రూ.99,000 ధరకే ఎలక్ట్రిక్‌ కారు.. 152 కి.మీ రేంజ్..!!

ప్రస్తుత రోజుల్లో బైక్‌ కొనుగోలు చేయాలన్నా.. లక్ష రూపాయలకు పైగా ఖర్చు అవుతుంది. అలాంటిది ఓ సంస్థ ఎలక్ట్రిక్‌ కార్లను లక్ష కంటే తక్కువ ధరకే విక్రయించింది. దీంతో ఆ సంస్థ ఏంటి, కారు ప్రత్యేకతలు ఏంటి అనేదానిపై చాలా మందికి ఆసక్తి నెలకొంది. నానో కారు కంటే తక్కువ ధరకే లభించే కారు వివరాలు మీకోసం.

చైనాలో ప్రముఖ సంస్థ అలీబాబా ఇటీవల ఓ కార్యక్రమం నిర్వహించింది. ఎలక్ట్రిక్‌ వెహికల్‌ ఆఫ్ ది వీక్‌ పేరిట భారీ సేల్‌ నిర్వహించింది. ఈ సేల్‌లో ఎలక్ట్రిక్‌ కారును $1199 (అమెరికన్‌ డాలర్లు) ధరకే విక్రయించినట్లు తెలుస్తోంది. అంటే భారత కరెన్సీ ప్రకారం ఈ ఎలక్ట్రిక్‌ కారు ధర రూ.99,000గా ఉంది.

Alibaba cheap 2 seater electric car

అయితే ఇక్కడే ఓ ట్విస్ట్‌ ఉంది. చైనాలో ఈ కారును కొనుగోలు చేసిన కస్టమర్లు భారత్‌ సహా ఇతర దేశాలకు తీసుకెళ్లేందుకు వీలు లేదు. అయితే తక్కువ ధర కారణంగా డిజైన్‌ ఆకర్షణీయంగా, కీలక ఫీచర్లను కలిగి లేదు. కారు ముందు భాగం పులి మాదిరిగా డిజైన్‌ను కలిగి ఉంది. అయితే ఈ ఎలక్ట్రిక్‌ కారు ఎలాంటి భద్రత, బిల్డ్‌ క్వాలిటీని కలిగి ఉందో సమాచారం వెల్లడి కాలేదు.

ఈ కారు 35kW మోటార్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్‌ చేస్తే 152 కి.మీ రేంజ్‌ ఇస్తుంది. ఈ ఎలక్ట్రిక్‌ కారు గరిష్ఠ వేగం 120 కి.మీ వేగంతో ప్రయాణించగలదని తెలుస్తోంది. ఈ కారులో కేవలం ఇద్దరు కూర్చొని ప్రయాణించే వీలు ఉంది.

Alibaba cheap 2 seater electric car

అలీబాబా సంస్థ విక్రయించిన ఎలక్ట్రిక్‌ కారు పట్టణ వినియోగానికి సరిగా సరిపోతుంది. తక్కువ స్థలంలో పార్కింగ్‌ చేయవచ్చు. అయితే రేంజ్ కారణంగా దూర ప్రాంత ప్రయాణాలకు ఈ కారు సౌకర్యవంతంగా ఉండదు. ఎక్కువ సామర్థ్యం కలిగిన బ్యాటరీని అమర్చుకొనే అవకాశం ఉందో లేదో సంస్థ స్పష్టత ఇవ్వలేదు.

కారులోపల భాగం లగ్జరీగా అనిపించదు. డ్యాష్‌బోర్డులో AC వెంట్స్‌, ఆకట్టుకొనే స్టీరింగ్ వీల్‌, పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌, ఇద్దరు వ్యక్తులు సౌకర్యవంతంగా కూర్చొనే విధంగా రెండు సీట్లు ఉంటాయి. ఈ కారు యొక్క బాహ్య ప్యానల్‌ అల్యూమినియం, ఫైబర్‌తో తయారుచేయబడినట్లు తెలుస్తోంది.

Alibaba cheap 2 seater electric car

అలీబాబా సంస్థ విక్రయించిన ఎలక్ట్రిక్‌ కారు ఎలాంటి భద్రతా ప్రమాణాలు కలిగి ఉంది. మరియు ఈ కారును ఏ సంస్థ తయారు చేసింది. భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉందా లేదా అనే సమాచారం వెల్లడి కాలేదు. ఎలక్ట్రిక్ కారు ప్రత్యేక సేల్‌లో భారత కరెన్సీ ప్రకారం.. రూ.99000 విక్రయించారు. అయితే సేల్ అనంతరం ధర అంతే ఉందా పెరిగిందా అనే సమాచారం లేదు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Thursday, August 31, 2023, 18:46 [IST]
English summary
Alibaba cheap 2 seater electric car sale details in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+