Prabhas Cars Collection రెబెల్ స్టార్ ప్రభాస్ కాస్ట్లీ కార్లు.. ఒక్కో కారుకు ఒక్కో వెరైటీ..

బాహుబలితో పాన్‌ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్. రామాయణ ఇతిహాసం ఆధారంగా తీసిన ఆదిపురుష్‌తో మళ్లీ దేశవ్యాప్తంగా ప్రేక్షక అభిమానులను అలరిస్తున్నాడు యంగ్‌ రెబల్‌ స్టార్‌. భారీ బడ్జెట్‌ సినిమాలతో దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించిన డార్లింగ్‌కు.. కార్లంటే చాలా ఇష్టం.

ఇప్పటివరకూ ప్రభాస్ వద్ద ఉన్న కార్ల సేకరణ చూస్తే ఎవరైనా అమ్మో అని ఆశ్చర్యపోవాల్సిందే. విలాసవంతమైన మరియు అధిక పనితీరు గల వాహనాల పట్ల అతనికున్న అనుబంధాన్ని ఈ కార్లు ప్రదర్శిస్తాయి. వీటి విలువ కొన్ని కోట్ల రూపాయలు ఉంటుంది. ప్రభాస్ కలెక్షన్‌లో ఉన్న అద్భుతమైన కార్లు వాటి ఫీచర్ల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.

Lamborghini-Aventador

లంబోర్ఘిని అవెంటేడర్ : ప్రభాస్ వద్ద ఉన్న ఆరెంజ్ కలర్ అవెంటడోర్ ఎస్ రోడ్‌స్టర్‌ కారు గురించి పరిశీలిస్తే.. భారతదేశంలోని తాజా అవెంటడోర్ డెలివరీలలో ఇది ఒకటి. ఇది 6.5-లీటర్ నేచురల్లీ-ఆస్పిరేటెడ్ V12 పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజిన్ 7-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఇది గరిష్ఠంగా 770 PS శక్తి వద్ద 720 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

Rolls-Royce-Ghost

రోల్స్ రాయిస్ ఫాంటమ్ : రోల్స్ రాయిస్ కార్లు లగ్జరీ కార్ అనే పదాలకు అర్థాన్ని ఇస్తాయి. డార్లింగ్‌ ప్రభాస్.. 7వ తరం రోల్స్ రాయిస్ ఫాంటమ్‌ బ్లాక్‌ కలర్ కారును కలిగి ఉన్నాడు. 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడింది. 6.75-లీటర్ V12 ఇంజిన్‌తో ఆధారితమైన ఈ మోడల్ 460 PS పవర్ వద్ద 720 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

Range-Rover

ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ : ప్రభాస్ శాంటోరిని బ్లాక్ కలర్‌లో 4వ తరం రేంజ్ రోవర్‌ని కలిగి ఉన్నాడు. 4.4-లీటర్ డీజిల్ V8 ఇంజిన్‌తో అమర్చబడి ఉంటుంది. 340 PS శక్తి వద్ద 740 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 8 స్పీడ్‌ ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడింది. ప్రభాస్ వద్ద రేంజ్ రోవర్ లాంగ్-వీల్ బేస్ వెర్షన్ ఉంది.

జాగ్వార్ ఎక్స్‌జె : ప్రభాస్ తొలి లగ్జరీ కారు ఇదే. రకరకాల లగ్జరీ కార్లు కొన్నా తన సిల్వర్ జాగ్వార్ ఎక్స్‌జే కారును జాగ్రత్తగా చూసకుంటున్నాడు ప్రభాస్. ప్రభాస్‌కు 4వ తరం ఎక్స్‌జె కారు ఉంది. XJ 3.0-లీటర్ ట్విన్-టర్బోచార్జ్డ్‌ V6 డీజిల్ ఇంజిన్‌తో ఆధారితమైనది. ఇది 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. 275 PS పవర్ వద్ద 600 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

Jaguar-XJ

బీఎమ్‌డబ్ల్యూ X5 : ప్రభాస్ ఒక నల్లని BMW X3ని కలిగి ఉన్నట్లు సమాచారం. కానీ ఈ కారులో ప్రభాస్ ఎక్కువగా బయటకు వచ్చినట్లు కనిపించలేదు. అందువల్ల, X5 SUV ఏ సంవత్సరంలో తయారు చేయబడిందో తెలియదు. ప్రభాస్ 2వ తరం BMW ఎక్స్5 మోడల్‌కు ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను కలిగి ఉన్నాడని సమాచారం.

రెండవ తరం మోడల్ యొక్క ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌గా BMW X5 3.0-లీటర్ స్ట్రెయిట్ సిక్స్ డీజిల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. 8-స్పీడ్ ZF ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడి ఉంటుంది. 255 PS పవర్ వద్ద 560 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కార్లన్నింటిని పరిశీలిస్తే ప్రభాస్‌కు లగ్జరీ కార్లు మరియు ల్యాంబోర్గినీ అవెంటడోర్ వంటి స్పోర్ట్స్ కార్లంటే చాలా ఇష్టమని తెలుస్తోంది.

More from DriveSpark

Article Published On: Tuesday, June 27, 2023, 10:02 [IST]
English summary
Actor prabhas luxury car collections from lamborghini aventador to range rover
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+