లగ్జరీ కారును కొనుగోలు చేసిన టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్.. వైరల్ అవుతున్న హోం డెలివరీ వీడియో..
ఎవరైనా సరే కారు కొనుగోలు చేసుకునేముందు చాలా ఆలోచిస్తారు. ఏ కారు కొనాలి. ఎంత బడ్డెట్‌లో కొనాలి. మైలేజ్, పనితీరు, సేఫ్టీ తదితర కీలక విషయాలను పరిగణనలోకి తీసుకుంటాం. ఇంకా ముందుగా ప్రతి షోరూమ్‌ని సందర్శించి ప్రముఖ కార్ మోడళ్లను ఎంచుకుని వాటిని టెస్ట్ డ్రైవ్ చేస్తారు.
టెస్ట్ డ్రైవ్ చేసిన అనంతరం కారు నచ్చితే బుక్ చేసుకుంటారు. ఆ తర్వాత డెలివరీ తీసుకోవడానికి మళ్లీ డీలర్‌షిప్‌ను సందర్శించాల్సి ఉంటుంది. ఏ కంపెనీ కారు అయినా ఇదే ఫార్మాలిటీ ఉంటుంది. కానీ మీరు లగ్జరీ కారు కొనుగోలు చేయాలి అనుకున్నప్పుడు మాత్రం మీకు చాలా ఛాయిస్‌లు ఉంటాయి. అందుకోసం మీరు డీలర్‌షిప్‌ను సందర్శించాల్సిన అవసరం కూడా లేదు.

ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ విషయంలో ఇదే జరిగింది. ఆమె ఖరీదైన లగ్జరీ కారును కొనుగోలు చేశారు. ఆ కారు డెలివరీ తీసుకోవడానికి షోరూంకు వెళ్లలేదు. దర్జాగా ట్రక్కులో తీసుకువచ్చి ఇంటికి చేర్చారు. ఇంతకీ ఆ కారు మోడల్ ఏంటి.. ఎన్ని కోట్లు విలువ ఉంటుంది. పూర్తి వివరాలు ఈ కథనంలో..
మెర్సిడెస్ మేబాచ్ (Mercedes Maybach) GLS600 దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన SUV. ఈ కారును ఎక్కువగా సెలబ్రిటీలు, ప్రముఖులు కొనుగోలు చేస్తారు. తాజాగా ఈ కారును టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ఇంటికి ఎలా డెలివరీ చేశారో పూర్తి వీడియోను మీరు చూడవచ్చు.

తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ నివాసం ముందు మెర్సిడెస్ మేబాచ్ కారు డెలివరీ చేస్తున్న ఈ వీడియో రికార్డైంది. కోట్ల విలువ చేసే ఈ సూపర్ లగ్జరీ SUVని కొనుగోలు చేసిన బి-టౌన్‌లోని తాజా సెలబ్రిటీలో ఒకరుగా రకుల్ నిలిచింది. కొత్త మెర్సిడెస్ కారును ట్రక్కులో రకుల్ ఇంటికి తీసుకువచ్చారు. దుమ్ము, స్క్రాచెస్ నుంచి రక్షించడానికి అల్లాయ్‌వీల్స్‌ను కవర్‌తో కప్పారు.
అనంతరం రకుల్ ప్రీత్ సింగ్ ఇంటికి సురక్షితంగా మెర్సిడెస్ మేబాచ్ GLS 600 ను చేర్చారు. ఈ కారును డీలర్ డెలివరీ చేసిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఈ విధంగా లగ్జరీ కార్ల డీలర్లు సురక్షితంగా ఇంటికి డెలివరీ చేస్తున్నారు. Mercedes Maybach GLS 600 లగ్జరీ కారు ఆన్-రోడ్ ధర దాదాపు రూ. 3.5 కోట్లు.

తమిళ, తెలుగు భాషల్లో నటిస్తున్న ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్‌కు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. రకుల్ లగ్జరీ కారును కొనుగోలు చేయడం పట్ల అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఈ లగ్జరీ కారు విశేషాలు, ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే. వాటిపై ఓ లుక్కేయండి మరి..
మేబాచ్ GLS 600 ఫీచర్లలో షాంపైన్ బాటిల్‌ను చల్లగా ఉంచడానికి మినీ ఫ్రిజ్, ఎలక్ట్రానిక్ పనోరమిక్ స్లైడింగ్ సన్ రూఫ్, వెంటిలేటెడ్ మరియు మసాజ్ సీట్లు ఉన్నాయి. అదేవిధంగా, ఈ కారులో భద్రతా ఫీచర్లు చాలా ఉన్నాయి. ఈ కారులో యాక్టివ్ డిస్టెన్స్ అసిస్ట్ డిస్ట్రోనిక్ కూడా అందించారు.
ఇవి కాకుండా, యాక్టివ్ లేన్ కీపింగ్ అసిస్ట్, యాక్టివ్ బ్లైండ్ స్పాట్ అసిస్ట్, యాక్టివ్ బ్రేక్ అసిస్ట్, యాక్టివ్ స్టీరింగ్ అసిస్ట్ మొదలైనవి కూడా మేబాచ్ GLS 600లో ఉన్నాయి. ఇంకా, ఈ కారులో 8 ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరా, అడాప్టివ్ హై బీమ్ అసిస్ట్, డౌన్‌హిల్ స్పీడ్ రెగ్యులేషన్, కార్ వాష్ మోడ్, DBMS, ABS మరియు EPS వంటి ఫీచర్లు ఉన్నాయి.
ఇంత సూపర్ క్వాలిటీ లగ్జరీ ఎస్‌యూవీని రకుల్ ప్రీత్ సింగ్ కొనుగోలు చేశారు. కారు మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీతో కూడిన 4.0-లీటర్ ట్విన్-టర్బో V8 పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ మోటార్ గరిష్ఠంగా 558 HP వద్ద 730 NM టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.
ఇది 9 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడింది. దీని హైబ్రిడ్ సిస్టమ్ అదనంగా 22 హెచ్‌పి పవర్ మరియు 250 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీపికా పదుకొణె, అజయ్ దేవగన్, అర్జున్ కపూర్, కృతి సనన్, రణవీర్ సింగ్, శిల్పా శెట్టి, మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి, రామ్ చరణ్ ఇలా చాలా మంది నటులు తమ గ్యారేజీలో GLS 600ని కలిగి ఉన్నారు.


Click it and Unblock the Notifications








