హ్యుందాయ్ ఐయోనిక్ 5 ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేసిన షారుఖ్ ఖాన్.. ఇక్కడే మరో స్పెషల్.!!
బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ హ్యుందాయ్ ఐయోనిక్ 5(Hyundai Ioniq 5) ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేశారు. అయితే దీనికో ప్రత్యేకత కూడా ఉంది. షారుఖ్ ఖాన్ ఈ సరికొత్త ఖరీదైన ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేయడంతో ఈ సంస్థ అరుదైన మైలురాయిని చేరుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
భారత మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన కార్ల కంపెనీల్లో హ్యుందాయ్ మోటార్స్ ఒకటి.. కాగా ఈ ఏడాది జనవరిలో జరిగిన 2023 ఆటో ఎక్స్‌పోలో హ్యుందాయ్ ఐయోనిక్ 5 ఎలక్ట్రిక్ కారు విడుదలైంది. ఇటీవలే ఈ కారు 1000 యూనిట్ల సేల్స్‌ను పూర్తి చేసుకోగా.. తాజాగా మరో 100 యూనిట్లను విక్రయించి రికార్డు సృష్టించింది.

హ్యుందాయ్ ఐయోనిక్ 5 ఎలక్ట్రిక్ కారు తాజాగా 1100 యూనిట్ల మైలురాయికి చేరుకుంది. అయితే దీనికో ప్రత్యేకత ఉంది. ఇటీవల బాలీవుడ్ ప్రముఖ హీరో షారుఖ్ ఖాన్ ఈ ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేశారు. ఈ క్రమంలో తాజాగా హ్యుందాయ్ ఐయోనిక్ 5 ఎలక్ట్రిక్ కారు 1100 వ యూనిట్‌ను షారుఖ్‌కు సంస్థ డెలివరీ చేసింది. దీంతో ఇది కంపెనీకి బూస్ట్‌నిచ్చిందనే చెప్పొచ్చు.
అయితే ఇక్కడ ప్రస్తావించదగిన మరో విషయం కూడా ఉంది. ఇతర బాలీవుడ్ నటుల మాదిరిగానే షారుఖ్ ఖాన్‌కు వద్ద కార్ కలెక్షన్ చాలా ఉంది. రోల్స్ రాయిస్ కల్లినన్ బ్లాక్ బ్యాడ్జ్, రోల్స్ రాయిస్ ఫాంటమ్ డ్రాప్ హెడ్ కూపే వంటి లగ్జరీ కార్లు షారుఖ్ సొంతం.
వీటితో పాటు షారుఖ్ ఖాన్(Shahrukh Khan) బెంట్లీ కాంటినెంటల్ GT మరియు BMW i8 వంటి కార్లను కూడా కలిగి ఉన్నాడు. ఇవన్నీ ICG కార్లు. కానీ షారుఖ్ వద్ద ఒక్క ఎలక్ట్రిక్ కారు కూడా లేదు. అయితే ఇప్పుడు ఆ లోటు తీరింది. ఎందుకంటే షారుఖ్ ఖాన్ కొనుగోలు చేసిన తొలి ఎలక్ట్రిక్ కారు హ్యుందాయ్ ఐయోనిక్ 5.
ఇక హ్యుందాయ్ Ioniq 5 ఎలక్ట్రిక్ కారు బ్యాటరీ ప్యాక్ విషయానికొస్తే ఇందులో 72.6 kWh బ్యాటరీ ప్యాక్‌ను ఉపయోగించారు. పూర్తి ఛార్జ్‌పై ఈ కారు 631 కి.మీ రేంజ్ ఇస్తుందని సమాచారం. కాగా ఈ రేంజ్‌ను ARAI ధ్రువీకరించింది.
హ్యుందాయ్ ఐయోనిక్ 5 ఎలక్ట్రిక్ కారులోని ఈ అతిపెద్ద బ్యాటరీ ప్యాక్‌లో 350kW DC ఫాస్ట్ ఛార్జర్‌ని ఉపయోగించారు. ఇది బ్యాటరీని కేవలం 18 నిమిషాల్లో 10 శాతం నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేస్తుంది. ఇంకా ఈ లగ్జరీ ఎలక్ట్రిక్ కారులో ఆకర్షణీయమైన అధునాతన ఫీచర్లు ఉన్నాయి. కాగా Hyundai Ioniq 5 ఎలక్ట్రిక్ కారు ధర రూ. 45.95 లక్షలు మాత్రమే.
ప్రముఖ కారు బ్రాండ్ షారుఖ్ ఖాన్ ఈ సరికొత్త హ్యుందాయ్ ఐయోనిక్ 5 ఎలక్ట్రిక్ కారును డెలివరీ తీసుకోవడంతో, మున్ముందు ఈ కారుకు ఆదరణ పెరుగుతుందని సమాచారం. రాబోయే రోజుల్లో ఈ ఎలక్ట్రిక్ కారు సేల్స్ మరింత పెరిగే అవకాశం ఉంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








