కారు కొనుగోలు చేస్తున్నారా.. అధిక మైలేజ్, మెరుగైన ఫీచర్లు కలిగిన 7- సీటర్ MPVలు..!
భారత్‌లోని కార్ల వినియోగదారులు అధునాతన ఫీచర్లు, ఆకర్షణీయమైన డిజైన్, భద్రతతో కూడిన కొత్త కార్ల గురించి ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో 7- సీటర్ వాహనాలు ( affordable 7 seater cars ) అందుబాటులో ఉన్నాయి. వాటిలో 5 వాహనాల జాబితాను మీకు అందిస్తున్నాం.
కియా కారెన్స్ : కియా కారెన్స్ మెరుగైన భద్రతను అందిస్తుంది. ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, డౌన్‌హిల్ బ్రేక్ కంట్రోల్, ఆల్‌వీల్ డిస్క్ బ్రేక్, ట్రైర్ ప్రెజర్ మానిటర్, రియర్ పార్కింగ్ సెన్సార్‌లు, ABS- యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ సహా మరిన్ని భద్రతా లక్షణాలను సహా మెరుగైన బిల్డ్ క్వాలిటీని కలిగి ఉంటుంది.
కియా కారెన్స్ కారు రెండు పెట్రోల్ ఇంజిన్‌లను కలిగి ఉంటుంది.

1.5 లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ ఇంజిన్ 113bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అదే 1.5 లీటర్ టర్భో ఇంజిన్ 158bhp శక్తి మరియు 253 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. నేచురల్ ఆస్పిరేటెడ్ ఇంజిన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో మాత్రమే అందుబాటులో ఉంటుంది.
టర్బో ఇంజిన్‌లో 6-స్పీడ్ iMT క్లచ్‌లెస్ ట్రాన్స్‌మిషన్ మరియు 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను కలిగి ఉంటుంది. మరియు కియా కారెన్స్ 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్.. 113bhp శక్తి మరియు 250Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ క్లచ్‌లెస్ గేర్‌బాక్స్ 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ జతచేయబడింది.

రెనాల్ట్ ట్రైబర్ : రెనాల్ట్ ట్రైబర్ ప్రస్తుతం మార్కెట్లో అత్యంత సరసమైన MPV ల్లో ఒకటిగా ఉంది. ఈ ఎంపీవీ.. భారత్‌లో రెనాల్ట్ యొక్క అత్యధికంగా అమ్ముడవుతున్న వాహనంగా ఉంది. ఈ కారు 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో 71 bhp శక్తి, 96Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా 5-స్పీడ్ AMTతో జతచేయబడింది.
భద్రతా పరంగా ట్రైబర్ గ్లోబల్ NCAP క్రాష్ టెస్టుల్లో 4- స్టార్ రేటింగ్‌ను అందుకుంది. ఫలితంగా సురక్షితమైన ఎంపీవీగా గుర్తింపు పొందింది. రెనాల్ట్ MPV 8 - అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కూల్డ్ గ్లోవ్ బాక్స్ మరియు సెంటర్ కన్సోల్‌తో వస్తుంది.

మారుతి సుజుకి ఎర్టిగా / టయోటా రూమియన్ : మారుతి సుజుకి ఎర్టిగా. టయోటా రూమియన్ రెండు కూడా మూడు వరుసల సెడాన్‌లు. ఈ ఎంపీవీ 1.5 లీటర్ ఇంజిన్ 102bhp శక్తి, 136.2Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు కార్లు రెండు గేర్‌బాక్స్‌లను కలిగి ఉంటాయి. మరియు 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్, ప్యాడిల్ షిఫ్టర్లలతో కూడిన 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడుతుంది.
ఈ రెండు ఎంపీవీలు 7-అంగుళాల టచ్‌స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లేను సపోర్టు చేస్తాయి. భద్రత పరంగా డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, EBD మరియు బ్రేక్ అసిస్ట్‌తో కూడిన ABS- యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్, రియర్ పార్కింగ్ సెన్సార్, రెండో వరుసలో ISOFIX చైల్డ్ సీట్ యాంకరేజ్‌లను కలిగి ఉంటుంది.
మహీంద్రా బొలెరో నియో : మహీంద్రా బొలెరో నియో కారు కేవలం డీజిల్ ఇంజిన్ వేరియంట్‌లోనే ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఈ కారు 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ 99 bhp శక్తి, 260 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ డీజిల్ ఇంజిన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది.
సిట్రయెన్ C3 ఎయిర్‌క్రాస్ : సిట్రోయెన్ ప్రస్తుతం మిడ్ రేంజ్ SUVలను ఉత్పత్తి చేసే ఏకైన సంస్థగా ఉంది. C3 ఎయిర్‌క్రాస్ 5-సీటర్ మరియు 5+2 సీట్లలో అందుబాటులో ఉంది. ఈ కారు 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ 109 bhp శక్తి, 190Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
ఈ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ వాహనం 18.5 kmpl మైలేజీని ఇస్తుంది. మరియు 10- అంగుళాల టచ్‌స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. వైర్డ్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లేను సపోర్టు చేస్తుంది. మరియు మాన్యువల్ ఏసీ, ట్విన్ ఎయిర్‌బ్యాగ్, టైర్ ప్రజర్ మానిటర్ ఉన్నాయి.


Click it and Unblock the Notifications








