు మొదట డిప్రిషియేషన్ వాల్యూను లెక్కిస్తారు. ఒకవేళ అది 20 శాతం అనుకుందాం. అప్పుడు మీరు క్లెయిమ్ చేసిన రూ. 10,000 మొత్తంలో 2000 తీసేసి రూ. 8000 మీకు చెల్లిస్తారు. మీరు జీరో డెప్ కవర్‌ను తీసుకున్నట్లయితే ఎలాంటి తరుగుదల లేకుండా మీరు క్లెయిమ్ చేసిన రూ. 10,000 మొత్తాన్ని చెల్లిస్తుంది. అయితే ఇందులో నామమాత్రపు ఫైలింగ్ ఛార్జెస్ ఉంటాయని గమనించాలి.
మీరు కారు ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు.. మీ బీమా పాలసీతో(ఐదేళ్లు లేదా ఏడేళ్ల వరకు) జీరో డిప్రిషియేషన్‌ను ఆప్షనల్‌గా అందిస్తుంది. ఆ తర్వాత యాడ్-ఆన్ సదుపాయం ఉంటుంది. అయితే మీరు జీరో డెప్ కవర్ తీసుకున్నప్పుడు.. ప్రీమియం పెరుగుతుందని గుర్తుంచుకోవాలి. ఈ రెండింటికీ మధ్య మీరు కట్టే ప్రీమియంలో దాదాపు 20 శాతం తేడా ఉంటుంది.
సాధారణంగా పాత కారుకు జీరో డెప్ ప్రీమియం ఎక్కువ. ఇంకా తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాలు, ప్రకృతి వైపరీత్యాలకు గురయ్యే ప్రాంతాల్లో నివసించే వ్యక్తి కారు ఇన్సూరెన్స్ చేయించుకుంటే ఆ ప్రీమియం ఎక్కువగా ఉంటుంది. మీరు నివసించే ప్రాంతం బట్టి ప్రీమియంలు మారుతూ ఉంటాయి.
కానీ జీరో డిప్రిషియేషన్ కవర్ కింద పాలసీ.. ఏడాదిలో ఒకసారి లేదా రెండు సార్లు మాత్రమే క్లెయిమ్ చేసుకోవచ్చు. కానీ జీరో డెప్ కవర్ లేని కారు ఇన్సూరెన్స్ విషయంలో క్లెయిమ్‌లపై ఎలాంటి పరిమితి లేదు. జీరో డెప్ కవర్ అనేది.. యాక్సిడెంట్లు జరిగిన సందర్భాల్లో మీకు ఆర్థిక ఒత్తిడిని తగ్గిస్తుంది. ప్రీమియం, లగ్జరీ కార్లకు ఇది బెటర్ ఆప్షన్ అని చెప్పవచ్చు.


Click it and Unblock the Notifications








